ETV Bharat / bharat

2024 ఎన్నికల సంగ్రామం- ప్రజల దృష్టంతా ఈ '10'మందిపైనే! - lok sabha elections 2024

Lok Sabha Polls Key Political Leaders : ఎన్నికలకు నగారా మోగింది. దీంతో రాజకీయపార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఇలాంటి పార్టీల్లో కొందరు నాయకులు తమ వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకుంటే మరికొందరు తెరవెనక ఉండి తమ పార్టీల విజయానికి వ్యూహాలు రచిస్తారు. అందుకే ఇప్పుడు దృష్టంతా వీరిపైనే ఉంది. లోక్​సభ ఎన్నికలపై ఈ నాయకుల ప్రభావం భారీగానో లేదా స్వల్పంగానే ఉండబోతుందనడంలో సందేహం లేదు. అలా ప్రభావం చూపగల 10 మంది నాయకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Lok Sabha Polls Key Political Leaders
Lok Sabha Polls Key Political Leaders
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 10:55 PM IST

Updated : Mar 16, 2024, 11:01 PM IST

Lok Sabha Polls Key Political Leaders : కొందరు నాయకులు తమ వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకుంటే మరికొందరు తెరవెనక ఉండి తమ పార్టీల విజయానికి వ్యూహాలు రచిస్తారు. లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగడం వల్ల ఇప్పుడు వీరిపైనే అందరి దృష్టి నెలకొంది. సార్వత్రిక ఎన్నికలపై ఈ నాయకుల ప్రభావం భారీగానో లేదా స్వల్పంగానే ఉండబోతుందనడంలో సందేహం లేదు. అలా ప్రభావం చూపగల 10 మంది నాయకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నరేంద్ర మోదీ
పదేళ్ల కాలంలో పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని దిల్లీ నుంచి గల్లీ వరకు తనదైన ముద్ర వేసిన ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ గ్యారెంటీలకు కౌంటర్‌గా 'మోదీ కీ గ్యారెంటీ' నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు. మూడో సారి అధికారం చేపడితే భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చుదిద్దుతామని బహిరంగ సభలు, సదస్సులో చెబుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. అలాగే 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలిపేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను ప్రజలకు వివరిస్తున్నారు. అన్ని రంగాల్లో స్వయం సమృద్ధిగా నిలిచేందుకు ఆత్మనిర్భర్‌ భారత్‌ అవసరాన్ని నొక్కిచెబుతున్నారు.

భారీ స్థాయిలో చేపట్టిన, చేస్తున్న మౌలిక వసతుల ప్రాజెక్టులను గురించి చెబుతూ యువత, మధ్య ఆదాయ వర్గాలను తమ వైపు లాగే ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోదీ. తమ పార్టీ భావజాలమైన జాతీయత గురించి వివరిస్తూ ప్రజలను ఆలోజింపచేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు దేశ భవిష్యత్తు కన్నా తమ కుటుంబాల గురించే ఆలోచిస్తాయనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుకు గుర్తుగా ఈ ఎన్నికల్లో 370 సీట్లు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ప్రపంచ వేదికల్లో పెరిగిన భారత్‌ బలాన్ని ఓటర్లకు వివరిస్తున్నారు. అటు మూడో సారి ప్రధాని పదవి చేపట్టి వరుసగా జవహర్‌ లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును సమం చేయాలని మోదీ ఉవ్విళ్లూరుతున్నారు.

అమిత్​ షా
పార్టీలో, కేంద్ర ప్రభుత్వంలో నెంబర్‌-2 గా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సగటు ఓటరుకు సుపరిచితురుడు. ఎన్నికల సమయంలో వ్యూహాలు రచిస్తూ చాణక్యుడిగా పేరు గాంచారు. తెరవెనక ఉండి వ్యూహాత్మక అడుగులు వేయడం సహా ప్రతిపక్షాలపై పదునైన వాగ్బాణాలను సంధిస్తారు. ఆర్టికల్‌ 370, పౌరసత్వ సవరణ చట్టం లాంటి సున్నిత అంశాలను కేంద్ర హోంమంత్రిగా దీటుగా ఎదుర్కొని ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఆయన సైన్యాధిపతిగా వ్యవహరిస్తూ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేసేవారు. ఈ ఎన్నికల్లోనూ ఆయన ఆ పాత్రనే పోషించనున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఉత్తరాది రాష్ట్రాలలో హిందూ అంశాన్ని బలంగా తీసుకెళుతున్నారు. చిరకాలంగా ఉన్న రామాలయ నిర్మాణాన్ని తమ హయాంలోనే పూర్తి చేశామని ఓటర్ల దృష్టికి తీసుకెళుతున్నారు.

