Tips to Balance Working Mothers Life : గతంలో మహిళలు వంటింటికే పరిమితం అయ్యేవారు. కానీ, ప్రస్తుత రోజుల్లో స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అయితే ఇంటి పని, వంటపని, పిల్లల పెంపకం, ఉద్యోగం, కేరీర్.. ఇలా ఎన్నో బాధ్యతలను తమ భుజాలపై మోస్తుండడంతో.. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అలాంటి వారికోసం ఇవాళ (మార్చి 12) 'నేషనల్ వర్కింగ్ మామ్స్ డే' సందర్భంగా.. ఓ ప్రత్యేక కథనం అందిస్తున్నాం. ఇందులో పనిచేసే తల్లులు(Mothers) తమ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకోవడానికి అద్భుతమైన టిప్స్ తీసుకొచ్చాం. వాటిని ఫాలో అయ్యారంటే ఒకవైపు తల్లిగా, కుటుంబ సంరక్షకురాలిగా.. మరోవైపు వృత్తిపరమైన జీవితంలో మంచి విజయాలను సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
మీకు టైమ్ కేటాయించుకోండి : వర్కింగ్ మదర్‌గా అన్ని పనుల్లో రాణించడమే కాకుండా మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే మీరు చేయాల్సిన మొదటి పని.. స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం. కుటుంబ బాధ్యతలు, పనిఒత్తిడి, పిల్లలను చూసుకోవడం వంటివన్నీ ఉన్నా మీ కోసం రోజులో కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయంలో వాకింగ్‌కు వెళ్లడం, మైండ్ ఫుల్ నెస్ కోసం ధ్యానం, యోగా లాంటి ప్రాక్టీస్ చేయడం చేయాలి. ఇలా చేయడం ద్వారా మీపై కొంత ఒత్తిడి తగ్గడమే కాకుండా రోజంతా చురుకుగా ఉంటారని చెబుతున్నారు నిపుణులు.
రిలేషన్ షిప్స్ : వర్కింగ్ మామ్స్ తమ బాధ్యతలను సక్రమంలో నిర్వహించాలంటే బలమైన మద్దతు కూడగట్టుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా పనిచేసే ఇతర తల్లులతో మంచి రిలేషన్స్ ఏర్పరుచుకోవడం ద్వారా మంచి సపోర్టివ్ సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఏదైనా అవసరం పడినప్పుడు ముఖ్యంగా పిల్లల పెంపకం విషయంలో వారి సహాయం చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు.
టైమ్ మేనేజ్ మెంట్ : చాలా మంది పని చేసే తల్లులు వర్క్, ఫ్యామిలీ లైఫ్ ను ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియక ఆందోళన చెందుతుంటారు. కాబట్టి వీటన్నింటినీ సక్రమంగా నిర్వహించాలంటే సరైన టైమ్ మేనేజ్ మెంట్ ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఇందుకోసం మీ పార్ట్ నర్ తో మాట్లాడి.. వివిధ పనులకు ఎంత టైమ్ అవసరమో దాని ప్రకారం ఒక టైమ్ టేబుల్ సెట్ చేసుకోవాలి. అవసరమైతే కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్ అయ్యి మీ విలువైన సమయాన్ని వృథా కాకుండా చూసుకోవాలి.
పక్కా షెడ్యూల్ : పని చేసే తల్లులు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ వృత్తిపరంగా రాణించాలంటే మీరు చేయాల్సిన మరో పని.. రోజువారి పనులను షెడ్యూల్ చేసుకోవాలి. పని, ఇల్లు, పిల్లలకు అవసరమైన సమయాన్ని కేటాయించాలి. అలాగే ఆ రోజులో చేయాల్సిన ముఖ్యమైన పనుల కోసం తగినంత టైమ్ ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే టైమ్ ట్రాకర్ యాప్స్ , సాధనాలను ఉపయోగించి మీ రోజువారి సమయాన్ని ఎలా గడుపుతున్నారో చెక్ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
ప్రాక్టీస్ చేయడం : పని చేసే తల్లిగా మీ పిల్లలతో తగినంత సమయం గడపడం లేదని అపరాధభావం కలగడం సహజం. కాబట్టి, మీరు అలాంటి ఫీలింగ్ ను పొందకుండా ఉండాలంటే తల్లిదండ్రులుగా పిల్లలతో తగినంత సమయం గడిపేలా చూసుకోవాలి. ఇందుకోసం మైండ్ ఫుల్ పేరెంటింగ్‌ను ప్రాక్టీస్ చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ఫోన్లు లేదా ల్యాప్ టాప్ల వంటి వాటికి దూరంగా ఉంటూ మీ పిల్లలతో మంచి కమ్యూనికేషన్ పెంచుకోండి. ఇది మిమ్మల్ని ఉత్తమ పేరెంట్స్‌గా నిలపడంలో చాలా బాగా సహాయపడుతుంది.
హ్యాపీనెస్ ఇక్కడ దొరుకుతుంది - తవ్వుకునోళ్లకు తవ్వుకున్నంత!