ETV Bharat / bharat

'కృష్ణుడి ఆలయం నిర్మించేవరకు ఒక్కపూటే భోజనం'- విద్యాశాఖ మంత్రి ప్రతిజ్ఞ

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 6:57 PM IST

Updated : Jan 22, 2024, 9:32 PM IST

Krishna Janmabhoomi Temple Madan Dilawar : మథురలో శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణం జరిగేవరకు ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తానని రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ ప్రతిజ్ఞ చేశారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగాక రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావార్ అప్పట్లో చేసిన ప్రతిజ్ఞను వీడారు. అనేక ఏళ్ల తర్వాత పూలమాలను ధరించారు.

Krishna Janmabhoomi Temple Madan Dilawar

Krishna Janmabhoomi Temple Madan Dilawar : శతాబ్దాలుగా భారతీయులు ఎదురుచూస్తున్న రామ మందిరం కల ఎట్టకేలకు సాకారమైంది. ఎన్నో వివాదాలు, మరెన్నో న్యాయ పోరాటాలను అధిగమించి రాములోరికి శాశ్వత నివాసాన్ని నిర్మించాలన్న ప్రయత్నం విజయవంతమైంది. బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠతో భారతీయుల చిరకాల స్వప్నం నెరవేరినట్లయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించి పులకరించిపోయారు.

అయితే రామమందిరం నిర్మించే వరకు మెడలో మాల ధరించనని రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి, ఆర్​ఎస్​ఎస్ సభ్యుడైన మదన్ దిలావర్ అనేక ఏళ్ల క్రితం చేసిన ప్రతిజ్ఞను వీడారు. భారీ మాలను ధరించి దీక్షను విరమించారు. 34కిలోల బరువున్న పూల మాలను బీజేపీ కార్యకర్తలు ముందుగా శ్రీరాముడికి సమర్పించి అనంతరం దీవెనగా మదన్ మెడలో వేశారు. అయితే మదన్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు మంత్రి అయ్యాక కూడా ఎలాంటి పరిస్థితుల్లో మెడలో పూలమాల వేసుకోకపోవడం గమనార్హం.

ఈ సందర్భంగా తన కరసేవ జ్ఞాపకాలను వివరించిన మదన్ దిలావర్ మరో ప్రతిజ్ఞ చేశారు. శ్రీకృష్ణ జన్మస్థలమైన మధురలో కృష్ణుడి ఆలయాన్ని నిర్మించే వరకు రోజుకు ఒక్కసారి మాత్రమే భోజన చేస్తానని చెప్పారు. రామ మందిర నిర్మాణంపై ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా ఉన్న ఓ మహిళ ఇంట్లో భోజనం చేసి ఆమెకు చీర, రూ.51వేలు కానుకగా ఇచ్చారు. రామ్​ గంజ్ మండిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా జరిగిన ర్యాలీలో డ్రమ్ము వాయించారు.

ప్రతిజ్ఞ చేస్తున్న విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్

32 ఏళ్ల దీక్ష విరమించిన 60 ఏళ్ల వృద్ధుడు
మహారాష్ట్రలోని జల్​గావ్​కు చెందిన 60ఏళ్ల వృద్ధుడు సైతం తన 32ఏళ్ల దీక్షను విరమించాడు. రామమందిరం నిర్మించేవరకు చెప్పులు ధరించనని విలాస్​ భావ్​సర్​ అనే వ్యక్తి 1992లో ప్రతిజ్ఞ చేశాడు. ఆనాటి నుంచి చెప్పులు వేసుకోకుండా నడిచిన అతడు, తాజాగా అయోధ్యలో రాములోరి ప్రాణప్రతిష్ఠ పూర్తి కావడం వల్ల దీక్షను విరమించాడు. జలగావ్​లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గిరీశ్​ మహాజన్​, అతడికి చెప్పుల జతను అందించారు.

Last Updated : Jan 22, 2024, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.