రాహుల్​ గాంధీ
2019లో రాహుల్‌ గాంధీ అధ్యక్షతన ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్‌ క్షేత్రస్థాయిలో ప్రజాబలాన్ని కూడగట్టేందుకు జోడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సాగిన మెుదటి విడత యాత్రలో రాహుల్‌ వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. అయినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. జోడో యాత్ర సాగిన పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడమే అందుకు నిదర్శనం. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఏకంగా అధికారాన్ని కోల్పోగా, గుజరాత్‌లో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. ఛత్తీస్‌గఢ్‌ గుండా యాత్ర సాగకపోయినా ఆ రాష్ట్రంలో కూడా అధికారాన్ని చేజార్చుకుంది.

అయితే కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లలో మాత్రం కాంగ్రెస్ గెలుపొందింది. ఓ రకంగా యాత్ర ద్వారా రాహుల్‌ మిశ్రమ ఫలితాలను చవిచూశారు. దీంతో మలివిడత భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో ఆయన కుల గణన, విద్వేష మార్కెట్‌లో ప్రేమ దుకాణాలు తెరుస్తాం అనే కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. ముఖ్యంగా కుల గణన చేపట్టి రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని ఎత్తివేస్తామని హామీనిస్తున్నారు. తద్వారా యువతతో పాటు పలు వర్గాల ఓట్లు పొందేందుకు యత్నిస్తున్నారు. రైతుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని చెబుతున్నారు. ప్రజలను మత ప్రాతిపదికన బీజేపీ విడదిస్తోందని చెప్పి మైనార్టీల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. యువత ఓట్ల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెబుతున్నారు.

మల్లికార్జున ఖర్గే
కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేయడం వల్ల మల్లికార్జున ఖర్గే ఆ పార్టీ పగ్గాలు చేపట్టారు. దీంతో హస్తం పార్టీ ఇప్పుడు ఆయన నాయకత్వంలోనే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొబోతోంది. పతనావస్థలో ఉన్న పార్టీని ఎక్కువ స్థానాల్లో గెలిపించడమే లక్ష్యంగా ఆయన ఎన్నికల సంగ్రామంలోకి దిగుతున్నారు. అందుకు అనుగుణంగానే బీజేపీని అధికార పీఠం నుంచి గద్దె దించేందుకు కమలం పార్టీని వ్యతిరేకిస్తున్న పార్టీలతో కలిసివెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ హయాంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పతాక స్థాయికి చేరాయని చెప్పి మధ్య తరగతి, యువత ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

మమతా బెనర్జీ
ప్రధాని నరేంద్ర మోదీ, బలమైన బీజేపీని ఢీకొంటూ తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ్‌ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమిలో చేరిన మమతా సీట్ల పంపకాల విషయంలో మాత్రం కాంగ్రెస్‌తో సయోధ్య కుదరక 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బెంగాల్‌లో అంతకంతకు పెరుగుతున్న బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు ధరల పెరుగుదల, నిరుద్యోగం, కేంద్ర అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతోంది. అయితే సందేశ్‌ఖాలీ వ్యవహారం ఆమెకు తలనొప్పిగా మారింది. సందేశ్‌ఖాలీ వ్యవహారాన్ని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళుతుండటం వల్ల చివరకు ఆమె పార్టీ నాయకుడు షాజహాన్‌ షేక్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. శారదా కుంభకోణం, ఉపాధ్యాయుల నియామకాల్లో అవినీతి అమెను వెంటాడుతున్నాయి.

