Maldives President Visit To India : భారత్-మల్దీవుల సంబంధాలలో అభివృద్ధి భాగస్వామ్యం ఒక మూల స్తంభంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మల్దీవుల ప్రజల ప్రయారిటీలకు తాము ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చామని ఆయన చెప్పారు. ఈ ఏడాది మల్దీవుల ట్రెజరీ బెంచ్‌లో ఎస్బీఐ 100 మిలియన్ డాలర్లను రోల్ ఓవర్ చేసిందన్నారు. ఆ దేశ అవసరాలకు అనుగుణంగా 400 మిలియన్ డాలర్లు, రూ.3 వేల కోట్లు కరెన్సీ మార్పిడి ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఇక ఇరు దేశాలకు వాతావరణ మార్పులు అతి పెద్ద సవాలు అన్న మోదీ- సౌరశక్తి, ఇంధన సామర్థ్యానికి సంబంధించి భారత్ తన అనుభవాలను మాల్దీవులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు.
"మల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, ఆయన ప్రతినిధి బృందానికి నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు శతాబ్దాల నుంచి ఉన్నాయి. భారత్, మాల్దీవులకు సమీప పొరుగు దేశం. సన్నిహిత మిత్ర దేశం. మా పొరుగు దేశాల విధానం, SAGAR విజన్‌లో మాల్దీవులకు ముఖ్యమైన స్థానం. మల్దీవులకు ఏ అవసరం వచ్చినా భారత్ ఫస్ట్ రెస్పాండర్ పాత్ర పోషించింది. ఒక పొరుగు దేశానికి ఉన్న బాధ్యతలన్నీ భారత్ అన్ని వేళలా నిర్వర్తిస్తూ వస్తోంది. ఇరు దేశాల సహకారానికి వ్యూహాత్మక దిశను నిర్దేశించడం కోసం- సమగ్ర ఆర్థిక, సముద్ర భద్రత వంటి కీలక రంగాల్లో భాగస్వాములం అయ్యాం." అని ప్రధాని మోదీ అన్నారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi says, " first of all, i extend a hearty welcome to president muizzu and his delegation. india and maldives relations are centuries old. india is maldives' nearest neighbour and close friend. maldives holds an important position in our… pic.twitter.com/gZ7M8dttj3
— ANI (@ANI) October 7, 2024
#WATCH | Delhi: Prime Minister Narendra Modi says, " first of all, i extend a hearty welcome to president muizzu and his delegation. india and maldives relations are centuries old. india is maldives' nearest neighbour and close friend. maldives holds an important position in our… pic.twitter.com/gZ7M8dttj3
— ANI (@ANI) October 7, 2024
మా అభివృద్ది భారత్ కీలక భాగస్వామి : మల్దీవుల అధ్యక్షుడు
భేటీ తర్వాత మొహమ్మద్ ముయిజ్జు ప్రసంగించారు. మల్దీవుల సామాజిక-ఆర్థిక, మౌలికవసతుల అభివృద్ధిలో కీలక భాగస్వామి అని ఆయన అన్నారు. కష్ట సమయాల్లో మల్దీవులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ఇన్నేళ్లుగా తమ దేశానికి ఉదారమైన సహాయం అందించినందుకు ప్రధాని మోదీ, భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను నిర్దేశిస్తూ సమగ్ర దార్శనిక పత్రంపై ఒప్పందం కుదిరిందని తెలిపారు.
#WATCH | Delhi: Maldives President Mohamed Muizzu says, " we (india-maldives) agreed on a comprehensive vision document, charting the course of our bilateral relationship. a vision for comprehensive economic and maritime security partnership which encompasses development… pic.twitter.com/L8Weeq7kvb
— ANI (@ANI) October 7, 2024
#WATCH | Delhi: Maldives President Mohamed Muizzu says, " we (india-maldives) agreed on a comprehensive vision document, charting the course of our bilateral relationship. a vision for comprehensive economic and maritime security partnership which encompasses development… pic.twitter.com/L8Weeq7kvb
— ANI (@ANI) October 7, 2024
మల్దీవుల్లో రూపే కార్డ్ పేమెంట్స్
మల్దీవుల్లో రూపే కార్డ్ పేమెంట్స్‌ను ప్రవేశపెట్టారు. ప్రధాని నేరేంద్ర మోదీ, మల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఆధ్వర్యంలో ఈ విధానంలో తొలి లావాదేవీ జరిగింది. అనంతరం ఇరు దేశాల నేతలు మల్దీవులలోని హనిమధూ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన రన్‌వేను వర్చువల్‌గా ప్రారంభించారు. అంతేకాకుండా, భారత్ సహాయంతో నిర్మించిన 700 సోషల్ హౌసింగ్ యూనిట్స్‌ను మల్దీవులకు అప్పగించామని ప్రధాని మోదీ తెలిపారు. మల్దీవులులోని అడ్డూలో భారత్ కాన్సులేట్, బెంగళూరులో మల్దీవుల కాన్సులేట్ ఏర్పాటు చేయడంపై ఇరు దేశాలు చర్చించాయని వెల్లడించారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi and Maldives President Mohamed Muizzu virtually inaugurate the runway of Hanimaadhoo International Airport in Maldives. pic.twitter.com/KgKSMiOYRy
— ANI (@ANI) October 7, 2024
మోదీ-మయిజ్జూ భేటీ
అంతకుముందు, నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం భారత్‌కు వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం భేటీ అయ్యారు. దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఉభయ దేశాల నేతలు సమావేశమయ్యారు. భారత్‌తో మాల్దీవుల ద్వైపాక్షిక విభేదాలు కొనసాగుతున్న తరుణంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi and Maldives President Mohamed Muizzu hold a meeting at Hyderabad House.
— ANI (@ANI) October 7, 2024
(Video: DD News) pic.twitter.com/37567UyJEO
సాదర స్వాగతం
అంతకుముందు భారత పర్యటనకు వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ సాదర స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్‌లో ఇరుదేశాల మంత్రులను పరస్పరం పరిచయం చేసుకున్నారు. అనంతరం రాజ్‌ఘాట్‌లో ముయిజ్జు, ఆయన భార్య సాజిదా నివాళులర్పించారు. అంతకుముందు, భారత పర్యటకులు తమ దేశానికి రావాలంటూ ఓ ఇంటర్వ్యూలో మాల్దీవుల అధ్యక్షుడు ఆహ్వానం పలికారు.