ETV Bharat / bharat

జూనియర్​ వైద్యులను కలిసిన మమత- రాజీకొచ్చే ప్రసక్తే లేదన్న డాక్టర్లు - Mamata Visits Protest Site

Bengal CM Mamata Banerjee : ఆందోళన చేస్తున్న వైద్యులను సీఎం మమతా బెనర్జీ కలిశారు. బాధితురాలికి న్యాయం జరగాలనే తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. చర్చలకు రావాల్సిందిగా కోరారు. అయితే, డార్టర్లు అందుకు నిరాకరించడం వల్ల మమత అక్కడి నుంచి వెనుదిరిగారు.

Bengal CM Mamata Banerjee
Bengal CM Mamata Banerjee (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2024, 3:26 PM IST

Bengal CM Mamata Banerjee : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న జూనియర్‌ వైద్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం అనూహ్య పరిణామం జరిగింది. ఆందోళన చేస్తున్న జూనియర్‌ వైద్యులతో బంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడారు. ఆమె స్వయంగా నిరసన శిబిరానికి వెళ్లి వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని కోరారు. తాను ఇక్కడికి సీఎంగా రాలేదని, మీ సోదరిగా వచ్చానని చెప్పారు. తనకు సీఎం పదవి ముఖ్యం కాదని అన్నారు.

'న్యాయం కావాలి'
హత్యాచార ఘటనను నిరసిస్తూ బంగాల్‌ ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయం 'స్వస్థ్‌ భవన్‌' ఎదుట జూనియర్‌ వైద్యులు గత నెల రోజులుగా ఆందోళన సాగిస్తున్నారు. ఈ మధ్యాహ్నం నిరసన శిబిరానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెళ్లారు. ఆమెను చూడగానే 'న్యాయం కావాలి' అంటూ జూనియర్‌ వైద్యులు స్లొగన్స్ ఇచ్చారు. అనంతరం సీఎం మాట్లాడుతూ, ఈ సమస్యను పరిష్కరించడానికి ఇదే తన చివరి ప్రయత్నం అని తెలిపారు.

''నేనూ గతంలో విద్యార్థి నాయకురాలిగా ఉద్యమాల్లో పాల్గొన్నా. ఆందోళన చేయడం మీ హక్కు. అయితే, సమస్యను పరిష్కరించేందుకు మీతో చర్చల కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నా. భద్రతా సిబ్బంది వద్దని చెప్పినప్పటికీ మీ ఆందోళనలకు సెల్యూట్‌ చేసేందుకు వచ్చా. ఇక్కడికి నేను సీఎంగా రాలేదు. మీ దీదీ (సోదరి)గానే వచ్చా. నాకు సీఎం పదవి ముఖ్యం కాదు. కానీ, నేనొక్కదాన్నే ప్రభుత్వాన్ని నడపట్లేదు కదా. బాధితురాలికి న్యాయం జరగాలనే నేనూ కోరుకుంటున్నా'' అని మమతా బెనర్జీ అన్నారు.

''ఎండా, వానల్లోనూ మీరు రోడ్లపై ఆందోళన చేస్తుంటే నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నా. మీ డిమాండ్లను కచ్చితంగా అధ్యయనం చేస్తాం. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం. ఆర్జీ కర్‌ ఆసుపత్రిలో రోగుల సంరక్షణ కమిటీని రద్దు చేస్తున్నా. దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని సీబీఐని కోరుతున్నా. నామీద విశ్వాసం ఉంటే చర్చలకు రండి. మీరు వెంటనే విధుల్లో చేరండి. మీపై ఎలాంటి చర్యలు తీసుకోబోం'' అని మమతా బెనర్జీ కోరారు. అయితే, తమ డిమాండ్లపై చర్చ జరిగేవరకు రాజీకొచ్చే ప్రసక్తే లేదని వైద్యులు తేల్చిచెప్పడం వల్ల సీఎం అక్కడినుంచి వెళ్లిపోయారు.

డాక్టర్లపై దాడికి కుట్ర
డాక్టర్‌పై హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనకు దిగిన వైద్యులపై దాడికి కుట్ర పన్నినట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ మేరకు కుట్రకు సంబంధించి ఓ ఆడియో టేప్‌ను ఆ పార్టీ నేత కునాల్‌ ఘోష్‌ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. వైద్యులపై దాడి చేసి ఆ నిందను మమత ప్రభుత్వంపై నెట్టేలా కమ్యూనిస్టు నేతలు కుట్ర పన్నినట్లు కునాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆడియోలో వామపక్ష యువజన విభాగానికి చెందిన సభ్యుడు ఆవతలి వ్యక్తితో వైద్యులపై దాడి చేయడం గురించి మాట్లాడుతున్నారని కునాల్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో స్వాస్థ్య భవనం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు సీపీఎం నేతసహా మరో వ్యక్తిని అరెస్టు చేశారు.

'సీఎం పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధం'- మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ - Doctors Meeting With CM Mamata

నర్సుపై గ్యాంగ్​రేప్ అటెంప్ట్- డాక్టర్ ప్రైవేట్ పార్టులను కోసేసిన బాధితురాలు - Gang Rape Attempt On Nurse

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.