Omar Abdullah Oath Ceremony : జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్ముకశ్మీర్‌కు తొలి సీఎం అయ్యారు. శ్రీనగర్‌లోని షేర్-ఇ- కశ్మీర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఒమర్ అబ్దుల్లాతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, ఆప్ నేత సంజయ్ సింగ్, ఎన్సీపీ ఎంపీ సుప్రీయా సూలే, సీపీఐ నేత డీ రాజా హాజరయ్యారు.
'అందుకే నూతన ప్రభుత్వంలో చేరడం లేదు'
ఒమర్ అబ్దుల్లాతో పాటు మరో ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా సురీంద్ర కుమార్ చౌదరీ బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఆరుగురు నేతలు ఎవరూ ప్రమాణస్వీకారం చేయడం లేదని జమ్ముకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా వెల్లడించారు. 'ప్రస్తుతానికి మేం జమ్మూకశ్మీర్‌లోని నూతన ప్రభుత్వంలో చేరడం లేదు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కాంగ్రెస్ బలంగా డిమాండ్ చేసింది. కానీ, అది ఇంతవరకు అది జరగలేదు. అసంతృప్తిగా ఉన్నాం. ఈ విషయంలో మా పోరాటాన్ని కొనసాగిస్తాం'అని హమీద్ పేర్కొన్నారు.
#WATCH | Omar Abdullah takes oath as the Chief Minister of Jammu and Kashmir.
— ANI (@ANI) October 16, 2024
The leaders from INDIA bloc including Lok Sabha LoP Rahul Gandhi, Congress leader Priyanka Gandhi Vadra, JKNC chief Farooq Abdullah, Samajwadi Party chief Akhilesh Yadav, PDP chief Mehbooba Mufti, AAP… pic.twitter.com/IA2ttvCwEJ
Jammu and Kashmir Pradesh Congress Committee (JKPCC) Chief Tariq Hameed Karra today said that Congress Party is not joining the Ministry in Jammu and Kashmir government at the moment. Congress has strongly demanded from the Centre to restore Statehood to J&K, besides the Prime… pic.twitter.com/Ef4ytExLjy
— ANI (@ANI) October 16, 2024
మరోవైపు చాలా కాలం తర్వాత జమ్ముకశ్మీర్‌లో స్థిరతమైన ప్రభుత్వం వచ్చినందకు సంతోషంగా ఉందని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం- ప్రజల సమస్యలను, బాధలను పరిష్కరిస్తుందని తెలిపారు. 2019 ఆగస్టు 5న కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ ఒక తీర్మానం కొత్త ప్రభుత్వం తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. వాటితో పాటు నిరుద్యోగం, డ్రగ్స్, విద్యుత్ వంటి ప్రధాన సమస్యలను అధిగమించేందుకు మార్గాలను కనుగొంటుందని అన్నారు.
ఒమర్ అబ్దుల్లాకు మోదీ శుభాకాంక్షలు
జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు ఆయన చేస్తున్న కృషికి మంచి జరగాలని అన్నారు. జమ్ముకశ్మీర్ ప్రాంతం అభివృద్ధి కోసం తాము ఒమర్ అబ్దుల్లా సర్కారుతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
Congratulations to Shri Omar Abdullah Ji on taking oath as the Chief Minister of Jammu and Kashmir. Wishing him the very best in his efforts to serve the people. The Centre will work closely with him and his team for J&K's progress. @OmarAbdullah
— Narendra Modi (@narendramodi) October 16, 2024
'నేను వెళ్లేటప్పుడు గ్రీన్ కారిడార్ ఉండదు'
ప్రజలకు అసౌకర్యం కలకకుండా ఉండేందుకు తాను రోడ్డు మార్గంలో వెళ్లే సమయంలో గ్రీన్ కారిడార్ ఉండదని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. తను ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్‌ను నిలిపివేయడం వంటి మానుకోవాలని పోలీసులుకు సూచించినట్లు చెప్పారు. సైరన్ల వినియోగాన్ని తగ్గించాలని నిర్దేశించినట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
I have spoken to the DG @JmuKmrPolice that there is to be no “green corridor” or traffic stoppage when I move anywhere by road. I have instructed him to minimise public inconvenience & the use of sirens is to be minimal. The use of any stick waving or aggressive gestures is to be…
— Omar Abdullah (@OmarAbdullah) October 16, 2024
'అప్పుడు చివరి, ఇప్పుడు మొదటి సీఎం నేనే'
ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు తన తాత షేక్ మహ్మద్ అబ్దుల్లాకు ఒమర్ అబ్దుల్లా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 'కేంద్ర ప్రభుత్వ సహకారంతో పనిచేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. అయితే ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సొంత హక్కు ఉంది. నాకు విచిత్రమైన అనుభవాలు ఉన్నాయి. ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసిన చివరి ముఖ్యమంత్రిని నేనే. ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతానికి తొలి సీఎం. రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం ద్వారా మా పాలన మొదలవుతుంది' అని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
ఇటీవల జరిగిన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి విజయం సాధించాయి. మొత్తం 90 సీట్లగాను ఎన్‌సీ 42 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ ఆరు నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్‌సీ శాసనసభాపక్ష నేతగా ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.