ETV Bharat / bharat

ప్రభుత్వ పాఠశాలలో మ్యాథ్స్ గార్డెన్ - ప్రకృతిలో సులభంగా లెక్కలు నేర్చుకుంటున్న విద్యార్థులు - కోర్బా జిల్లాలో మ్యాథ్స్ గార్డెన్

Maths Garden in Korba : మ్యాథ్స్ అంటే చాలు కొంతమంది విద్యార్థుల్లో చెప్పలేనంత భయం ఉంటుంది. కొందరికైతే అదొక ఫోబియా. ఆ భయాన్ని తొలగించి ప్రకృతిలో ఆడుతూ పాడుతూ లెక్కలపై మక్కువ చూపే విధంగా మ్యాథ్స్ గార్డెన్​ను ఏర్పాటు చేసింది ఓ ప్రభుత్వ పాఠశాల. ఇంతకీ ఆ గార్డెన్​ ఎక్కడ ఉంది? ఎలా రూపొందించారో చూద్దాం.

Maths Garden In Korba
Maths Garden In Korba
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 1:47 PM IST

ప్రభుత్వ పాఠశాలలో మ్యాథ్స్ గార్డెన్ - ప్రకృతిలో సులభంగా లెక్కలు నేర్చుకుంటున్న విద్యార్థులు

Maths Garden In Korba : మ్యాథ్స్‌ అంటే చాలా మంది విద్యార్థులకు ఎప్పుడూ భయమే. విద్యార్థుల్లో ఉన్న ఈ భయాన్ని పోగొట్టి సులభంగా మ్యాథ్స్ నేర్పించేలా వినూత్న ఆలోచన చేశారు ఛత్తీస్​గఢ్​లోని ఓ హైస్కూల్ ఉపాధ్యాయులు. అందుకోసం పాఠశాల ఆవరణంలో ప్రకృతితో గణితం అనే థీమ్​తో గార్డెన్​ను ఏర్పాటు చేశారు.

Maths Garden In Korba
మ్యాథ్​ గార్డెన్

ప్లకార్డులపై గణిత సూత్రలు
ఈ ప్రత్యేకమైన మ్యాథ్స్​ గార్డెన్ కోర్బా జిల్లాలోని స్యాహీముడీ ఉన్నత పాఠశాలలో ఉంది. గణితంలో ఉండే త్రిభుజం, చతుర్భుజం వంటి అంశాలు సులభంగా నేర్చుకోగలిగేలా ఆ ఆకారంలోనే గార్డెన్​లో ట్రీగార్డులను నిర్మించారు. ఇటుకలతో ఆకారాలను తయారు చేసి వాటికి రంగులు వేశారు. వాటి మధ్యలో మొక్కలను నాటారు. గార్డెన్​లోనే గణిత సూత్రాలు రాసి పెట్టి విద్యార్థుల్లో మ్యాథ్స్​ పట్ల ఆసక్తి పెంచుతున్నారు ఉపాధ్యాయులు.

" గార్డెన్​లో త్రిభుజం, చతుర్భుజాల లాంటి అనేక రకాల ఆకారాలను తయారు చేశాం. వాటితో పాటు త్రికోణమితి సూత్రాలను బోర్డులపై రాసి పెట్టాం. ఇలాంటి క్లిష్టమైన సూత్రాలు, పిల్లలకు గుర్తుకు రానివి గార్డెన్​లో చూసి నేర్చుకుంటున్నారు. విద్యార్థులు గార్డెన్​కు రావడానికి ఇష్టపడతారు. వారికి అర్థం కానీ వాటిని గార్డెన్స్​లోకి వచ్చి ఆకారాలను కొలిచి ఫార్ములాను ఉపయోగించి సులువుగా ప్రశ్నలను పరిష్కరిస్తున్నారు."
-- ప్రభా సావ్​, మ్యాథ్స్ టీచర్

Maths Garden In Korba
ప్లకార్డులపై రాసిన గణిత సూత్రలు

వినూత్నంగా చేయాలని
ప్రభుత్వం ఎకో క్లబ్​ కోసం ఇచ్చే నిధులతో ఈ గార్డెన్​ను ఏర్పాటు చేసినట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు డాక్టర్ ఫర్హానా అలీ తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి దీన్ని రూపొందించినట్లు చెప్పారు. "ప్రతి సంవత్సరం ఎకో క్లబ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయం పొందుతాం. వాటితో గార్డెన్​లో మొక్కలు పెంచడానికి ఉపయోగిస్తాం. ఈ సంవత్సరం మేము కొత్తగా ఏమైనా చేయాలని అని అనుకున్నాం. అందుకే ప్రకృతితో పాటు గణితం నేర్చుకునే విధంగా ఈ గార్డెన్​ను తయారు చేశాం. మన జీవితానికి ప్రకృతి అవసరం ఉంది. అదే విధంగా విద్యార్థుల మానసిక వికాసానికి గణితం కూడా చాలా ముఖ్యమైనది. అందుకే ప్రకృతితో పాటు గణితాన్ని ఏర్పాటు జోడించి ఈ గార్డెన్​ను తయారు చేశాం." అని డాక్టర్ ఫర్హానా అలీ చెబుతున్నారు.

Maths Garden In Korba
మాథ్య్ గార్డెన్​లో విద్యార్థులతో ఉపాధ్యాయులు

సులభంగా నేర్చుకుంటున్న విద్యార్థులు
గార్డెన్​లో ఆడుతూ పాడుతూ క్లాసులో అర్థం కానీ లెక్కలను నేర్చుకొని సులువుగా గణిత సమస్యలు పరిష్కరిస్తున్నామని అంటున్నారు విద్యార్థులు. "గణితం చాలా కష్టమైన సబ్జెక్ట్. కానీ ఒక్కసారి అర్థం చేసుకుంటే చాలా సులభంగా అనిపిస్తుంది. కొన్ని సులువుగా ఉంటాయి. కొన్ని అర్థం కావు. అర్థం కాని విషయాలను మా టీచర్​ను అడిగి గార్డెన్​లోకి వచ్చి నేర్చుకుంటున్నాం." అని విద్యార్థిని లక్ష్మీ చౌహాన్ అంటుంది. మొక్కలు నాటడం సహా ప్రకృతి ద్వారా లెక్కలను సులభంగా అర్థం చేసుకొవడానికి రూపొందించిన ఈ మ్యాథ్స్ గార్డెన్ ప్రయత్నాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

Maths Garden In Korba
విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆకారాలు

మంచుపై సైకిల్ యాత్ర- 9వేల అడుగుల ఎత్తులో ఉన్న ఆలయంలో పూజలు

165 కి.మీ ఈదిన 14మంది ఆటిజం బాధిత పిల్లలు- వైకల్యాన్ని అధిగమించి ప్రపంచ రికార్డ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.