ETV Bharat / bharat

లీప్ ఇయర్ అంటే ఏమిటి? నాలుగేళ్లకోసారి ఎందుకొస్తుంది? ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం! - లీపు సంవత్సరము ఫ్యాక్ట్స్

Leap Year Interesting Facts : 2024 సంవత్సరాన్ని లీప్ ఇయర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ ఏడాది 365 రోజులకు బదులు 366 రోజులు రానున్నాయి. ఫిబ్రవరి నెల 29వ తేదీతో ముగుస్తుంది. అస‌లు లీపు సంవ‌త్స‌రం అంటే ఏంటి? ప్రతి నాలుగు సంవత్సారాలకు లీపు ఇయర్ ఎందుకు వ‌స్తుంది? వంటి ఇంట్రెస్టింగ్ విష‌యాలు మీకోసం.

Leap Year Interesting Facts
Leap Year Interesting Facts
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 10:24 PM IST

Leap Year Interesting Facts : ఏటా ఫిబ్ర‌వ‌రి 28వ తేదీతో ముగుస్తుంది. కానీ ఈ ఏడాది 29వ తేదీతో ముగియ‌నుంది. ఒకరోజు అద‌నంగా వ‌చ్చింది. ప్ర‌తి నాలుగేళ్లకోసారి ఇలా జ‌రుగుతుంద‌ని అంద‌రికీ తెలుసు. దీనికి కార‌ణం లీపు సంవ‌త్స‌రం. అయితే అస‌లు ఈ లీపు సంవ‌త్స‌రం అంటే ఏంటి? అది నాలుగు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి మాత్ర‌మే ఎందుకు వ‌స్తుంది? ఈ లీపు ఇయర్​కు ఉన్న ప్ర‌త్యేకత ఏంటి? తదితర విషయాలు తెలుసుకుందాం.

లీప్ ఇయర్ అనేది మన సాధారణ సంవత్సరంతో పోలిస్తే, అదనపు రోజు ఉన్న క్యాలెండర్ సంవత్సరం. సాధార‌ణంగా ఏడాదికి 365 రోజులుంటాయి. కానీ లీపు సంవ‌త్స‌రంలో ఒకరోజు అద‌నంగా అంటే 366 రోజులుంటాయి. ప్ర‌పంచంలో అత్య‌ధికంగా ఉప‌యోగించే గ్రెగోరియ‌న్ క్యాలెండ‌ర్ ప్ర‌కారం ప్ర‌తి నాలుగేళ్లకోసారి ఈ లీపు సంవ‌త్స‌రం వ‌స్తుంది. అప్పుడు ఫిబ్ర‌వ‌రిలో 29వ తేదీ కూడా ఉంటుంది. నాలుగుతో విభ‌జిత‌మ‌య్యే ప్ర‌తి సంవ‌త్స‌రం ఈ లీపు ఇయర్​ అవుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు 2020, 2024. అలాగే 1900 లేదా 00 తో ముగిసే సంవ‌త్సరాల‌కు లీపు రాదు. త‌ర్వాతి లీప్ ఇయ‌ర్స్ 2028, 2032,2036 సంవత్సరాల్లో వ‌స్తాయి.

ఇతర క్యాలెండ‌ర్లలో లీపు సంవ‌త్స‌రాలు!
హిబ్రూ, ఇస్లామిక్, చైనీస్, ఇథియోపియన్ క్యాలెండర్లు స‌హా ఇతర క్యాలెండర్‌లు కూడా లీపు సంవత్సరాల్ని క‌లిగి ఉన్నాయి. అయితే ఇవి ప్ర‌తి నాలుగేళ్ల‌కోసారి రావు. కొన్నింటిల్లో త‌క్కువ వ్య‌వ‌ధితో, మ‌రికొన్ని ఒక‌టి కంటే ఎక్కువ లీప్ రోజుల్ని క‌లిగి ఉంటాయి. లీప్ ఇయర్స్, లీప్ డేస్‌తో పాటు గ్రెగోరియన్ క్యాలెండర్‌లో కొన్ని లీప్ సెకన్లు కూడా ఉన్నాయి.

