Newborn Found Dead on Road : కేరళ కొచ్చిలో నవజాత శిశువు మృతదేహం రోడ్డుపై పడేసిన కేసు కీలక మలుపు తిరిగింది. తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసిరేసినట్లు 24 ఏళ్ల అత్యాచార బాధితురాలు పోలీసుల ఎదుట అంగీకరించింది. అంతేగాక పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు మరిన్ని బయటపడ్డాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని అపార్ట్మెంట్ బాత్రూమ్లో శుక్రవారం ఉదయం నవజాత శిశువుకు జన్మనిచ్చింది. ఆ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియకూడదని అమెజాన్ డెలివరీ పార్శిల్ కవర్లో నవజాత శిశువును చుట్టి అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి బయటకు విసిరేసింది. ఈ క్రమంలో రోడ్డుపై పడిన నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయింది. కాగా, కొందరు కార్మికులు పార్శిల్ కవర్లో ఉన్న శిశువు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల ఘటనాస్థలికి చేరుకుని నవజాత శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టగా అసలు నిజాలు బయటపడ్డాయి.
నవజాత శిశువును చుట్టిన అమెజాన్ పార్శిల్ కవరే నిందితురాలిని పట్టించింది. ఆ కవర్‌పై ఉన్న అడ్రస్‌ను బట్టి పోలీసులు నిందితురాలిని గుర్తించారు. నిందితురాలు ప్రసవం కోసం వాడిన బాత్రూమ్లో రక్తపు మరకలు ఉండడం కూడా పోలీసులు యువతిపై అనుమానాన్ని మరింత పెంచాయి. అయితే మహిళపై అత్యాచారం లేదా లైంగిక వేధింపుల నిజంగా జరిగిందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
"యువతి శుక్రవారం ఉదయం 5-5.30 గంటలకు తన బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత భయాందోళనకు గురై శిశువును రోడ్డుపైకి విసిరేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది. మహిళా గర్భం దాల్చిన విషయంగానీ, డెలివరీ అయిన సంగతిగానీ ఆమె తల్లిదండ్రులకు తెలియదు. వాడకంలో లేని టాయిలెట్లో మహిళ ప్రసవించడం వల్ల వాళ్లకు ఈ విషయం గురించి పోలీసులు చెప్పే వరకు తెలియలేదు. యువతిపై అత్యాచారం లేదా లైంగిక దాడి జరిగిందని అనుమానిస్తున్నాం. ఈ విషయంపై కూడా విచారణ జరుపుతాం. ప్రస్తుతం యువతిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాం. ప్రసవం అయిన 3 గంటల తర్వాత యువతి నవజాత శిశువును రోడ్డుపైకి విసిరేసింది. మహిళకు వివాహం కాలేదు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో శిశువును రోడ్డుపై పడేసినట్లు తెలుస్తోంది. ఫ్లాట్‌లోని సెక్యూరిటీ గార్డు టిఫిన్ చేసేందుకు వెళ్లినప్పుడు శిశువును బాల్కనీ నుంచి యువతి బయటకు విసిరేసింది." అని కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ ఎస్ శ్యామ్ సుందర్ తెలిపారు.
సల్మాన్ ఖాన్ కాల్పుల కేసు నిందితుడు ఆత్మహత్య- లాకప్‌లోనే సూసైడ్ - Salman Khan shooting case