Muda Scam Protest In Karnataka : కర్ణాటక అసెంబ్లీలో మరోసారి మైసూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) వ్యవహారం సభా కార్యకలాపాలకు అడ్డుగా మారింది. ముడా, వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్ కుంభకోణంపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం అనుమతించకోపోవడం వల్ల కర్ణాటక బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ, శాసనమండలిలో బుధవారం రాత్రంతా ధర్నా చేశారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వం, సీఎం సిద్ధరామయ్య, అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిద్రకు ఉపక్రమించే ముందు ఒకచోట కూర్చొని హనుమాన్ చాలీసా పఠించారు. అనంతరం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్ అశోక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే బీవై విజయేంద్ర సహా కమలం పార్టీ, జేడీఎస్ శాసనసభ్యులు అసెంబ్లీ ప్రాంగణంలో నిద్రించారు. అలాగే శాసనమండలిలోనూ ఇరుపార్టీల ఎమ్మెల్సీలు నిరసనలు తెలిపి నేలపై పడుకున్నారు.
Bengaluru, Karnataka: BJP MLAs and MLCs spent the entire night in the assembly as a protest against the MUDA scam pic.twitter.com/B8twyiQ4JM
— IANS (@ians_india) July 25, 2024
చర్చకు డిమాండ్
ముడా కుంభకోణంపై అసెంబ్లీ, శాసనమండలిలో చర్చ జరపాలని బీజేపీ, జేడీఎస్, ప్రభుత్వాన్ని బుధవారం డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో వాయిదా తీర్మానాన్ని ఇచ్చాయి. అయితే ముడా స్కామ్‌పై చర్చకు స్పీకర్ అనుమతించకపోవడం వల్ల బీజేపీ, జేడీఎస్ అసహనం వ్యక్తం చేశాయి. విపక్ష సభ్యులు సభా వెల్‌లోకి దూసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం, స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ, శాసన మండలిలో రేయింబవళ్లు ధర్నా చేస్తామని ప్రకటించాయి విపక్షాలు. గురువారం కూడా ఉభయ సభల్లో ఈ అంశంపై తమ నిరసనను కొనసాగిస్తామని విపక్షాలు తెలిపాయి.
Bengaluru, Karnataka: BJP MLA Prabhu Chauhan was seen dancing during the night dharna (protest) against the MUDA scam inside the assembly. The BJP alleges that he is not being allowed to speak on the matter in the assembly pic.twitter.com/YuPQAGinEF
— IANS (@ians_india) July 24, 2024
భోజనాన్ని తిరస్కరించిన ప్రతిపక్షాలు
నిరసన తెలుపుతున్న శాసనసభ్యులకు విందు ఏర్పాటుపై అసెంబ్లీ కార్యదర్శి ఎంకే విశాలాక్షి ఆరా తీశారు. ముడా, వాల్మీకి డెవలప్ మెంట్ కార్పొరేషన్ కుంభకోణం సొమ్ముతో తాము తినబోమని ప్రతిపక్ష నేత ఆర్ ఆశోక స్పష్టం చేశారు. సభలో చర్చకు అనుమతించకుండా స్పీకర్ రాత్రిపూట భోజనం ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. దోచుకున్న దళితుల సొమ్ముతో భోజనం చేయాల్సిన అవసరం తమకు లేదని విమర్శించారు. కాంగ్రెస్ దళిత వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు.
రాష్ట్ర శాసనసభలో విపక్షాల నిరసనపై కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ స్పందించారు. అత్యవసర తీర్మానంపై ఏదైనా అంశం గురించి చర్చించలేమని తెలిపారు. ఆ తీర్మానాల్లో అత్యవసర కేసులు, ప్రజా సమస్యలపై మాత్రమే చర్చిస్తామని పేర్కొన్నారు. 'వాల్మీకి షెడ్యూల్ తెగల అభివృద్ధి కార్పొరేషన్ స్కామ్ పై చర్చకు 4 రోజుల పాటు చర్చకు అనుమతించాను. కానీ ముడా స్కామ్‌పై చర్చ అత్యవసరం కాదు. నేను స్పీకర్‌గా అసెంబ్లీ కార్యకలాపాలకు చెడ్డ పేరు తీసుకురాను.' అని యూటీ ఖాదర్ తెలిపారు.
'వారు బాగా ప్లాన్ చేశారు'
ముడా కుంభకోణం ఆరోపణలపై ప్రభుత్వం న్యాయ విచారణను ఏర్పాటు చేసిందని కార్మిక మంత్రి సంతోష్ లాడ్ తెలిపారు. 'విపక్షాలు బాగా ప్లాన్ చేశాయి. ముడా స్కామ్ ఆరోపణలపై న్యాయ విచారణ చేపడతామని మంత్రి తెలిపారు. నేను కర్ణాటక బీజేపీకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. సిద్ధరామయ్య భార్యకు, ఇతరులకు స్థలాలు బీజేపీ హయాంలో ఇచ్చారు.' అని పేర్కొన్నారు.
అసలేంటి ముడా కుంభకోణం?
మైసూరులోని కెసరె గ్రామంలో సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతికి మూడు ఎకరాల భూమి ఉండేది. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా ముడా సిద్ధరామయ్య భార్య భూమిని స్వాధీనం చేసుకుంది. పరిహారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ప్లాట్లను కేటాయించింది. కెసరెలోని ల్యాండ్‌తో పోలిస్తే విజయనగరలో భూమి మార్కెట్ ధర చాలా ఎక్కువగా ఉంది. అదే బీజేపీ విమర్శలకు కారణమైంది. అలాగే సిద్ధరామయ్య అనుచరులకు కేటాయింపులు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.
కంగనా రనౌత్‌కు షాక్! ఎంపీ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు- హైకోర్టు నోటీసులు
రాజ్‌కోట్ గేమ్‌జోన్ ఘటన- 15మంది నిందితులపై లక్ష పేజీల ఛార్జ్‌షీట్- ఆ వస్తువుల వల్లే ప్రమాదం!