ETV Bharat / bharat

'అందువల్లే వరుణ్​ గాంధీకి టిక్కెట్ దక్కలేదు- నా కుమారుడిపై పూర్తి విశ్వాసం ఉంది' - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

Maneka Gandhi On Varun Lok Sabha Seat : ఉత్తరప్రదేశ్‌లోని ఫీలీబీత్ సిట్టింగ్ ఎంపీ వరుణ్‌ గాంధీకి బీజేపీ టికెట్‌ నిరాకరించడంపై ఆయన తల్లి మేనకా గాంధీ స్పందించారు. టికెట్​ చేజారినా వరుణ్‌ గాంధీపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఈ విషయంలో పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Maneka Gandhi On Varun Lok Sabha Seat
Maneka Gandhi On Varun Lok Sabha Seat (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 5:31 PM IST

Maneka Gandhi On Varun Lok Sabha Seat : బీజేపీ అధిష్ఠానం తన కుమారుడు వరుణ్ గాంధీకి ఫీలీభీత్ లోక్‌సభ టికెట్ ఇవ్వకపోవడానికి, ఆయన పార్టీపై విమర్శలు చేయడమే కారణమై ఉండొచ్చని మేనకా గాంధీ అన్నారు. అయితే టికెట్ దక్కనప్పటికీ వరుణ్ రాజకీయాల్లో రాణించగలరనీ ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. సుల్తాన్‌పూర్‌లో తన కోసం ప్రచారం చేయడానికి వరుణ్ ఆసక్తిని వ్యక్తం చేసినట్లు మేనకా గాంధీ చెప్పారు. అయితే ఆ విషయంపై నిర్ణయం పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రభుత్వాన్ని విమర్శించేలా కొన్ని విషయాలపై వరుణ్ చేసిన ప్రసంగాల వల్లే టిక్కెట్ దక్కలేదా అని అడిగినప్పుడు తాను మరొక కారణం గురించి ఆలోచించలేనని మేనకా అన్నారు. 'వరుణ్ గాంధీకి బీజేపీ టికెట్ నిరాకరించినందుకు ఒక తల్లిగా నాకు సంతోషమైతే కలగదు కదా. ఈసారి కూడా ఫీలీభీత్ నుంచి వరుణే పోటీ చేస్తే బాగుండేది. కానీ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని మనం మార్చలేం' అని మేనకాగాంధీ వ్యాఖ్యానించారు.

వరుణ్‌గాంధీ సుల్తాన్‌పూర్‌ స్థానానికి మారుతారా?
'భవిష్యత్తులో వరుణ్ గాంధీ సుల్తాన్‌పూర్‌ స్థానానికి మారుతారా?'' అని మేనకాగాంధీని ప్రశ్నించగా, అందుకు ప్రస్తుతానికి ఫీలీభీత్​తో పాటు యావత్ భారతదేశం అతడి కర్మభూమి, ఆయన్ని అక్కడే పనిచేయనివ్వండి అని పేర్కొన్నారు. సుల్తాన్‌పూర్ లోక్‌సభ స్థానంలో తాను జాతీయ అంశాల కంటే స్థానిక సమస్యల గురించే ఎక్కువగా మాట్లాడతానని, ఎందుకంటే ప్రజలకు వాటిపైనే ఆసక్తి ఎక్కువ అని తెలిపారు.

నేను తప్పకుండా గెలిస్తాను
గత ఎన్నికల్లో మీరు కేవలం 14వేల ఓట్ల తేడాతో గెలిచారు, ఈ సారి పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించగా, మరింత మెరుగైన విజయాన్ని సాధిస్తాని మేనకాగాంధీ చెప్పారు. 'ఈ నియోజకవర్గంలో నేను స్థిరపడ్డాను. ఈసారి నేను మరింత మెరుగ్గా రాణిస్తాను. ఈ ప్రాంతానికి నా భర్త సంజయ్‌ గాంధీ ఎంతో సేవ చేశారు. దాన్ని ఇక్కడి ప్రజలు ఎప్పటికి మరిచిపోరు. నేను తప్పక గెలుస్తాను. ఈసారి ఎంత మెజారిటీ వస్తుందో ఇప్పుడే చెప్పలేను' అని తెలిపారు.

రామమందిరం ఎఫెక్ట్ ఎంత ?
ఉత్తర్​ప్రదేశ్​ రాజకీయాల్లో రామమందిరానికి అధిక ప్రాధాన్యం ఉంది కదా మీ నియోజకవర్గంలో ప్రభావం ఉంటుందా అని ప్రశ్నించారు. 'అయోధ్య పక్కనే ఉన్నప్పటికీ సుల్తాన్‌పూర్‌లో ఆ ప్రభావం పెద్దగా లేదు. దానికి ఇక్కడి తక్కువ ప్రాధాన్యం ఉంది' అని బదులిచ్చారు.

శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ఏమంటారు?
వారసత్వ పన్ను అంశాన్ని శామ్ పిట్రోడా లేవనెత్తడాన్ని మేనకా గాంధీ తప్పుపట్టారు. వ్యక్తిగతంగా తాను వారసత్వపు పన్నుకు పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. బీజేపీ హయాంలో తాము ఎంతోమంది పేదలకు రేషన్ సరుకులు, పక్కా ఇళ్లను అందించగలిగామని చెప్పారు.

మూడుదశల పోల్స్ తర్వాత బీజేపీ పరిస్థితేంటి ?
మూడు దశల లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ పరిస్థితి గురించి మీ అంచనా ఏమిటని మేనకాగాంధీని ప్రశ్నించగా, 'మే 25న ఎన్నికలు జరగనున్న నా సీటుపై ఫోకస్ చేస్తున్నాను. మిగతా అంశాల గురించి ప్రస్తుతానికి నేను ఎలాంటి విశ్లేషణ చేయలేను' అని తెలిపారు. ఎన్​డీఏ కూటమికి 400కుపైగా లోక్​సభ సీట్లుపై స్పందిస్తూ బీజేపీకి 370 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోసారి కేంద్రమంత్రి అవుతారా?
'నాకు దాని గురించి ఎలాంటి ఆలోచనలు లేవు. దానిపై నేను నిర్ణయాలు తీసుకోను. జంతు సంరక్షణ రంగంలో మరింత సేవ చేయాలనే ఉంది' అని తెలిపారు. కాగా, సుల్తాన్‌పూర్ స్థానానికి మే 25న పోలింగ్ జరగనుంది. ఈసారి సుల్తాన్‌పూర్‌లో మేనకాగాంధీపై సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌ భుల్‌ నిషాద్‌ పోటీ చేస్తున్నారు.

ఆప్​ను అణిచేందుకు మోదీ యత్నం- ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదల్లేదు: కేజ్రీవాల్ - lok sabha elections 2024

84 వెడ్స్ 66- గ్రాండ్​గా వృద్ధ జంట పెళ్లి- భార్య మరణాన్ని తట్టుకోలేక! - OLD COUPLE MARRIAGE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.