ETV Bharat / bharat

లోక్​సభ మూడో దశ పోలింగ్​ కంప్లీట్- అసోంలో అత్యధికంగా, యూపీలో అత్యల్పంగా ఓటింగ్‌! - LOK SABHA ELECTIONS 2024 - LOK SABHA ELECTIONS 2024

Lok Sabha Elections 2024 phase 3 Live Updates : లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ముగిసింది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంల్లోని 93 స్థానాలకు ఓటింగ్‌ జరిగింది. .

Lok Sabha Elections 2024 phase 3 Live Updates
Lok Sabha Elections 2024 phase 3 Live Updates (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 6:40 AM IST

Updated : May 7, 2024, 6:01 PM IST

  • 06:00

లోక్​సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మూడో విడతలో భాగంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో మంగళవారం ఓటింగ్‌ పూర్తైంది. సమయం ముగిసినప్పటికీ పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. అన్ని స్థానాల్లో కలిపి 64.58% పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. అయితే ఇవి అంచనా గణాంకాలు మాత్రమేనని, మరిన్ని వివరాలు సేకరిస్తున్నందున ఓటింగ్‌ శాతం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

  • 04:20

మూడో దశ ఎన్నికల పోలింగ్​లో భాగంగా మధ్యాహ్నం మూడు గంటల వరకు 50.71% పోలింగ్ నమోదైంది. బంగాల్​లో అధికంగా 63.11 శాతం, మహారాష్ట్రంలో అత్యల్పంగా 42.63శాతం పోలింగ్ నమోదైంది. అసోంలో 63.88 శాతం, బిహార్​లో 46.69శాతం, ఛత్తీస్‌గఢ్​లో 58.19శాతం, గోవాలో 61.39శాతం, గుజరాత్​లో 47.03శాతం, కర్ణాటకలో 54.20శాతం, మధ్యప్రదేశ్​లో 54.09శాతం, ఉత్తర్​ప్రదేశ్​లో 46.78శాతం పోలింగ్ నమోదైంది.

  • 2.10 PM

మూడో దశ ఎన్నికల పోలింగ్​లో భాగంగా మధ్యాహ్నం ఒంటిగంట గంటల వరకు 39.92% పోలింగ్ నమోదైంది.

  • అసోం- 45.88%
  • బిహార్- 36.69%
  • ఛత్తీస్‌గఢ్- 46.14%
  • దాద్రా & నగర్​హవేలీ, దామన్ దీవ్​- 39.94%
  • గోవా- 49.04%
  • గుజరాత్- 37.83%
  • కర్ణాటక- 41.59%
  • మధ్యప్రదేశ్- 44.67%
  • మహారాష్ట్ర- 31.55%
  • ఉత్తర్​ప్రదేశ్- 38.12%
  • బంగాల్- 49.27%

11.55 AM

మూడో దశ ఎన్నికల పోలింగ్​లో భాగంగా ఉదయం 11 గంటల వరకు 25.41% పోలింగ్ నమోదైంది.

  • అసోం- 27.34%
  • బిహార్- 24.41%
  • ఛత్తీస్‌గఢ్- 29.90%
  • దాద్రా & నగర్​హవేలీ, దామన్ దీవ్​- 24.69%
  • గోవా- 30.94%
  • గుజరాత్- 24.35%
  • కర్ణాటక- 24.48%
  • మధ్యప్రదేశ్- 30.21%
  • మహారాష్ట్ర- 18.18%
  • ఉత్తర్​ప్రదేశ్- 26.12%
  • బంగాల్- 32.82%
  • 11.38 AM

ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్​ అదానీ అహ్మదాబాద్​లోని ఓ పోలింగ్​ బూత్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బెలగావి బీజేపీ అభ్యర్థి జగదీశ్​ శెట్టర్​ తన కుటుంబంతో సహా ఓటు వేశారు.

