Modi On Election Commission : లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ వేళ, ప్రధాని నరేంద్ర మోదీ ఈసీని అభినందించారు. ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల ఎన్నికలను దాదాపు హింస లేకుండా ఎన్నికల కమిషన్ నిర్వహించిందని కొనియాడారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదువుతున్నందున మీడియా ప్రతినిధులు తమ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని ప్రధాని కోరారు. అందుకోసం ఎక్కువ నీళ్లు తాగాలని సూచించారు.
'విలేకర్లు, మీ ఆరోగ్యం జాగ్రత్త'
"మీరు (మీడియా ప్రతినిధులు) పగలూరాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నారు. కాబట్టి దయచేసి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎన్నికల సమయంలో మొత్తం తిరగాలి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వీలైనన్ని ఎక్కువ నీరు తాగండి. అలా చేయడం ఆరోగ్యానికి మంది. తద్వారా ఎనర్జీ కూడా వస్తుంది" అని తెలిపారు ప్రధాని మోదీ. భారత ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల నిర్వహణ ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలు నేర్చుకోవలసిన పాఠాలని చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద విశ్వవిద్యాలయాలు ఒక కేస్ స్టడీ చేయాలని అభిప్రాయపడ్డారు.
"నేడు మూడో విడత పోలింగ్ జరుగుతోంది. మన దేశంలో దానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అదే స్ఫూర్తితో, దేశప్రజలు వీలైనంత ఎక్కువగా ఓటు వేయాలి. ఇంకా 4 రౌండ్ల ఓటింగ్ మిగిలి ఉంది. గుజరాత్‌లో నేను ఇక్కడే క్రమం తప్పకుండా ఓటు వేస్తాను. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అమిత్ భాయ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు"
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
అంతకుముందు తన ఓటు హక్కును గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అహ్మదాబాద్‌లో వినియోగించుకున్నారు ప్రదాని మోదీ. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే ఆయన రాణీప్ ప్రాంతంలోని నిషాన్ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. అనంతరం ఓటు వేశారు. గాంధీనగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ సమయంలో ప్రధానితో పాటే ఉన్నారు.
మోదీకి రాఖీ కట్టిన అభిమాని
పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన ప్రధాని మోదీ, అక్కడి తరలివచ్చిన అభిమానులకు అభివాదం, కరచాలనం చేశారు. దగ్గరకు వెళ్లి మరీ పలకరించారు. పిల్లలకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. ఈ క్రమంలో ఓ చిన్నారిని ఎత్తుకుని కాసేపు ఆడించారు. ఓ వృద్ధురాలు మోదీకి రాఖీ కట్టింది.
ఓటేయాలని పజలలకు మోదీ పిలుపు
సార్వత్రిక సమరం మూడో విడతలో ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనాలని మోదీ మంగళవారం ఉదయం ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. కొత్త రికార్డు సృష్టించాలని కోరారు. అందరి భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత పటిష్ఠమవుతుందని పేర్కొన్నారు. ఓటు వేశాక కూడా ట్వీట్ చేశారు.
బాల్ అనుకుని బాంబును తన్నిన బాలుడు- పేలుడు ధాటికి మృతి - bengal bomb explosion
'నీట్ యూజీ పేపర్ లీక్ వార్తలు అవాస్తవం'- NTA క్లారిటీ - neet ug 2024