ETV Bharat / bharat

ఎట్టకేలకు మనీశ్​ సిసోదియాకు రిలీఫ్​​- అరెస్టు నుంచి బెయిల్ దాకా పరిణామాలివే! - Manish Sisodia excise policy case - MANISH SISODIA EXCISE POLICY CASE

Manish Sisodia in Delhi Excise Policy Case : ఎట్టకేలకు దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోదియాకు బెయిల్ మంజూరైంది. అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది.

Manish Sisodia in Delhi excise policy case
Manish Sisodia (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 9, 2024, 3:09 PM IST

Updated : Aug 9, 2024, 3:20 PM IST

Manish Sisodia in Delhi Excise Policy Case : దిల్లీ లిక్కర్ స్కాం కేసులో 2023 ఫిబ్రవరి 26న అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత మనీశ్ సిసోదియాకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. అవినీతి, మనీలాండరింగ్ అభియోగాలతో నమోదైన కేసుల్లో ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు నుంచి ఇప్పటివరకు జరిగిన కీలక పరిణామాల క్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • 2023 ఫిబ్రవరి 26 : డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో దిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలతో మనీశ్ సిసోదియాను సీబీఐ అరెస్టు చేసింది.
  • 2023 మార్చి 9 : సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ అభియోగాలతో సిసోదియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది.
  • 2023 మార్చి 31 : సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ సిసోదియా దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రయల్ కోర్టు తిరస్కరించింది.
  • 2023 ఏప్రిల్ 28 : మనీలాండరింగ్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ సిసోదియా దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రయల్ కోర్టు తిరస్కరించింది.
  • 2023 మే 30 : సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ సిసోదియా దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
  • 2023 జులై 3 : మనీలాండరింగ్ కేసులో బెయిల్ కోరుతూ సిసోదియా వేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
  • 2023 జులై 6 : మనీలాండరింగ్, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీంకోర్టులో సిసోదియా పిటిషన్ దాఖలు చేశారు.
  • 2023 అక్టోబరు 30 : మనీలాండరింగ్, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
  • 2024 ఏప్రిల్ 30 : సిసోదియాకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది.
  • 2024 మే 2 : అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో బెయిల్ కోరుతూ దిల్లీ హైకోర్టులో సిసోదియా పిటిషన్ వేశారు.
  • 2024 మే 21 : సిసోదియాకు బెయిల్ ఇచ్చేందుకు దిల్లీ హైకోర్టు నో చెప్పింది.
  • 2024 జులై 16 : బెయిల్ కోసం సిసోదియా దాఖలు చేసిన పిటిషన్లను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై సీబీఐ, ఈడీ స్పందనను కోరింది.
  • 2024 ఆగస్టు 6 : అవినీతి, మనీలాండరింగ్ కేసులలో బెయిల్ కోరుతూ సిసోదియా దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.
  • 2024 ఆగస్టు 9 : సిసోదియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియాకు బెయిల్‌- 17నెలల తర్వాత! - Manish Sisodia Bail Judgement

Delhi Excise Case :​ సిసోదియాకు ఈడీ షాక్​.. రూ.52 కోట్ల ఆస్తులు అటాచ్​!

Last Updated : Aug 9, 2024, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.