ETV Bharat / bharat

బీజేపీని బలోపేతం చేసేందుకే సీపీఐతో కాంగ్రెస్ దోస్తీ : మమత

Mamata On Congress : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బంగాల్​లో బీజేపీని బలోపేతం చేసేందుకు సీపీఐ(ఎం)తో కాంగ్రెస్ జతకట్టిందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీతో రాజకీయంగా పోరాడే సత్తా తృణమూల్ కాంగ్రెస్​కు తప్ప మరే పార్టీకి లేదని చెప్పారు.

Mamata On Congress
Mamata On Congress
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 2:59 PM IST

Updated : Jan 31, 2024, 4:01 PM IST

Mamata On Congress : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే బంగాల్​లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బంగాల్​లో బీజేపీని బలోపేతం చేసేందుకు సీపీఐ(ఎం)తో కాంగ్రెస్ జతకట్టిందని మమత ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీతో రాజకీయంగా పోరాడే సత్తా తృణమూల్ కాంగ్రెస్​కు తప్ప మరే పార్టీకి లేదని చెప్పారు. బీజేపీతో తమ యుద్ధం కొనసాగుతుందని తెలిపారు.

రాష్ట్రంలో రెండు స్థానాల్లో పోటీ చేయాలన్న తన ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించడం వల్ల, బంగాల్‌లో రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. కొన్ని పార్టీలు వసంతకాలంలో కోకిలలు వచ్చి వాలినట్లు, కేవలం ఎన్నికల అప్పుడు మాత్రమే కనిపిస్తాయని వ్యాఖ్యానించారు. సీపీఐ(ఎం) తన 34 ఏళ్ల పాలనలో బంగాల్ రాష్ట్ర ప్రజలను హింసించిందని ఆరోపించారు.

"కాంగ్రెస్‌కు రాష్ట్ర అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. నేను వారికి మాల్దాలో రెండు లోక్‌సభ స్థానాలు ఇచ్చాను, కానీ వారు ఎక్కువ కోరుకున్నారు. కాబట్టి నేను వారితో ఒక్క సీటు కూడా పంచుకోనని చెప్పాను. సీపీఐ(ఎం) వారి నాయకుడా ఆ పార్టీ పెట్టిన చిత్రహింసలు మరిచిపోయారా? సీపీఐ(ఎం)ని నేను ఎప్పటికీ క్షమించను. సీపీఐ(ఎం)కు మద్దతిచ్చే వారిని కూడా క్షమించను. ఎందుకంటే అలా చేయడం వల్ల వాళ్లు బీజేపీకి మద్దతిచ్చారు. గత పంచాయతీ ఎన్నికల్లో అదే జరిగింది"

-- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నాటికి రాష్ట్ర బకాయిలను చెల్లించకపోతే ఫిబ్రవరి 2 నుంచి కోల్‌కతాలో ధర్నా చేస్తామని మమత చెప్పారు. "రాష్ట్రానికి సంబంధించిన అన్ని బకాయిలను క్లియర్ చేయాలని ఫిబ్రవరి 1 వరకు నేను అల్టిమేటం ఇచ్చాను. లేని పక్షంలో ఫిబ్రవరి 2 నుంచి ధర్నా చేస్తాను. బకాయిలు క్లియర్ చేయకపోతే, ఉద్యమం ద్వారా ఎలా పొందాలో నాకు తెలుసు. ఈ ధర్నాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. అందరి మద్దతును కోరుతున్నా" అని ఆమె తెలిపారు.

కాంగ్రెస్ మాత్రం!
ఒకవైపు మమతా ఇంత స్పష్టంగా ఒంటరిగా పోటీచేస్తామని చెబుతుంటే కాంగ్రెస్‌ మాత్రం బంగాల్‌లో సీట్ల సర్దుబాటు అంశం ఇంకా హోల్డ్‌లోనే ఉన్నట్లు తెలిపింది. సీట్ల సర్దుబాటుపై టీఎంసీ, కాంగ్రెస్‌ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నాయని ఆ పార్టీ నేత జైరాం రమేశ్‌ తెలిపారు. టీఎంసీ ఇంకా ఇండియా పక్షంలో భాగమేనన్న రమేశ్‌, కూటమిలో అందరు సభ్యులూ ఒకే గళంతో మాట్లాడాలని వ్యాఖ్యానించారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేమని చెప్పారు. ఇండియా కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయన్న ఆయన, ఒకవేళ ఎవరికి వారే విడివిడిగా పోరాడాలని నిర్ణయించుకుంటే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలన్నారు. బంగాల్‌లో టీఎంసీ ఇండియా కూటమితోనే పోరాడుతుందని తాము భావిస్తున్నట్లు తెలిపారు.

Last Updated : Jan 31, 2024, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.