  • 10.46 AM

కర్ణాటకలో ఇద్దరు పోలింగ్​ అధికారులు మృతి
కర్ణాటకలో ఇద్దరు పోలింగ్ అధికారులు మృతిచెందినట్లు సమాచారం. వారిని గోవిందప్ప సిద్ధపుర(48), ఆనంద్​ తెలంగ్(32)గా గుర్తించారు. గోవిందప్ప ప్రభుత్వ పాఠశాల హెడ్​ మాస్టర్​గా పనిచేస్తున్నారు. ఆనంద్​ బీదర్​ జిల్లాలోని కుదుంబల్​లో అసిస్టెంట్ అగ్రికల్చరల్​ ఆఫీసర్​​గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ హార్ట్​ ఎటాక్​ వల్ల మృతిచెందారని సమాచారం. బిహార్​లో పోలింగ్​ బూత్​లో ఓ ప్రిసైడింగ్ అధికారి మృతి చెందారు.
మరోవైపు, సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆయన భార్య, ఎస్​పీ మణిపురి అభ్యర్థి డింపుల్ యాదవ్​ సయిఫాయ్​లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 10.27 AM

పోలింగ్​ బూత్​లో ప్రిసైడింగ్ అధికారి మృతి
బిహార్​లోని సుపాల్​ పోలింగ్​లో బూత్​లో ప్రిసైడింగ్​ అధికారు గుండెపోటుతో మృతి చెందారని అధికారులు తెలిపారు. ఆయనను శైలేంద్రకుమార్​గా గుర్తించారు. 'ఆయన మంగళవారం ఉదయం చనిపోయారు. హీహెచ్​సీకి తరలించగా చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ​ ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువులకు సమాచారం అందించారు. వారు​ ఆస్పత్రికి వచ్చారు. పోస్టుమార్టంలో ఆయనకు షుగర్​ ఉన్నట్లు తేలింది' అని ఓ వైద్యుడు తెలిపారు.

  • 10.20 AM

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయన భార్య రధాభాయి ఖర్గేతో కలిసి కర్ణాటకలోని కళబురగిలో ఓటు వేశారు. కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ హవేరి లోక్​సభ అభ్యర్థి బసవరాజ్​ బొమ్మై ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ లీడర్​ కేఎస్ ఈశ్వరప్ప కుటుంబ సమేతంగా ఓటు వేశారు.
మరోవైపు, మహారాష్ట్రలో బారామతి ఎన్​సీపీ(శరద్) అభ్యర్థి సుప్రియా సూలే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడి నుంచి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్​ పవార్​ భార్య సునేత్ర పవార్​ బరిలోకి దిగారు.

  • 09.50 AM

మూడో దశ ఎన్నికల పోలింగ్​లో భాగంగా ఉదయం 9 గంటల వరకు 10.57% పోలింగ్ నమోదైంది.

  • అసోం- 10.12%
  • బిహార్- 10.03%
  • ఛత్తీస్‌గఢ్- 13.24%
  • దాద్రా & నగర్​హవేలీ, దామన్ దీవ్​- 10.13%
  • గోవా- 12.35%
  • గుజరాత్- 9.87%
  • కర్ణాటక- 9.45%
  • మధ్యప్రదేశ్- 14.22%
  • మహారాష్ట్ర- 6.64%
  • ఉత్తర్​ప్రదేశ్- 11.63%
  • బంగాల్- 14.60
  • 09.40 AM

మధ్యప్రదేశ్​ గవర్నర్​ మంగుభాయ్​ పటేల్ గుజరాత్​లోని నవ్​సారి పోలింగ్​ బూత్​లో కుటంబ సమేతంగా ఓటు వేశారు. మరోవైపు కేంద్ర మంత్రి, రత్నగిరి-సింధుదుర్గ్​ బీజేపీ అభ్యర్థి నారాయణ్​ రాణే, ఆయన భార్య ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 09.23 AM

కేంద్ర హోం మంత్రి, గాంధీనగర్​ లోక్​సభ అభ్యర్థి అమిత్​ షా అహ్మదాబాద్​లోని ఓ పోలింగ్​ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీసీసీఐ కార్యదర్శి జై షా సహా ఆయన కుటుంబ సభ్యులు ఓటేశారు. అనంతరం అమిత్​ షా, భార్య సోనల్​ షా సమేతంగా అహ్మదాబాద్​లో ఉన్న కామేశ్వర్​ మహాదేవ్​ ఆలయంలో పూజలు చేశారు.

