ETV Bharat / bharat

మోదీ 3.0కు సర్వం సిద్ధం- కీలక పదవులు బీజేపీకే! మరి మిత్రపక్షాలకు? - PM Modi Oath Ceremony - PM MODI OATH CEREMONY

PM Modi Oath Ceremony : భారత ప్రధానిగా ఆదివారం నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సామాన్యుల నుంచి అతిరథ మహారథులు, వివిధ దేశాధినేతలు హాజరుకానున్నారు. అయితే మోదీ మంత్రి వర్గంలో ఎవరికి ఏయే పదువులు ఇస్తారు అనే విషయంపై అందరూ చర్చిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఎన్​డీఏ మిత్రపక్ష నేతలతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపారు.

PM Modi Oath Ceremony
PM Modi Oath Ceremony (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 8, 2024, 8:05 PM IST

PM Modi Oath Ceremony : ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ పట్టాభిషేకం ఆదివారం జరగనుంది. ఆదివారం రాత్రి 7:15 నిమిషాలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు. తద్వారా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డు సమం చేయనున్నారు. దీనికి సంబంధించి అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖలతో పాటు వివిధ దేశాల నేతలు కూడా హాజరుకానున్నారు.

మోదీ3.0లో మరోసారి అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌!
మరోవైపు మోదీ 3.0 కేబినెట్​పై ఆసక్తి నెలకొంది. ఎన్​డీఏ కూటమిలోని మిత్రపక్షాలకు 5 నుంచి 8 కేబినెట్‌ బెర్త్‌లు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ కీలక నేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌ మిత్రపక్షాల నేతలు చంద్రబాబు, నీతీశ్‌ కుమార్‌, ఏక్‌నాథ్‌ శిందేతో సంప్రదింపులు జరిపారు. కీలకమైన హోంశాఖ, ఆర్థిక శాఖ, రక్షణశాఖ, విదేశాంగ శాఖతో పాటు విద్య, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు తమ వద్దనే ఉండనున్నట్లు బీజేపీ సంకేతాలు ఇచ్చింది. అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ మరోసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం ఖాయంగా తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్ చౌహాన్‌, బసవరాజ్‌ బొమ్మై, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, సర్బానంద సోనోవాల్‌ మంత్రిపదవులు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, జేడీయూ నుంచి లలన్‌ సింగ్‌ లేదా సంజయ్‌ ఝా, రామ్‌నాథ్‌ ఠాకూర్‌, లోక్‌జనశక్తి రాం విలాస్‌ పాసవాన్‌ పార్టీకి చెందిన చిరాగ్‌ పాసవాన్‌ మంత్రివర్గంలో చోటు దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది.

హాజరుకానున్న వివిధ దేశాధినేతలు
ఇక మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ్‌సింఘే, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు, నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌, భూటాన్‌ ప్రధాని తోబ్గే తదితర విదేశీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్ దిల్లీ చేరుకున్నారు. ఇది ఇలా ఉండగా మోదీ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ నేతలకు ఇంకా ఆహ్వానం అందలేని పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ తేలిపారు.

దిల్లీలో కట్టుదిట్టమై భద్రత
మరోవైపు దిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. స్థానిక పోలీసులతోపాటు కీలక ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలు, ఎన్‌ఎస్‌జీ కమాండోలు, డ్రోన్లు, స్నైపర్లను మోహరించారు. దిల్లీని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్​ లోపల, బయట మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

నీట్ యూజీ ఫలితాలపై ప్రత్యేక కమిటీ- ఆ 1500 విద్యార్థుల మార్కులపై సమీక్ష - NEET UG 2024 Result

లోక్​సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ- సీడబ్యూసీ తీర్మానం - Congress Working Committee Meeting

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.