ETV Bharat / bharat

నీట్​ పేపర్​ లీక్​ మాస్టర్​మైండ్​ అరెస్ట్​- NTA నుంచి దొంగిలించింది ఇతడే! - NEET UG Paper Leak CBI - NEET UG PAPER LEAK CBI

NEET UG Paper Leak CBI : వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌-యూజీ పేపర్​ లీక్​పై దర్యాప్తును ముమ్మరం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ నుంచి ప్రశ్నాపత్రాన్ని దొంగిలించిన పంకజ్​ కుమార్​ను సీబీఐ అరెస్ట్ చేసింది.

NEET UG Paper Leak CBI
NEET UG Paper Leak CBI (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 4:57 PM IST

Updated : Jul 16, 2024, 5:27 PM IST

NEET UG Paper Leak CBI : దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్​ యూజీ పేపర్​ లీక్​లో కీలక పరిణామం! పేపర్​ లీక్​ ప్రధాన నిందితుడిని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అరెస్ట్ చేసింది. ఝార్ఖండ్ హజారీబాగ్​లో నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ నుంచి ప్రశ్నాపత్రాన్ని దొంగిలించిన పంకజ్​ కుమార్​ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఇతడితో పాటు పేపర్​ లీక్​కు సహకరించిన మరో వ్యక్తిని సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో ఇప్పటివరకు పేపర్​ లీక్​ కేసులో అరెస్టైన వారి సంఖ్య 14కు చేరింది.

నిట్​ జంషెడ్​పుర్​లో 2017 బ్యాచ్​ సివిల్​ ఇంజినీర్​ అయిన పంకజ్​ కుమార్-​ హజారీబాగ్​లోని ఎన్​టీఐ ట్రంక్​ పెట్టెల నుంచి నీట్​ ప్రశ్నాపత్రాన్ని దొంగిలించాడు. అనంతరం రాజు సింగ్​ అనే వ్యక్తికి అందజేయగా, అతడు తన గ్యాంగ్​ సభ్యులకు చేరవేశాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరిని అరెస్ట్ చేసింది సీబీఐ. బొకారోకు చెందిన పంకజ్​ కుమార్​ను బిహార్​ రాజధాని పట్నాలో అరెస్ట్ చేయగా, రాజును హజారీబాగ్​లో అదుపులోకి తీసుకున్నారు.

ఇప్పటికే హజారీబాగ్​లో ఇద్దరు అరెస్ట్​
ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఆరు ఎఫ్‌ఐఆర్‌లను సీబీఐ అధికారులు నమోదు చేశారు. ఇందులో బిహార్​లో పేపర్​ లీక్​పై కేసు నమోదు కాగా, మిగిలిన ఐదు గుజరాత్​, రాజస్థాన్​, మహారాష్ట్రలో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు కేంద్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు సీబీఐ సొంతంగా ఎఫ్​ఐఆర్​ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే హజారీబాగ్‌లోని ఒయాసిస్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. అక్కడ కాలిపోయిన ప్రశ్నపత్రాలను బిహార్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జులై 18న విచారణ
కాగా, ఈ ఏడాది మే 5న దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్-యూజీ పరీక్ష జరిగింది. 571 నగరాల్లోని 4,750 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షకు సుమారు 23లక్షల మందికి పైగా హాజరయ్యారు. అయితే, ఇందులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు జులై 18న విచారణ జరపనుంది.

నీట్​ పేపర్​ లీక్​ నిజమే- అలా జరిగితే రీ-టెస్ట్​ తప్పనిసరి : సుప్రీం కీలక వ్యాఖ్యలు - NEET UG Supreme Court Hearing

'నీట్‌ పరీక్షను రద్దు చేయడం కరెక్ట్​ కాదు- లక్షల మంది​ నష్టపోతారు'- సుప్రీంకు కేంద్రం అఫిడవిట్ - Centre files affidavit before SC

Last Updated : Jul 16, 2024, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.