ETV Bharat / bharat

ఎన్డీయే కూటమిలో కింగ్​ మేకర్స్​గా చంద్రబాబు, నీతీశ్- రాజకీయంగా ఏపీకి ఎంతో మేలు! - LOKSABHA ELECTION RESULT 2024

NDA Alliance Chandrababu Nitish : లోక్​సభ ఎన్నికల కౌంటింగ్ తర్వాత కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ కీలకంగా మారారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కమలం పార్టీకి సొంతంగా మెజార్టీ రాకపోవడం వల్ల కూటమిలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీలైన టీడీపీ, జేడీయూపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. దీని వల్ల ఏపీకి రాజకీయంగా మేలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

NDA Alliance Chandrababu Nitish
NDA Alliance Chandrababu Nitish (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 5, 2024, 8:13 AM IST

NDA Alliance Chandrababu Nitish : కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జేడీయూ అగ్రనేత నీతీశ్‌కుమార్‌ కింగ్ మేకర్స్​గా మారారు. 2024 ఎన్నికల్లో సొంతంగా 272 మెజార్టీ మార్కును బీజేపీ దాటకపోవడం వల్ల కూటమిలో అతిపెద్ద పార్టీలైన తెదేపా, జేడీయూలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. ఇది రాజకీయంగా ఆంధ్రప్రదేశ్‌కు మేలుచేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే చంద్రబాబు, నీతీశ్‌ గతంలో ఎన్డీయే భాగస్వాములుగా ఉన్నా రాజకీయ వైరుద్ధ్యాల కారణంగా బయటికి వచ్చి ఈసారి ఎన్నికలకు ముందే తిరిగి కలిశారు. బిహార్‌లో బీజేపీ పెద్దన్న పాత్ర అయితే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ఆ స్థానంలో ఉంది. అయినప్పటికీ పరస్పర అవగాహనతో ఆయా పార్టీలకు స్థానికంగా ఉన్న బలాబలాల ఆధారంగా సీట్లు సర్దుబాటు చేసుకొని బరిలో దిగాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా, బీజేపీ రెండు కూడా లాభపడగా, బిహార్‌లోనూ అదే పరిస్థితి.

ప్రస్తుతం ఎన్డీయేలో బీజేపీ తర్వాత అతి పెద్ద పార్టీలుగా 16 సీట్లతో తెలుగుదేశం, 12 సీట్లతో జేడీయూ నిలిచాయి. భవిష్యత్తులో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం సుస్థిరంగా సాగాలంటే వీరి మద్దతు కచ్చితంగా అవసరం. ఈ రాజకీయ బలాన్ని ఉపయోగించుకొని వారు తమ సొంత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ పరంగా మేలు చేసుకొనే అవకాశం ఏర్పడుతుంది.

వాజ్​పేయీ టైమ్​లో కూడా!
1999లో వాజ్‌పేయీ నేతృత్వంలో తొలిసారి ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వంలోనూ చంద్రబాబునాయుడు కీలకపాత్ర పోషించారు. ఆ సమయంలో ఆయన తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి హైదరాబాద్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం, ఎంఎంటీస్, హైవేలు తీసుకురాగలిగారు. గత ఐదేళ్ల జగన్‌ పాలనలో అభివృద్ధికి దూరమైన ఆంధ్రప్రదేశ్‌ను సరిదిద్దడానికి, పోలవరం, అమరావతిలాంటి ప్రాజెక్టులు పూర్తిచేయడానికి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు చంద్రబాబునాయుడికి ఉపయోగపడే అవకాశం ఉంది. తన రాజకీయ అనుభవం, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న పరిస్థితులను ఆలంబనగా చేసుకొని ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి, కొత్త వాటిని రాష్ట్రానికి తీసుకురావడానికి ఎక్కువ అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

మరోవైపు, మొదట్లో ఇండియా కూటమి ఏర్పాటులో జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్‌, ఆర్జేడీ సహా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడానికి సమావేశాలు ప్రారంభించారు. కానీ తర్వాత అనూహ్యంగా ఇండియా కూటమిని విడిచిపెట్టి ఎన్డీయే కూటమిలో చేరిపోయారు. అంతే కాదు మహాకూటమి నుంచి వైదొలిగిన నీతీశ్​ కుమార్ బీజేపీతో చేతులు కలిపి బిహార్​కు మరోసారి సీఎం అయ్యారు.

అయితే 1990 నుంచి బీజేపీతో నీతీశ్ బంధం కొనసాగుతోంది. 1998-2004 మధ్య నీతీశ్ కుమార్ వాజ్‌పేయీ సర్కార్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. 2005 నుంచి మధ్యలో ఏడాది మినహా ఇప్పటి వరకు కూడా బిహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు బీజేపీతో కలిసి లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కూటమిలో బీజేపీ తర్వాత మరో అతిపెద్ద పార్టీకి అధినేతగా నిలిచారు. దీంతో బిహార్​కు కూడా నీతీశ్​ కొన్ని ప్రాజెక్టులను రప్పించుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఒడిశాలో BJD కోటను బద్దలు కొట్టిన BJP- పట్నాయక్​కు బిగ్ షాక్ - odisha election result 2024

'మూడో విడతలో భారీ నిర్ణయాలు'- ఫలితాలు చారిత్రక ఘట్టమన్న మోదీ - Lok Sabha Election Result 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.