ETV Bharat / bharat

పరీక్ష ముందురోజే ఫోన్​కు PDF- నీట్ పేపర్ లీకేజీపై CBI దర్యాప్తు ముమ్మరం- అధికారులపై స్థానికులు దాడి - NEET UG 2024 Paper Leak

NEET UG Paper Leak CBI : వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌(యూజీ)లో అవకతవకలపై దర్యాప్తును ముమ్మరం చేసిన సీబీఐ, ఆదివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. మరోవైపు మహారాష్ట్రలో ప్రైవేటు కోచింగ్ సెంటర్​ నిర్వహిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు విచారించారు. ఎన్​టీఏ ప్రక్షాళన కోసం ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సోమవారం సమావేశం కానుంది.

NEET UG Paper Leak
NEET UG Paper Leak (ETV Bharat, ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 24, 2024, 7:33 AM IST

NEET UG Paper Leak CBI : నీట్​ పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. పేపర్ లీకేజీ వ్యవహారంపై ఐపీసీలోని 120-బీ (నేరపూరిత కుట్ర), 420 (మోసం) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. కేంద్ర విద్యాశాఖ సూచనల మేరకు నీట్‌లో అక్రమాలపై సీబీఐ పూర్తి స్థాయి విచారణ జరపనుంది. అలాగే బిహార్‌లో పేపర్‌ లీక్, పలుచోట్ల విద్యార్థులు సమయం కోల్పోయారంటూ వారికి గ్రేస్‌ మార్కులు కలపడం వంటి అంశాలపైనా సమగ్రంగా దర్యాప్తు చేయనుంది. ఎఫ్‌ఐఆర్‌లో నిందితులను గుర్తు తెలియని వ్యక్తులుగా పేర్కొంది. మరోవైపు నీట్‌ అక్రమాలకు సంబంధించి మహారాష్ట్రలోని లాతూర్‌లో ప్రైవేటు కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు విచారించారు.

ముందే రోజే పీడీఎఫ్​ రూపంలో సమాధాన పత్రం
నీట్​ అక్రమాలకు సంబంధించి శనివారం ఝార్ఖండ్​లో అరెస్ట్​ చేసిన ఐదుగురిని ఆదివారం బిహార్​కు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మొత్తం 18మందిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో సంజీవ్‌ కుమార్‌ అలియాస్‌ లూటన్‌ ముఖియా గ్యాంగ్‌తో బలదేవ్ కుమార్ కుమ్మక్కయ్యాడు. నీట్ యూజీ సమాధాన పత్రం బలదేవ్​ ఫోన్​కు పీడీఎఫ్​ రూపంలో పరీక్ష ముందు రోజే వచ్చింది. దీనిని ప్రింట్లు తీసి తన దగ్గర రహస్యంగా ఉన్న విద్యార్థులకు పంపిణీ చేశారు. అయితే ఈ ప్రశ్నపత్రాన్ని ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాల నుంచి ముఖియా ముఠా సంపాదించిందని అధికారులు తెలిపారు. కాల్చేసిన పత్రాలను ఎన్‌టీఏ ప్రశ్నాపత్రంతో బిహార్‌ దర్యాప్తు బృందం పోల్చి చూసినప్పుడు సరైనవే అని తేలిందని, దీంతో పేపరు లీకవడం నిజమేనని నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. పేపర్ లీకేజీకి ప్రశ్నపత్రాల రవాణాలో జరిగిన పొరపాట్లను ఒక కారణంగా దర్యాప్తు బృందం తేల్చింది. నిందితుల్లో రాజీవ్‌ కుమార్, పంకు కుమార్, పరంజీత్‌ సింగ్‌లు నకిలీ సిమ్‌లను, వసతిని సమకూర్చారని, విద్యార్థులను తరలించిన ట్యాక్సీ డ్రైవరు ముకేశ్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఉపాధ్యాయులను విచారించిన ఏటీఎస్
మహారాష్ట్రలోని లాతూర్‌లో ప్రైవేటు కోచింగ్‌ సెంటర్‌ నడుపుతున్న ఇద్దరు ఉపాధ్యాయులను ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్‌) పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నాందేడ్‌కు చెందిన ఏటీఎస్‌ విభాగం వారిని శనివారం రాత్రి అదుపులోకి తీసుకుందని, కొన్ని గంటలు ప్రశ్నించాక వదిలేసిందని ఆదివారం అధికారులు తెలిపారు. వారిలో ఒకరు లాతూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు.

మొదటి సమావేశం
నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) ప్రక్షాళన కోసం ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సోమవారం తొలిసారి సమావేశం కానుంది. ఇస్రో మాజీ ఛైర్మన్‌ కె.రాధాకృష్ణన్‌ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కేంద్రప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటుచేసింది. సోమవారం మొదటిసారి సమావేశం కానున్న కమిటీ 2 నెలల్లో నివేదిక సమర్పించాల్సి ఉంది. పరీక్ష ప్రక్రియ ప్రక్షాళన, డేటా సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌ మెరుగుపరచడం, ఎన్‌టీఏ నిర్మాణం, పనివిధానంలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పుల గురించి సిఫార్సు చేయనుంది. అటు నీట్‌లో గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు ఆదివారం తిరిగి పరీక్ష నిర్వహించగా సగం మందికిపైగా డుమ్మాకొట్టారు. ఏడు సెంటర్లలో 1563మందికి పరీక్ష నిర్వహించగా 813మంది మాత్రమే హాజరయ్యారు. 750మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.

సీబీఐ బృందంపై దాడి
యూజీసీ నెట్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై దర్యాప్తులో భాగంగా బిహార్‌లోని నవాదాకు వెళ్లిన సీబీఐ బృందంపై స్థానికులు దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. సీబీఐ ఫిర్యాదు మేరకు దాడికి బాధ్యులైన నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. యూజీసీ-నెట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ సూచన మేరకు సీబీఐ గురువారం ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా అధికారుల బృందం నవాదాలోని కసియాడీహ్‌ గ్రామానికి వెళ్లింది. సీబీఐ వాహనాలను చుట్టుముట్టిన స్థానికులు అధికారులపై దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలో దిగి స్థానికులను చెదరగొట్టారు. ప్రభుత్వ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం, దాడి చేయడం తదితర ఆరోపణలపై కేసు నమోదు చేశారు.

నకిలీ కరెన్సీతో గిరిజనులకు మావోల మోసం- పెద్దఎత్తున డబ్బులు స్వాధీనం

కల్తీసారా బాధితులు కేర్​ లెస్​- లిమిట్​కు మించి తాగడం వల్లే!: కమల్ హాసన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.