ETV Bharat / bharat

ఇంట్లోనే మ్యూజియం- బ్రిటిష్ కాలంనాటి వస్తువుల సేకరణ! రిటైర్డ్​ ప్రొఫెసర్ ఆసక్తి - పంజాబ్​లో ఇంట్లోనే మ్యూజియం

Museum In Home At Punjab : పురాతన వస్తువులతో తన ఇంటినే ఓ మ్యూజియంగా మార్చారు ఓ రిటైర్డ్ ప్రొఫెసర్. ఆ మ్యూజియంలో తాను సేకరించిన వస్తువులతో పాటు దేశవిదేశాల నుంచి తీసుకొచ్చినవి కూడా పొందుపరిచారు. బ్రిటిష్ కాలం నాటి వస్తువులను కూడా భద్రపరుస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తీ ఎవరు? ఆ మ్యూజియం ఎక్కడ ఉంది? ఆయనకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

Museum In Home At Punjab
Museum In Home At Punjab
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 7:22 PM IST

ఇంట్లోనే మ్యూజియం- బ్రిటిష్ కాలంనాటి వస్తువుల సేకరణ!

Museum In Home At Punjab : తన ఇంట్లోనే ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు ఓ రిటైర్డ్ ప్రొఫెసర్. ఈ మ్యూజియంలో దేశ విదేశాలకు చెందిన పాత వస్తువులు ఉన్నాయి. చిత్రలేఖనంపై మక్కువ ఉన్న ఈ రిటైర్డ్ ప్రొఫెసర్ పెయింటింగ్స్​తో పాటు పురాతన వస్తువులు, పాత కరెన్సీని కూడా మ్యూజియంలో పెట్టారు. ఆయనే పంజాబ్​లోని బఠిండా జిల్లాకు చెందిన హర్దర్శన్ సింగ్ సోహల్. ఆయన నెలకొల్పిన మ్యూజియమే హవేలీ ఉమ్రాన్.

Museum In Home At Punjab
సోహల్ ఏర్పాటు చేసిన మ్యూజియం

ఈ మ్యూజియం బఠిండా జిల్లాలోని జై సింగ్​ వాలా గ్రామంలో ఉంది. చిన్నప్పటి నుంచి సేకరించిన వాటితో మ్యూజియం నిర్మించారు సోహల్. తను ఇప్పటివరకు గీసిన బొమ్మలను కూడా మ్యూజియంలో పెట్టినట్లు హర్దర్శన్ సింగ్ సోహల్ తెలిపారు.

Museum In Home At Punjab
సోహల్​ సేకరించిన వస్తువులు

"చిన్నప్పటి నుంచి నాకు పురాతన వస్తువులపై ఆసక్తి ఉండేది. నేను మొదట్లో పెయింటింగ్స్ వేసేవాడిని. ఈ మ్యూజియంలో ఉన్న పెయింటింగ్స్ మొత్తం నేను వేసినవే. ఆ తర్వాత కొద్ది రోజులకు నాకు ఈ పురాతన కాలం నాటి వస్తువులపై ఆసక్తి కలిగింది. ఏదైనా ఒక వస్తువు పాతం కాలంలోనిది లాగా కనిపిస్తే చాలు దాని తీసుకొచ్చి మ్యూజియంలో పెడతాను. దీనిపై చాలా ఖర్చు చేశాను. కానీ ఇలా సేకరించటం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది "
-హర్దర్శన్ సింగ్ సోహల్​, మ్యూజియం యజమాని

ఈ మ్యూజియంలో పురాతన వస్తువులతో పాటు కరెన్సీ నోట్లు, కాయిన్స్, ఆయుధాలు, వ్యవసాయ పనిముట్లు, పంజాబీ దుస్తులు, కెమెరాలు ఉన్నాయి. బ్రిటిష్ కాలం నాటి వస్తువులు కూడా ఉన్నాయి. అయితే వీటిని దేశవిదేశాల నుంచి తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టినట్లు సోహల్ చెబుతున్నారు. అయితే వాటిలో కొన్నింటిని కొనుగోలు చేయగా మరికొన్ని వస్తువులను ప్రజలు ఉచితంగా ఇచ్చినట్లు చెబుతున్నారు హర్దర్శన్ సింగ్ సోహల్.

Museum In Home At Punjab
మ్యూజియంలో పెట్టిన కరెన్సీ నోట్లు

"నేపాల్​, పాకిస్థాన్​, అమెరికా ఇలా అన్ని ప్రాంతాల నుంచి నేను ఈ వస్తువులను తెచ్చాను. కొన్నిసార్లు ఆన్​లైన్​లో కూడా వస్తువులు కొనుగోలు చేస్తుంటా. టీచర్​గా నేను సంపాదించిన జీతం, అలాగే నాకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని నేను దీనికి ఖర్చు చేశాను. నా కుటుంబం కూడా నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు. నా తల్లిదండ్రులతో పాటు నా భార్య పిల్లలు కూడా నాకు సహకరిస్తుంటారు. నా కుమారుడు సుఖ్వీందర్ సింగ్ సోహల్​ ఓ ప్రముఖ యూనివర్సిటీలో జాబ్​ చేస్తున్నాడు. అయితే ఈ వస్తువులను సేకరించే విషయంలో సగ భాగస్వామ్యం అతడికి కూడా ఉంది"
-హర్దర్శన్ సింగ్​ సోహల్ , మ్యూజియం యజమాని

ఈ మ్యూజియంలో మన ప్రాచీన వారసత్వానికి సంబంధించిన వస్తువులను చూడొచ్చని, అలాగే వాటి ప్రాధాన్యతను కూడా తెలుసుకోవచ్చని సోహల్ చెబుతున్నారు.

Museum In Home At Punjab
పురాతన వస్తువులు

ప్రభుత్వ పాఠశాలలో మ్యాథ్స్ గార్డెన్ - ప్రకృతిలో సులభంగా లెక్కలు నేర్చుకుంటున్న విద్యార్థులు

జంతువులపై అంబానీల ప్రేమ- 3 వేల ఎకరాల్లో 'వన్​తారా' అడవి సృష్టించిన రిలయన్స్ ఫౌండేషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.