ETV Bharat / bharat

'ఇండియా' కూటమికి మరో షాక్- కశ్మీర్​లో నేషనల్ కాన్ఫరెన్స్ ఒంటరి పోరు

National Conference INDIA alliance : విపక్ష కూటమి ఇండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో సీట్ల పంపకాలపై ఒప్పందం కుదరకపోవడం వల్ల కూటమి పార్టీల్లో ఎవరి దారి వారిదేలా కనిపిస్తోంది. ఇప్పటికే బంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరి పోరుకు సిద్ధమవగా తాజాగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కూడా ఆ జాబితాలో చేరింది. జమ్ము కశ్మీర్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫారూక్‌ అబ్దుల్లా తేల్చి చెప్పారు.

national conference INDIA alliance
national conference INDIA alliance
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 7:37 PM IST

National Conference INDIA alliance : విపక్ష కూటమి ఇండియాలో ఎవరిదారి వారిదేలా కనిపిస్తోంది. కూటమితో సంబంధం లేకుండా జమ్ము కశ్మీర్‌ లోక్‌సభ, అసెంబ్లీ ఎ‌న్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫారూక్‌ అబ్దుల్లా తాజాగా ప్రకటించారు. ఇందులో రెండో అభిప్రాయానికి తావులేదన్నారు. జమ్ము కశ్మీర్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఎన్​డీఏలో చేరే అవకాశాన్ని కూడా ఫారూక్‌ అబ్దుల్లా తోసిపుచ్చలేదు.

వాజ్‌పేయీ హయాంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎన్​డీఏలో భాగస్వామిగా ఉంది. గత నెల జమ్ము ప్రాంతానికి చెందిన పలువురు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేతలు భాజపాలో చేరారు. మూడుసార్లు జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫారూక్‌ అబ్దుల్లా ఇండియా కూటమిలోని బలమైన ఓటు బ్యాంకు ఉన్న నాయకుల్లో ఒకరు. కూటమి భేటీల్లో కూడా ఆయన పాల్గొన్నారు. అయితే కూటమిలో సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం లోపించడంపై అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని రక్షంచాలంటే విభేదాలు మరిచిపోయి పనిచేయాలన్నారు.

'కూటమిలో భాగమే'
అయితే, కాంగ్రెస్ మాత్రం ఎన్​సీ ఇండియా కూటమిలో భాగమేనని చెప్పుకొచ్చింది. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ సైతం తమతోనే ఉందని పేర్కొంది. ఇకపైనా ఎన్​సీ, పీడీపీ తమతోనే కొనసాగుతాయని స్పష్టం చేసింది. సీట్ల పంపకంపై చర్చలు నడుస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ పేర్కొన్నారు. ప్రతి పార్టీకి తమ తమ పరిమితులు ఉన్నాయని అన్నారు.

'చర్చలేం జరగలేదు'
మరోవైపు, కాంగ్రెస్​తో అధికారికంగా ఎలాంటి చర్చలు జరగలేదని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. తాము ఇండియా కూటమిలో భాగమేనని అన్నారు. బీజేపీ నుంచి సీట్లు గెలవడమే తమ అతిపెద్ద లక్ష్యమని చెప్పారు. ఈ లక్ష్యం నెరవేర్చుకునేందుకు కొన్ని త్యాగాలు చేయక తప్పదని అన్నారు. అవసరమైతే కాంగ్రెస్​తో సీట్ల సర్దుబాటుకు తాము సిద్ధమేనని చెప్పారు.

ఇండియా కూటమిలో దాదాపు 25 పార్టీలు ఉన్నా సీట్ల పంపకాలపై ఇప్పటికీ ఒక ఒప్పందానికి రాలేకపోతున్నాయి. ఇప్పటికే బంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌, పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఎన్‌సీ కూడా చేరింది. ఇక దిల్లీలో కాంగ్రెస్‌కు ఒక సీటు ఇచ్చి మిగిలిన ఆరు స్థానాల నుంచి తమ అభ్యర్థులు బరిలోకి దిగుతారని ఆప్‌ ఇప్పటికే స్పష్టంచేసింది. బిహార్‌లో జేడీయూ కూటమి నుంచి వేరుపడి ఎన్​డీఏలో చేరింది. రాష్ట్రీయ లోక్‌దళ్‌ కూడా ఎన్​డీఏలోకి చేరే ఆలోచనలు చేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది.

సీట్ల పంపకంతో సంబంధం లేకుండా ముందుకెళ్తున్న ఆమ్ ఆద్మీ ఇటీవలే అసోంలోని మూడు స్థానాలకు అభ్యర్థులను సైతం ప్రకటించింది. దిబ్రూగఢ్, గువాహటి, తేజ్​పుర్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మూడు స్థానాలు కాంగ్రెస్​కు పట్టున్న సీట్లే కావడం గమనార్హం. సీట్ల పంపకంపై కాంగ్రెస్ ఎటూ తేల్చకపోవడం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో అభ్యర్థులను ప్రకటించినట్లు ఆప్ నేతలు చెప్పారు.

'ఆ 14 స్థానాల్లో మేమే'- గట్టి షాకిచ్చిన కేజ్రీవాల్- ఇండియా కూటమి కుదేల్​!

ద్రవిడ పార్టీలకు చెక్! తమిళనాడులో మల్టీస్టారర్ బొమ్మ- అందరి టార్గెట్ '2026'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.