RSS Chief Mohan Bhagwat Speech : భారత్‌ను ఒక ముప్పుగా చూపించేందుకు బంగ్లాదేశ్‌లో కుట్రలు జరుగుతున్నాయని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆరోపించారు. "మన సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. హిందువులను శత్రువులుగా చూసే పరిస్థితి తీసుకువస్తున్నారు. మన సంకల్పాన్ని బలహీన పరిచేందుకు, భారత్‌ను అస్థిర పరిచేందుకు కుట్రలు చేస్తున్నారు" అని మోహన్ భగవత్ ధ్వజమెత్తారు. బంగ్లాదేశ్‌లో నిరంకుశ ఛాందసవాదం రాజ్యమేలుతోందని ఆరోపించారు. అక్కడి హిందువులతో సహా మైనారిటీల తలలపై కత్తి వేలాడుతోందని మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం నాగ్‌పుర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ విజయదశమి ఉత్సవ్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయుధ పూజ చేసిన మోహన్ భగవత్ బంగ్లాదేశ్‌లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
#WATCH | Nagpur, Maharashtra | #VijayaDashami | RSS chief Mohan Bhagwat says, " what happened in our neighbouring bangladesh? it might have some immediate reasons but those who are concerned will discuss it. but, due to that chaos, the tradition of committing atrocities against… pic.twitter.com/KXfmbTFZ5D
— ANI (@ANI) October 12, 2024
నేరస్థులను రక్షించే ప్రయత్నం!
మహిళలపై అకృత్యాలపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన మన సమాజానికి సిగ్గుచేటని అన్నారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. నేరం జరిగి ఇంతకాలమైనా, బాధితురాలికి న్యాయం జరగకపోవడం సమాజాన్ని తీవ్రంగా నిరుత్సాహపరుస్తోందని అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
#WATCH | Nagpur, Maharashtra | #VijayaDashami | RSS chief Mohan Bhagwat says, " ...what happened in rg kar hospital in kolkata is shameful. but, this is not a single incident... we should be vigilant to not let such incidents happen. but, even after that incident, the way things… pic.twitter.com/NvJRiU7o0x
— ANI (@ANI) October 12, 2024
"కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో నేరస్థులను రక్షించేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారు. నేరాలు, దుష్ట రాజకీయాలు, విష సంస్కృతి మనల్ని నాశనం చేస్తున్నాయి."
-మోహన్ భగవత్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్
ఆర్ఎస్ఎస్కు వందేళ్లు
ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటై 100వ ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో, ఈ విజయదశమిని పురస్కరించుకొని మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ సహా ప్రత్యేక అతిథులుగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఇస్రో మాజీ ఛైర్మన్లు రాధాకృష్ణన్, శివన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సామాజిక ఐక్యత, సామరస్యం కోసం కుల, మతాలకు అతీతంగా వ్యక్తుల మధ్య స్నేహం ఉండాలంటూ సంఘ్ కార్యకర్తలను ఉద్దేశించి భగవత్ ప్రసంగించారు. పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలకు వ్యతిరేకంగా జరిగిన దాడులను ఖండించారు. మనమున్న ప్రాంతంతో సంబంధం లేకుండా ఐక్యంగా ఉంటే, ఎలాంటి ఘర్షణలకు తావుండదన్నారు. అలాగే ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతోన్న యుద్ధంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
#WATCH | Union Minister Nitin Gadkari, Maharashtra Deputy CM Devendra Fadnavis and former ISRO chief K Sivan are present at the Shastra Puja event of RSS on the occasion of #VijayaDashami, in Nagpur
— ANI (@ANI) October 12, 2024
Padma Bhushan & former ISRO chief K. Radhakrishnan is also present as the chief… pic.twitter.com/jPBF6mD4Wy