ETV Bharat / bharat

మైనారిటీలకు వ్యతిరేకంగా ఒక్కసారి కూడా మాట్లాడలేదు- NDAకు 400సీట్లు పక్కా!: ప్రధాని మోదీ - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

PM Modi On Minorities : ఓటు బ్యాంకు రాజకీయాలతో మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. మైనారిటీలకు వ్యతిరేకంగా తాను ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలిపారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్​డీఏ సర్కార్ 400 సీట్ల మార్కును దాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాదిలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని జోస్యం చెప్పారు. ప్రముఖ వార్తాసంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ పలు విషయాలను పంచుకున్నారు.

PM Modi On Minorities
PM Modi On Minorities (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 12:48 PM IST

Updated : May 20, 2024, 10:28 PM IST

Modi On Minorities : మైనారిటీలకు వ్యతిరేకంగా తాను ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ప్రధాని మోదీ అన్నారు. అయితే ఎవరినీ ప్రత్యేక పౌరులుగా అంగీకరించేందుకు తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. బీజేపీ ఎప్పుడూ మైనారిటీలకు వ్యతిరేకంగా ప్రవర్తించలేదని గుర్తు చేశారు. మైనారిటీలపై ప్రధాని మోదీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో ప్రధాని మోదీ తాజాగా ప్రముఖ వార్తాసంస్థ పీటీఐ వీడియోస్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

"రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తిని కాంగ్రెస్ నిరంతరం ఉల్లంఘిస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాలతో మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రయత్నాలను బట్టబయలు చేయడమే నా ఎన్నికల ప్రసంగాల లక్ష్యం. మైనారిటీలకు వ్యతిరేకంగా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తోంది. భారత రాజ్యాంగ నిర్మాతలు బీఆర్ అంబేడ్కర్, జవహర్‌ లాల్ నెహ్రూ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదని నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని విపక్షాలు ఉల్లంఘిస్తున్నాయి. రాజ్యాంగ ఉల్లంఘనను ప్రజలకు తెలియజేయడం నా బాధ్యత. బీజేపీ ఎప్పుడూ మైనారిటీలకు వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది. నేను సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అని నమ్ముతాను. మేము ఎవరినీ ప్రత్యేక పౌరులుగా అంగీకరించడానికి సిద్ధంగా లేము. అందరినీ సమానంగా పరిగణిస్తాం" అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

ఆ పార్టీ మ్యానిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర!
హిందువుల సంపదను కాంగ్రెస్ నిజంగా ముస్లింలకు ఇస్తుందని మీరు నమ్ముతున్నారా? లేదా అది ప్రచార ప్రచార అస్త్రమా? అన్న ప్రశ్నకు మోదీ దీటుగా బదులిచ్చారు. తాను చేయని వ్యాఖ్యలపై అసత్య ప్రచారాన్ని విపక్షాలు చేశాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో వెలువడిన రోజే అందులో ముస్లిం లీగ్ ముద్ర ఉందని తాను చెప్పానని గుర్తు చేశారు. ఆ రోజే కాంగ్రెస్ పార్టీ తన వ్యాఖ్యలపై స్పందించాల్సిందని, కానీ మౌనంగా ఉండిపోయిందని ఎద్దేవా చేశారు. అందుకే రిజర్వేషన్లపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తనకు అనిపించిందని చెప్పుకొచ్చారు.

"టెండర్లలో మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. వంతెనల నిర్మాణంలో రిజర్వేషన్లు అంటే ఎలా? దేశ అభివృద్ధి ఏమవుతుంది. 2006లో జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో దేశ వనరులపై ముస్లింలకే మొదటి హక్కు అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. ముస్లింలందరినీ ఓబీసీ రిజర్వేషన్ కేటగిరీ కిందకు తీసుకురావాలని కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఇలాగే కాంగ్రెస్ పార్టీ ఓబీసీల రిజర్వేషన్లను దోపిడీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం రాజ్యాంగంలోకి లౌకిక వాద స్ఫూర్తిని నాశనం చేస్తోంది. నేను రాజ్యాంగ స్ఫూర్తిని పునరుద్ధరించాలనుకుంటున్నాను."

-నరేంద్ర మోదీ, భారత ప్రధాని

400 సీట్ల దాటడం పక్కా!
2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్​డీఏ కూటమి 400 సీట్లు దాటుతుందని ప్రధాని మోదీ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాదిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని జోస్యం చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి బలం లేదని విపక్షాలు అపోహలు సృష్టించారని విమర్శించారు. '2019 లోక్ సభ ఎన్నికల్లో దక్షిణాదిలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. 2024 లోక్​సభ ఎన్నికల్లో దక్షిణాదిలో అతిపెద్ద పార్టీగా ఉంటుంది. బీజేపీ మిత్రపక్షాలు గతంలో కంటే ఈ సారి దక్షిణాదిలో మరిన్ని సీట్లు గెలుచుకుంటాయి. దక్షిణాదిలో ఎన్​డీఏ సీట్లు, ఓట్లు పెరుగుతాయి.' అని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

తూర్పులోని బీజేపీకి పెరుగుతున్న ఆదరణ
తూర్పు భారతదేశంలోనూ బీజేపీకి ప్రజల నుంచి పెద్దఎత్తును మద్దతు లభిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి మద్దతు ఉందని, అయితే తూర్పు, దక్షిణాది నుంచి ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. విపక్ష ఇండియా కూటమి పలు రాష్ట్రాల్లో ఖాతా తెరవడానికి కూడా ఇబ్బందులు పడుతోందని ఎద్దేవా చేశారు.

