ETV Bharat / bharat

'SC, ST ఉపవర్గీకరణ తీర్పుపై సుప్రీంకోర్ట్​లో అప్పీలు చేస్తాం' - చిరాగ్‌ పాసవాన్ - SC Sub Classification Verdict

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 4, 2024, 8:06 AM IST

Chirag Paswan Oppose SC Sub-Classification Verdict : ఎస్సీ రిజర్వేషన్లను ఉపవర్గీకరించేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు 'లోక్‌ జనశక్తి పార్టీ' (రాంవిలాస్‌) పార్టీ నేత, కేంద్ర మంత్రి చిరాగ్‌ పాసవాన్ పేర్కొన్నారు. ఈ తీర్పుపై సుప్రీం కోర్టులోనే అప్పీలు చేయనున్నట్లు ఆయన​ స్పష్టం చేశారు.

Chirag Paswan
Chirag Paswan (ANI)

Chirag Paswan Oppose SC Sub-Classification Verdict : ఎస్సీ రిజర్వేషన్లను ఉపవర్గీకరించేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ‘లోక్‌ జనశక్తి పార్టీ’ (రాంవిలాస్‌) అదే కోర్టులో అప్పీలు చేయనుందని ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి చిరాగ్‌ పాసవాన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

"అంటరానితనం వల్ల బాధితులుగా మిగిలిన అణగారిన వర్గాలను పైకి తీసుకువచ్చేందుకు ఎస్సీ కోటాను ప్రవేశపెట్టారు. ఉప వర్గీకరణ వల్ల అసలు ప్రయోజనం నెరవేరకుండా పోతుంది. అంటరానితనం అనే పదాన్ని కోర్టు తీర్పులో ఎక్కడా ప్రస్తావించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. చదువుకునే అవకాశం అందుబాటులో ఉన్న సంపన్నవంతులైన దళితులు సహా, ఎస్సీల్లో అత్యధికులు అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నారు. ఉపవర్గీకరణను అనుమతించడం న్యాయసమ్మతం కాదు" అని చిరాగ్ పాసవాన్​ అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని, ఆ వివరాలను బహిర్గతం చేయనక్కర్లేదని ఆయన చెప్పారు. దళితుల కోటాలో క్రిమీలేయర్‌ను కూడా తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.

క్రిమీలేయర్‌ను వ్యతిరేకిస్తాం : అఠావలె
దళితులకు క్రిమీలేయర్‌ నిబంధనను వర్తింపజేసేలా ఎలాంటి ప్రయత్నం జరిగినా, దానిని అడ్డుకుంటామని కేంద్రమంత్రి, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు రాందాస్‌ అఠావలె స్పష్టం చేశారు. ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణ వల్ల వారిలో అత్యంత వెనుకబడి ఉన్నవారికి న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఇతర కేటగిరీలవారికీ ఇలాంటిది జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

సుప్రీం తీర్పు ఇదే!
20 ఏళ్లుగా నలుగుతున్న షెడ్యుల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి సుప్రీం కోర్ట్ ఇటీవలే కీలకమైన తీర్పు ఇచ్చింది. సామాజిక స్థితిగతుల ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్ల కోటాలో ఎవరి వాటా ఎంతో నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని స్పష్టం చేసింది. సీజేఐ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 మెజార్టీతో ఈ విస్పష్టమైన తీర్పు వెలువరించింది.

విద్య, ఉద్యోగాల్లో
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు విభజించవచ్చని తేల్చి చెప్పింది. ఉపవర్గీకరణకు సంబంధించి 2004లో సుప్రీంకోర్టు 'ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్' కేసులో ఇచ్చిన తీర్పు చెల్లదని పేర్కొంది. అయితే, ఉపవర్గీకరణ చేపట్టే రాష్ట్రాలు- అందుకు సహేతుక కారణాలు చూపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ

రవాణా రంగంలో 'హైస్పీడ్​' రివల్యూషన్! అసియాలోనే అతిపెద్ద 'హైపర్​లూప్​' ట్యూబ్​ను​ నిర్మించిన మద్రాస్ ఐఐటీ - Hyperloop Train

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.