  • 09.00 AM
    అహ్మాదాబాద్​లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్ణాటక హుబ్బళ్లిలో కేంద్ర మంత్రి ప్రహాద్ జోషి, మహారాష్ట్ర బారామతిలో NCP-SCP చీఫ్ శరద్ పవార్ ఓటేశారు.
  • 08.38 AM
    మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విదిశా లోక్​సభ అభ్యర్థి శివరాజ్​ సింగ్ చౌహాన్ ఓటేశారు. గుజరాత్​లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, పోర్​బందర్ ఎంపీ అభ్యర్థి మనుసుఖ్ మాండవీయ ఓటు వేశారు. మహారాష్ట్రలో సినీ నటి జెనీలీయా, రితేష్ దేశ్​ముఖ్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడాగని అంతా ఓటు వేయండని కోరారు. "రాజ్యాంగాన్ని రక్షించడానికి ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఓటు వేయండి! 93 నియోజకవర్గాల్లో 11 కోట్ల మంది ప్రజలు తమ ప్రజాస్వామిక హక్కును వినియోగించుకోవాలి, కేవలం తమ ప్రతినిధులను ఎన్నుకోవడమే కాకుండా, రాజ్యాంగ హక్కులను కాపాడే వారికి ఓటు వేయండి" అని పిలుపునిచ్చారు.
  • 08.18 AM
    ఉత్తర్​ప్రదేశ్ గవర్నర్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ అహ్మదాబాద్‌లో ఓటు వేశారు.
  • 8.00 AM

కొనసాగుతున్న మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్

గుజరాత్‌: అహ్మదాబాద్‌లో ఓటు వేసిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీతో పాటు పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన అమిత్‌షా

పోలింగ్‌ కేంద్రం వద్ద ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని మోదీ

అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోదీ పిలుపు

ఎండల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు: ప్రధాని

ఎన్నికల వేళ ప్రజలు ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి: ప్రధాని మోదీ

వీలైనంత ఎక్కువ నీళ్లు తాగితే ఆరోగ్యం బాగుంటుంది: ప్రధాని

సమయంతో పోటీపడుతూ మీడియా పనిచేస్తోంది: ప్రధాని

ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉంది: ప్రధాని

పెద్దసంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోదీ

  • 7.45 AM
    గుజరాత్ గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని నిషాన్ పబ్లిక్ స్కూల్​లో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకుముందు పోలింగ్ బూత్ వెలుపల ఉన్న ఓటర్లకు అభివాదం చేశారు. పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చాక తాను తన ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చేతి వేలికి ఉన్న సిరా చుక్కను చూపించారు. ఆయన వెంట కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఉన్నారు.
  • 7.30 AM
    మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్​పవార్​తోపాటు ఆయన సతీమణి, బారామతి లోక్​సభ అభ్యర్థి సునేత్ర పవార్ ఓటేశారు. మరోవైపు, కర్ణాటకలో బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప, ఆయన కుమారులు విజయేంద్ర, రాఘవేంద్ర ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • 7:00 AM

పోలింగ్ ప్రారంభం
సార్వత్రిక ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. 11 రాష్ట్రాల్లోని 93సీట్లకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే పోలింగ్​ స్టేషన్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ దశలో మొత్తం 1351 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మూడో విడతలో వాస్తవానికి 94 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా, సూరత్ సీటు బీజేపీకి ఏకగ్రీవమైంది. జమ్ముకశ్మీర్ రాజౌరీ-అనంత్ నాగ్ నియోజకవర్గంలో రవాణా సమస్యలతో పోలింగ్ తేదీని ఆరో విడతకు మార్చారు. మధ్యప్రదేశ్‌లో రెండో విడతలో జరగాల్సిన ఒక స్థానాన్ని ఈ విడతలో నిర్వహిసున్నారు. మరోవైపు, మూడో దశంలో రికార్డు సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

  • 06.35 AM

Lok Sabha Elections 2024 phase 3 Live Updates : లోక్​సభ ఎన్నికలకు మూడో విడత పోలింగ్​కు సర్వం సిద్ధమైంది. మూడో విడతలో భాగంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో మంగళవారం ఓటింగ్‌ జరగనుంది. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ (ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. 1,300 మందికిపైగా అభ్యర్థులు మూడో దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వారిలో 120 మందికిపైగా మహిళలు ఉన్నారు.