'2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్​డీఏ 400 సీట్లు దాటుతుందని అంచనా వేశాం. ఇప్పుడు నాలుగు దశల ఓటింగ్ పూర్తయిన తర్వాత మా అంచనా సరైనదేనని అర్థమయ్యింది. మా అంచనా కంటే ప్రజల సంకల్పం బలంగా ఉందని నేను నమ్మకంగా చెప్పగలను. అర్బన్, పురుషాధిక్యత, ఉత్తరాది పార్టీ అని బీజేపీపై విపక్షాలు పుకార్లు సృష్టిస్తుంటాయి. బీజేపీని బనియా బ్రాహ్మణ పార్టీ అని విపక్షాలు విమర్శిస్తుంటాయి. కానీ అత్యధిక సంఖ్యలో దళిత, ఓబీసీ, ఎస్టీ ఎంపీ/ఎమ్మెల్యేలు కలిగిన ఉన్న పార్టీ బీజేపీ' అని మోదీ అన్నారు.

అవన్నీ ఆరోపణలే!
రాజ్యాంగం తన జీవిత గమనానికి దిక్సూచి అని ప్రధాని మోదీ అభివర్ణించారు. లోక్​సభ ఎన్నికల్లో ఎన్​డీఏ సర్కార్ 400సీట్లకు పైగా గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. 'ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ చెందిన ఎక్కువ మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించిన పార్టీ బీజేపీ. భారత దేశానికి దళిత, గిరిజన రాష్ట్రపతిని అందించిన పార్టీ బీజేపీ. మతప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం సరికాదు. రాజ్యాంగం, దాని రూపకర్తలు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కోరుకోలేదు. రాజ్యాంగాన్ని అవమానించిందే కాంగ్రెస్ పార్టీ. స్వతంత్ర భారత దేశ చరిత్రలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, ప్రజాస్వామ్యాన్ని అణిచివేసింది కాంగ్రెస్ పార్టీయే' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

'వారి నాయకుడే అంగీకరించారు'
అవినీతిపై పోరాటం చాలా తీవ్రమైనదని, దానిని అరికట్టేందుకు దర్యాప్తు సంస్థలు ఎవరి జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా పనిచేసేస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ' అంబానీ, అదానీ నుంచి డబ్బులు అందితే కాంగ్రెస్ నేతలు వారి గురించి మాట్లాడరన్న వ్యాఖ్యలను ఆ పార్టీ అగ్రనాయకుడు అధీర్ రంజన్ చౌదరీ అంగీకరించారు. గత కొన్నేళ్లుగా అంబానీ- అదానీల గురించి మాట్లాడిన యువరాజు(రాహుల్​ను ఉద్దేశించి) అకస్మాత్తుగా ఎందుకు మాట్లాడలేదు. ఈడీ, సీబీఐ స్వతంత్రంగా పనిచేసే సంస్థలు. అవి నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాయి.' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

'అదే నా లక్ష్యం'
తనను తాను కార్యసాధకుడిగా అభివర్ణించుకున్నారు ప్రధాని మోదీ. రెండు దశాబ్దాలుగా ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్నానని, దాని ఫలితమే 'బ్రాండ్ మోదీ'గా ఏర్పడిందని చెప్పుకొచ్చారు. 2047 నాటికి భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యాన్ని సాధించడానికి తాను ఏమైనా చేస్తానని తెలిపారు. అలాగే, ప్రపంచ శాంతి, భద్రత, అభివృద్ధి ఎజెండాను ప్రోత్సహించే అన్ని ముఖ్యమైన శిఖరాగ్ర సమావేశాల్లో భారత్ పాల్గొంటుందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ ఏడాది జరిగే జీ-7, ఉక్రెయిన్ శాంతి శిఖరాగ్ర సమావేశాల్లో భారత్ పాల్గొంటుందని వెల్లడించారు.

'అందుకే ఓటింగ్ తగ్గింది'
కాంగ్రెస్, ఇండియా కూటమి కార్యకర్తలు ఓటు వేయడానికి ముందుకు రాకపోవడం వల్లే ఓటింగ్ శాతం తగ్గి ఉండొచ్చని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయం సాధించడానికి ఎలాంటి అవకాశం లేదని తెలిపారు. '10 ఏళ్ల ఎన్​డీఏ సర్కార్ పాలనపై ప్రతిపక్షాలకు ఎలాంటి తప్పులు దొరకలేదు. అందుకే ప్రజల ముందుకు వెళ్లలేకపోతున్నారు. విపక్ష కూటమికి పార్టీ క్యాడర్ లేదు. అందుకే విపక్ష కూటమి కార్యకర్తలు ఓటేసేందుకు ముందుకు రావడం లేదు. అన్ని పార్టీలు కృషి చేసి ఓటర్లను పోలింగ్ బూత్​కు రప్పించాలి.' అని ప్రధాని మోదీ తెలిపారు.

ఐపీఎల్ కోసం మ్యారేజ్​ పోస్ట్ పోన్​- పెళ్లి బట్టలతో స్టేడియానికి- కానీ వర్షం కారణంగా! - Marriage Postponed For IPL Match

3317మంది CISF సిబ్బందితో పార్లమెంట్ సెక్యూరిటీ- బాధ్యతల నుంచి CRPF ఔట్ - CISF Takes Over Parliament Security

Last Updated : May 20, 2024, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.