ETV Bharat / bharat

మూడు నెలలుగా కుక్కల గదిలో కార్మికుడు- విచారణకు మంత్రి ఆదేశం- అసలేమైందంటే? - Migrant Worker Living In Kennel

Migrant Worker Found Living In Kennel : మూడు నెలలుగా కుక్కల గదిలో ఓ కార్మికుడు నివాసముంటున్న ఘటన కేరళలో కలకలం రేపింది. ఈ విషయం కార్మిక శాఖ మంత్రి వి శివన్​ కుట్టి దృష్టికి వెళ్లింది. వివరాలు పరిశీలించిన మంత్రి, లేబర్​ కమిషన్​ను విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు.

Migrant Worker Found Living In Kennel
Migrant Worker Found Living In Kennel (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 22, 2024, 2:58 PM IST

Migrant Worker Found Living In Kennel : ఓ వలస కార్మికుడు గత కొన్ని నెలలుగా కుక్కల గదిలో నివసిస్తున్న ఘటన కేరళలో చర్చనీయాంశమైంది. ఈ విషయం కేరళ కార్మిక శాఖ మంత్రి వి శివన్​ కుట్టి దృష్టికి వెళ్లగా, ఆయన విచారణకు ఆదేశించారు. మున్సిపల్​​ అధికారులు, పోలీసుల సూచనల మేరకు కుక్కల నివాసం ఉండే ఆ గదికి తాళం వేశారు. సదరు కార్మికుడిని అతడి సంబంధీకుల ఇంట్లోకి మార్చారు. అయితే ఆ కార్మికుడు కుక్కల గదిలో ఎందుకు ఉన్నాడంటే?

ఇదీ జరిగింది
బంగాల్​లోని ముర్శిదాబాద్​ జిల్లాకు చెందిన శ్యామ్​ సుందర్​(37) పని కోసం నాలుగేళ్ల క్రితం కేరళకు వచ్చాడు. వివిధ ప్రాంతాల్లో పని చేసి, మూడు నెలల క్రితం ఎర్నాకులంలోని పరవం వచ్చాడు. అయితే ఈ ప్రదేశంలో శ్యామ్​కు గది అద్దెకు దొరకలేదు. అద్దె కూడా ఎక్కువగా ఉండటం వల్ల, తనతో పని చేసే వారి సహాయంతో ఖాళీగా ఉన్న డాగ్ కెన్నెల్​ను కనుగొన్నాడు. తన తోటి వలస కార్మికులు ఉన్న గది పక్కనే ఆ కుక్కల గది ఉంది. దానికి నెలకు రూ.500 అద్దె చెల్లిస్తూ గత మూడు నెలలుగా అందులోనే ఉంటున్నాడు. ఆ కుక్కల గది గ్రిల్స్​ను కార్డుబోర్డు షీట్లతో కప్పి అందులోనే వంట చేసుకుని తింటున్నాడు.

అయితే ఓ వ్యక్తి కుక్కల గదిలో ఉంటున్నాడని స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు శ్యామ్​ సుందర్​ను ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో శ్యామ్​ సుందర్​కు సమస్యలేవీ నిర్ధరణ కాలేదు. అనంతరం ఉన్నతాధికారులు, పోలీసుల సూచన మేరకు ఆ కుక్కల గదికి తాళం వేశారు.

మరోవైపు, ఈ విషయం కేరళ కార్మిక శాఖ మంత్రి వి శివన్​ కుట్టి దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై వివరాలు పరిశీలించిన మంత్రి, విచారణ చేపట్టాల్సిందిగా లేబర్​ కమిషనర్​ను ఆదేశించారు.
అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగానే తాను కుక్కల గదిలో ఉన్నానని, శ్యామ్​ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఆ తర్వాత శ్యామ్​ సుందర్​ను తన సంబంధీకుల ఇంట్లోకి మార్చారు.

ఫ్లాట్​లో 4వేల కిలోల చెత్త మధ్య తల్లీకూతుళ్ల జీవనం- రోజూ ఆన్​లైన్​లో ఫుడ్ ఆర్డర్లు- ఇంటి నిండా బొద్దింకలే! - Mother And Daughter Live In Garbage

కావడి యాత్ర మార్గంలో నేమ్ బోర్డుల ఏర్పాటుపై సుప్రీం స్టే - Kanwar Yatra Name Plates Issue

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.