పోటీలో ప్రముఖులు
కేంద్రమంత్రులు అమిత్‌ షా, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్‌ మాండవీయ, పురుషోత్తమ్‌ రూపాలా, ప్రహ్లాద్‌ జోషి, ఎస్‌.పి.సింగ్‌ బఘెల్‌ కూడా ఈ దశ బరిలో నిలిచారు. గుజరాత్‌, కర్ణాటక, బిహార్‌, మధ్యప్రదేశ్‌ల్లో మంగళవారం పోలింగ్‌ జరగనున్న అన్ని స్థానాలను 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీయే దక్కించుకుంది. వాటిని నిలబెట్టుకునేందుకు కమలదళం తీవ్రంగా కృషిచేస్తోంది.

ఓటేయనున్న మోదీ, అమిత్ షా
ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలు ఉండగా, సూరత్‌లో ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. దీంతో మిగిలిన 25 సీట్లకు మూడో విడతలో పోలింగ్‌ జరగనుంది. గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని అహ్మదాబాద్‌ నగరంలో మోదీ, అమిత్‌ షా మంగళవారం ఓటు వేయనున్నారు.

ఆ కుటుంబానికి కీలకం!
ఉత్తర్‌ప్రదేశ్‌లో ములాయంసింగ్‌ యాదవ్‌ కుటుంబానికి ఈ విడత ఎన్నికలు చాలా కీలకం. ఆ కుటుంబం నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు. మైన్‌పురీలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ బరిలో నిలిచారు. ములాయం మరణం తర్వాత మైన్‌పురీ ఉప ఎన్నికల్లో ఆమె గెలిచారు. ఎస్పీ జాతీయ ముఖ్య ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్‌ యాదవ్‌ తనయుడు అక్షయ యాదవ్‌ ఫిరోజాబాద్‌ నుంచి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివపాల్‌ యాదవ్‌ కుమారుడు ఆదిత్య యాదవ్‌ బదాయూ నుంచి పోటీలో ఉన్నారు. మరోవైపు- మహారాష్ట్రలో బారామతి నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడ ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ కుమార్తె, సిటింగ్‌ ఎంపీ సుప్రియా సూలే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్రా పవార్‌ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ విడతతో 283 సీట్లలో పోలింగ్‌ పూర్తవనుంది.

కర్ణాటకలో తుది సమరం
కర్ణాటకలో తుది విడత సార్వత్రిక సమరానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం 28 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. గత నెల 26న 14 చోట్ల పోలింగ్‌ ముగిసింది. మిగిలిన 14 సీట్లలో మంగళవారం ఓటింగ్‌ జరగనుంది. దక్షిణ భారత్‌లో కనీసం 50 స్థానాలు గెల్చుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దాన్ని అందుకోవాలంటే కర్ణాటకలో సత్తా చాటడం అత్యంత కీలకం. మరోవైపు- రాష్ట్రంలో నిరుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, జాతీయ స్థాయిలోనూ పట్టు బిగించాలని చూస్తోంది. అందులో భాగంగా కన్నడనాట ఈసారి మెజార్టీ సీట్లు దక్కించుకోవడంపై దృష్టిసారించింది. ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై వచ్చిన తీవ్రస్థాయి లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్రంలో ఎన్నికల వేడిని ఇటీవల మరింత పెంచడం గమనార్హం.

ఈ విడత ముఖచిత్రం

  • పోలింగ్ జరగనున్న స్థానాలు: 93
  • మొత్తం ఓటర్లు: 17.24 కోట్లు
  • వీరిలో మహిళలు: 8.39 కోట్లు
  • పోలింగ్ కేంద్రాలు: 1.85 లక్షలు
  • ఎక్కడ ఎన్ని?
  • గుజరాత్- 25
  • కర్ణాటక- 14
  • మహారాష్ట్ర- 11
  • ఉత్తర్ ప్రదేశ్- 10
  • మధ్యప్రదేశ్- 9
  • ఛత్తీస్​గఢ్- 7
  • బిహార్- 5
  • బంగాల్- 4
  • అసోం- 4
  • గోవా- 2
  • దాద్రానగర్ హవేలీ, దమణ్ దీవ్- 2

Last Updated : May 7, 2024, 6:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.