నీతీశ్​ కుమార్
ప్రతిపక్షాలు కూటమి కట్టడం వెనక కీలక పాత్ర పోషించిన జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ లోక్‌సభ ఎన్నికల ముందు ఎన్డీయే కూటమిలో చేరారు. దీంతో 40 లోక్‌సభ స్థానాలున్న బిహార్‌లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. నీతీశ్‌ యూటర్న్‌పై రానున్న ఎన్నికల్లో బిహార్‌ ప్రజలే తీర్పును చెప్పాల్సి ఉంది.

శరద్​ పవార్
మహారాష్ట్ర రాజకీయాలలో సీనియర్‌ నేతగా, ఎన్సీపీని జాతీయ పార్టీగా మార్చిన శరద్‌ పవార్‌ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బలమైన నేతగా ఉన్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి మహా వికాశ్‌ అఘాడీ రూపంలో గట్టి పోటీనే ఎదురుకానుంది. మహా వికాశ్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్‌, శివసేన-ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం, ఎన్సీపీ-శరద్‌ చంద్ర పవార్‌ పార్టీలు ఉన్నాయి. అయితే అజిత్‌ పవార్‌ కొంత మంది ఎమ్మెల్యేలతో కలిసి ఎన్డీఏ కూటమిలో చేరడం వల్ల శరద్‌ పవార్‌ బలగం త‌గ్గిపోయింది. పార్టీ పేరు, గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం అజిత్‌ పవార్‌ వర్గానికే కేటాయించింది. దీంతో ఇప్పుడు శరద్‌ పవార్‌ కొత్త గుర్తును, పేరును ప్రజల్లోకి బలంగా తీసుకొని పోవాలి.

స్టాలిన్
డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఇండియా కూటమిలో ఉన్న మరో బలమైన నేత. 39 స్థానాలున్న తమిళనాడులో 2019లో డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి 38 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని స్టాలిన్‌ పట్టుదలగా ఉన్నారు. అయితే సనాతన ధర్మంపై స్టాలిన్‌ కుమారుడు ఉదయ్‌నిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమికి ఇబ్బందికరంగా మారాయి.

తేజస్వీ యాదవ్
లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన తేజస్వీ యాదవ్‌ కూడా లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపగలరు. 2020లో తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన ఆర్జేడీ 75 స్థానాలను కైవసం చేసుకొని ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. నీతీశ్‌ కుమార్‌ ఆర్డేడీ, కాంగ్రెస్‌లతో చేతులు కలపడం వల్ల మహాఘట్‌బంధన్‌ కూటమి అధికారంలోకి వచ్చింది. నీతీశ్‌ కేబినెట్‌లో తేజస్వీ యాదవ్‌ ఉపముఖ్యమంత్రిగా పని చేశారు. కూటమి నుంచి నీతీశ్‌ కుమార్ వైదొలగడం వల్ల తేజస్వీ యాదవ్‌ మళ్లీ ప్రతిపక్ష నాయకుడిగా మారారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మంచి సంబంధాలున్న తేజస్వీ ఈ ఎన్నికల్లో అత్యధిక లోక్‌సభ స్థానాలను గెలుచుకొని తన నాయకత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.

అసదుద్దీన్​ ఓవైసీ
వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేసి ప్రతిపక్ష పార్టీల నుంచి బీజేపీ-బీ టీమ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐఎంఐఎం అధినేత అసద్దుదీన్‌ ఓవైసీ, పలు రాష్టాల లోక్‌సభ స్థానాల్లో గెలుపోటములను నిర్దేశించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో ముస్లింలు అత్యధికంగా ఉన్న చోట్ల ఆయన ఓట్లను చీల్చే అవకాశం ఉంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఓవైసీ ఆ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

44 రోజుల ప్రక్రియ- తొలి లోక్​సభ ఎన్నికల తర్వాత ఇప్పుడే ఎక్కువ!

'జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే'- క్లారిటీ ఇచ్చిన సీఈసీ!

Last Updated : Mar 16, 2024, 11:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.