మనకు లీపు సంవత్సరాలు ఎందుకు అవసరం?
మ‌న‌కు నిజంగా ఈ లీపు సంవ‌త్స‌రాలు అవ‌స‌ర‌మా అని అనిపించ‌వ‌చ్చు. కానీ ఇవి చాలా ముఖ్య‌మైన‌వి. సోలార్ ఇయ‌ర్​లో 5 గంటల 48 నిమిషాల 56 సెకన్లు సమయం ఎక్కువ‌గా ఉంటుంది. అంటే దాదాపు 365.24 రోజులు. ఇది ఇలాగే కొనసాగితే కాల‌క్ర‌మేణా సీజ‌న్లు మారతాయి. ఉదాహ‌ర‌ణ‌కు 700 సంవత్సరాల త‌ర్వాత‌ వేసవి కాలం జూన్‌కు బదులుగా డిసెంబర్‌లో ప్రారంభమవుతుందని నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం తెలిపింది. అందుకే ప్ర‌తి నాలుగేళ్ల‌కోసారి లీప్ డేను జోడించ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య త‌లెత్త‌కుండా ఉంటుంది.

లీపు సంవత్సరాల ఆలోచన క్రీస్తు పూర్వం 45 నాటిది. ప్రాచీన రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్‌ను స్థాపించినప్పుడు ఒక ఏడాది 365 రోజులతో 12 నెలలుగా విభజించారు. ఆ స‌మ‌యంలో జులై, ఆగ‌స్టు రెండు నెల‌లను క్వింటిలిస్, సెక్స్టిలిస్​గా పిలిచేవారు. త‌ర్వాత వాటిని జూలియస్ సీజర్, అతడి వారసుడు అగస్టస్ పేరు పెట్టారు. కొన్నిరోజుల వ‌ర‌కు ఈ క్యాలెండ‌ర్ బాగానే ఉన్నా 16వ శతాబ్దపు మధ్యకాలం నాటికి ఈస్టర్ వంటి ముఖ్యమైన సెలవులు, సీజ‌న్లు 10 రోజుల ముందుగానే సీజన్‌లు ప్రారంభమవుతున్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు గమనించారు. దీన్ని ప‌రిష్క‌రించ‌డానికి గ్రెగోరియ‌న్ క్యాలెండ‌ర్​ను ప్ర‌వేశ‌పెట్టారు. మ‌రి ఈ ఫిబ్ర‌వరిలోనే లీపు ఎందుకు వ‌స్తుందంటే ఉన్న నెల‌ల్లోక‌ల్లా రెండో నెలలోనే త‌క్కువ రోజులుంటాయి కాబ‌ట్టి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు!
క్రీస్తు శ‌కం 1700ల నాటికి మ‌హిళ‌లు పురుషులకు ప్రపోజ్ చేయడానికి లీప్ డేను ఉపయోగించారు. 1900ల నాటికి గ‌రిష్ఠ స్థాయికి చేరుకుని యూకేలో ఇప్పటికీ కొన‌సాగుతోంది. వరల్డ్ హెరిటేజ్ ఎన్‌సైక్లోపీడియా ప్రకారం జేమ్స్ మిల్నే విల్సన్ అనే బ్రిటిష‌ర్ 1800లలో లీపు రోజున అంటే ఫిబ్ర‌వ‌రి 29న జ‌న్మించి మ‌ళ్లీ లీపు రోజునే మ‌ర‌ణించాడు. విల్సన్ తన 17వ పుట్టిన రోజున మరణించాడు. ఇది సాధారణ సంవత్సరాల్లో కాలిక్యులేట్ చేస్తే 68 ఏళ్ల వయస్సులో మరణించిన‌ట్లు లెక్క‌. అమెరిక‌న్ ర‌చ‌యిత టోనీ రాబిన్స్, ఇటాలియ‌న్ కంపోజ‌ర్ గియోచినో రోస్సినీకి అనే ఇద్ద‌రూ ఫిబ్ర‌వ‌రి 29నే జ‌న్మించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు పిల్లలు వరుసగా మూడు లీపు రోజుల్లో జన్మించే అవకాశం చాలా అరుదు. కానీ నార్వేలోని హెన్రిక్సెన్ కుటుంబంలో అది నిజంగా జ‌రిగింది. హెడీ హెన్రిక్సెన్ 1960 ఫిబ్రవరి 29న, ఆమె సోదరుడు ఒలావ్ నాలుగు సంవత్సరాల తర్వాత 1964 ఫిబ్రవరి 29న, బేబీ లీఫ్-మార్టిన్ 1968 ఫిబ్రవరి 29న జన్మించారు.

హిమాచల్​లో ఆపరేషన్ కమలం- సుఖు సర్కార్​పై అవిశ్వాస తీర్మానం? రంగంలోకి డీకే, హుడా

పొట్టలో 37 కాయిన్స్, 39 మ్యాగ్నెట్స్​- జింక్​ కోసం నాణెలు మింగిన వ్యక్తి! ఆపరేషన్​ చేసిన వైద్యులు షాక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.