ETV Bharat / bharat

కాంగ్రెస్ అరుదైన రికార్డ్!- 40ఏళ్ల తర్వాత హస్తం పార్టీకి 12కోట్ల ఓట్లు- మరి బీజేపీకి? - Lok Sabha Polls Results 2024

Lok Sabha Polls Results 2024 Congress Record : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి పనితీరును కనబరిచింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత హస్తం పార్టీ 12 కోట్ల ఓట్లను పొందింది. అలాగే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం తగ్గగా, హస్తం పార్టీ ఓట్ షేర్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఓట్ల శాతం పెంచుకున్న పార్టీలు ఏవో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Lok Sabha Polls Results 2024 Congress Record
Lok Sabha Polls Results 2024 Congress Record (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 5, 2024, 12:47 PM IST

Lok Sabha Polls Results 2024 Congress Record : లోక్​సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్​డీఏ కూటమికి మెజార్టీ సీట్లు దక్కడం వల్ల ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్​డీఏ, ఇండియా కూటమి మధ్య పోరు హోరాహోరీగా జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక రికార్టు సాధించింది. 1984 లోక్​సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ 12 కోట్ల ఓట్లను సాధించింది. 40 ఏళ్ల తర్వాత హస్తం పార్టీ 12 కోట్లకు పైగా ఓట్లను పొందింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన భారీగా ఓట్లు సాధించిన హస్తం పార్టీ ఆ తర్వాత అంతగా రాణించలేకపోయింది. మళ్లీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటింది.

ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, దేశవ్యాప్తంగా జరిగిన 2024 లోక్ సభ ఎన్నికల్లో 64.20 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో కాంగ్రెస్ 13.63 కోట్లకు పైగా ఓట్లను సాధించింది. బీజేపీ 23.45 కోట్ల ఓట్లను పొందింది.

కాంగ్రెస్, బీజేపీ ఓట్లు

Year Total Votes(crore) Congress Votes(crore) BJP Votes(crore)
1984-85 24.97 12.01 (48.10%) 1.84 (7.40%)
1989 30.09 11.88(39.50%) 3.41 (11.40%)
1991-92 27.42 9.98 (36.40%) 5.58 (20.07%)
1996 33.49 9.64 (28.80%) 6.79 (20.29%)
1998 36.83 9.51 (25.82%) 9.42 (25.59%)
1999 36.43 10.31 (28.30%) 8.65 (23.75%)
2004 38.97 10.34 (26.53%) 8.63 (22.16%)
2009 41.72 11.91 (28.55%) 7.84 (18.80%)
2014 54.78 10.69 (19.52%) 17.16 (31.34%)
2019 60.7411.94 (19.67%) 22.90 (37.70%)
2024 64.20 13.63 (21.30%) 23.45 (36.60%)

తగ్గిన బీజేపీ ఓట్ల శాతం
మరోవైపు, గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతం ఈసారి తగ్గింది. అదే సమయంలో కాంగ్రెస్, సమాజ్‌ వాదీ ఓట్ల శాతాన్ని పెంచుకున్నాయి. 2019లో కంటే ఈసారి ఎక్కువ సీట్లలో బీజేపీ పోటీ చేసింది. కానీ సొంతంగా మెజారిటీ మార్క్​ను సాధించలేకపోయింది. 36.58శాతం ఓట్లను సాధించింది. ఈ లోక్​సభ ఎన్నికల్లో కమలం పార్టీకి 0.73 శాతం ఓట్లు తగ్గాయి. అదే సమయంలో కాంగ్రెస్‌ 1.76 శాతం ఓట్లను అధికంగా సాధించింది. 2019లో ఆ పార్టీకి 19.46శాతం రాగా ఈసారి 21.22 శాతం ఓట్లు వచ్చాయి. 2019లో 2.55శాతం ఓట్లను సాధించిన సమాజ్‌ వాదీ పార్టీ ఈసారి 4.59శాతం ఓట్లను సాధించింది..

  • 2019లో జేడీయూకు 1.45శాతం ఓట్లు రాగా ఈసారి 1.25శాతం వచ్చాయి.
  • 2019లో తృణమూల్‌ కాంగ్రెస్ కు 4.06శాతం ఓట్ లురాగా ఈసారి 4.38శాతం ఓట్లు వచ్చాయి.
  • బీఎస్పీ ఓట్ల శాతం 2.04 నుంచి 1.58కు తగ్గింది.
  • ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓట్ల శాతం 0.44 నుంచి 1.11కు పెరిగింది.
  • డీఎంకే ఓట్ల శాతం 2.34 నుంచి 1.82కు తగ్గింది.

కాంగ్రెస్​ రిటర్న్స్​లో రాహుల్ గాంధీ​ కీ రోల్- రెండు జోడో యాత్రలతో ఫుల్ బెనిఫిట్స్​​! - Lok Sabha election Results 2024

48ఓట్లతో గెలిచిన రవీంద్ర- 25ఏళ్లకే ఎంపీగా శాంభవి- సత్తా చాటిన ఆ ఆరుగురు! - Lok Sabha Election Results 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.