ETV Bharat / bharat

ఇండియా కూటమికి బిగ్​ షాక్- NDAలో చేరిన RLD- కారణం చెప్పిన జయంత్! - Jayant Chaudhary joins NDA

NDA Jayant Chaudhary RLD : ఇండియా కూటమికి వరుస షాక్​లు తగులుతున్నాయి. తాజాగా ఆ కూటమి నుంచి రాష్ట్రీయ లోక్​ దళ్​(ఆర్​ఎల్​డీ) తప్పుకుని ఎన్​డీఏలో చేరింది. ఈ మేరకు ఆర్​ఎల్​డీ అధ్యక్షుడు జయంత్​ చౌదరి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఇటీవల ఆయన తాత, మాజీ ప్రధాని చౌదరి చరణ్​ సింగ్​కు బీజేపీ భారతరత్న ప్రకటించడం గమనార్హం.

NDA jayant chaudhary RLD
NDA jayant chaudhary RLD
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2024, 10:52 PM IST

NDA Jayant Chaudhary RLD : ఇండియా కూటమికి ఉత్తర్​ప్రదేశ్​లో ఎదురుదెబ్బ తగిలింది. ఇన్ని రోజులు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న రాష్ట్రీయ లోక్​దళ్(ఆర్​ఎల్​డీ) బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏలో చేరింది. ఈ మేరకు గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు ఆ పార్టీ అధ్యక్షుడు జయంత్​ చౌదరి తెరదించుతూ ఈ ప్రకటన చేశారు. ఇప్పుడు ఎన్​డీఏలో ఆర్​ఎల్​డీ భాగమని స్పష్టం చేశారు. అయితే దీనికోసం పెద్ద ప్లానింగ్​ ఏం చేయలేదని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో తక్కువ సమయంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.

ఇటీవల మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్​ సింగ్​కు మరణాంతరం భారతరత్న పురస్కారం ప్రకటించింది బీజేపీ. తాజాగా చరణ్​ సింగ్ జయంతి సందర్భంగా ఆయన మనవడు జయంత్​ చౌదరి కూటమి మార్పుపై ప్రకటన చేయడం గమనార్హం.
అయితే గత కొద్ది కాలంగా ఆర్​ఎల్​డీ, బీజేపీ పొత్తుపై పలు ఊహాగానాలు వినిపించాయి. సమాజ్​వాదీ పార్టీ, కాంగ్రెస్​తో ఉన్న పొత్తు నుంచి బయటకు వచ్చేందుకు ఆ పార్టీ అధినేత జయంత్​ చౌదరి యోచిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపై బీజేపీ అగ్రనాయకత్వంతోనూ చర్చలు కూడా జరిగాయని టాక్​ వచ్చింది. దీంతో పాటు సీట్ల సర్దుబాటుపై కూడా చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి.

సీట్ల సర్దుబాటు
తాజాగా జయంత్​ చౌదరి చేసిన ప్రకటనలో సీట్​ షేరింగ్​ ప్రస్తావన రాలేదు. కానీ అంతకుముందు ఆర్​ఎల్​డీ నేతలు ఏడు లోక్​సభ స్థానాలను డిమాండ్​ చేయగా, బీజేపీ 5సీట్ల వరకు ఇచ్చేందుకు సానుకూలత చూపించినట్లు ప్రచారం జరిగింది.

ఎన్​డీఏలోకి అందుకే!
2022లో జరిగిన ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్ ​దళ్​, సమాజ్​ వాదీ పార్టీ కలిసి పోటీ చేశాయి. రాష్ట్రీయ లోక్​దళ్​ 33 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇందులో 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో మరో ఎమ్మెల్యే గెలవడం వల్ల ఆ సంఖ్య 9కి చేరింది. ఆర్​ఎల్​డీ అధినేత జయంత్ చౌదరి రాజ్యసభకు వెళ్లేందుకు ఎస్​పీ సహకరించింది. ఈ క్రమంలోనే లోక్​సభ ఎన్నికలకు కూడా ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్​ యాదవ్​ ఇటీవలే ప్రకటించారు. దీనిని ఆర్​ఎల్​డీ నేతలు సైతం అంగీకరించినా, ఆ తర్వాత స్వరం మార్చారు. తాము 12స్థానాలను కోరామని, ఎస్​పీ ఏడు సీట్లు ఇచ్చేందుకు సానుకూలంగా ఉందని ఆ పార్టీ నేతలు అప్పట్లో చెప్పారు. కానీ బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తుండడం వల్ల ఎన్​డీఏ వైపు ఆర్​ఎల్​డీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

రాజ్యసభకు సోనియా గాంధీ- రాయ్​బరేలీ నుంచి బరిలోకి ప్రియాంక!

రైతులతో కేంద్ర మంత్రుల భేటీ- 'దిల్లీ చలో' విరమించుకోవాలని విజ్ఞప్తి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.