Kerala Chenda Melam : ఇక్కడ వీరు వాయిస్తున్నది గమనించారా? ఎంతో వినసొంపుగా ఉంది కదూ! కేరళలో అత్యంత ప్రాచుర్యం పొందిన కళల్లో ఈ చెండెమేళం ఒకటి. డప్పులాంటి వాటిపై కర్రలతో ఇలా సంగీతాన్ని సృష్టించడమే చెండెమేళం. వీళ్లంతా ఒకే గ్రామానికి చెందినవారు. కేవలం చిన్న పిల్లలు మాత్రమే కాకుండా పెద్ద వాళ్లు సైతం ఈ కళను నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటికొక్కరైనా చెండెమేళం కళాకారులు ఉండాలని లక్ష్యంగా పెట్టుకుని మరీ నేర్చుకుంటున్నారు కాసరగోడ్ జిల్లాకు చెందిన ఉడుమ కోకల్ గ్రామస్థులు.
చెండెమేళంను షణ్ముఖ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో విశ్వనాథన్ అనే వ్యక్తి ఉచితంగా నేర్పిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 80మంది వరకు ఈ కళను నేర్చుకుంటున్నారు. వీరిలో పిల్లలు సహా 45 ఏళ్లు దాటిన మహిళలు కూడా ఉన్నారు. తొలిదశలో భాగంగా రోజూ సాయంత్రం ఏడు గంటలకు గ్రానైట్ రాయిపై చింత కర్రలతో ప్రాక్టీస్ చేపిస్తారు. ఇప్పటికే మూడు నెలల పాటు శిక్షణ తీసుకుని గణపతికై, తకిట, తరికిత, చెంపాడ, త్రిపాట దశలను దాటి ఇప్పుడు ఐదో దశకు చేరుకున్నారని చెండెమేళం శిక్షకుడు విశ్వనాథన్ వివరించారు.
"మేము ఈ విద్యను గత 6ఏళ్ల నుంచి నేర్పిస్తున్నాం. ఇందులో పంచరీ స్టైల్‌ను నేర్పిస్తున్నాం. దీన్ని సంప్రదాయంగా దేవాలయాల్లో వాయిస్తారు. అలాగే చెండె మేళంలో మరొక శైలి ఉంది. దాన్ని ఊరేగింపులు, పండుగల్లో వాయిస్తారు. ఇక్కడి విద్యార్థులందరూ ఈ చెండెమేళాన్ని ఎంతో వేగంగా నేర్చుకుంటున్నారు."
-విశ్వనాథన్, చెండ మేళం గురువు
ప్రతి ఇంట్లో ఒక్కరికి
వేసవి సెలవుల్లో కూడా చెండెమేళాన్ని నేర్చుకునేందుకు విద్యార్థులు వచ్చేవారని విశ్వనాథన్ అంటున్నారు. ఉడుమ కోకల్ గ్రామంలో గతేడాది ఏప్రిల్‌లో చెండెమేళం శిక్షణను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఒక్కరికి ఈ కళను నేర్పించడమే తన లక్ష్యమని విశ్వనాథన్ అన్నారు.
బ్యాంక్ లాకర్లలో 140ఏళ్ల నాటి పెన్నులు- రూ.లక్షల్లో ధర!
సాధారణంగా బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తుంటారు. అలా చేస్తే అవి దొంగలబారిన పడకుండా భద్రంగా ఉంటాయని భావిస్తారు. అయితే బిహార్‌లోని గయాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం దాదాపు 140ఏళ్ల క్రితం నాటి పెన్నులను బ్యాంకు లాకర్లతో దాస్తున్నారు. పెన్నులను లాకర్లలో భద్రపరచడమేంటి? ఆ పెన్నుల ప్రత్యేకత ఏంటి? వాటి ధర ఎంత ఉంటుంది? తదితర వివరాలు తెలియాలంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.
నీట్‌పై సుప్రీంకోర్టు విచారణ జులై 18కి వాయిదా
UGC NET ప్రశ్నాపత్రం నకిలీ స్క్రీన్‌షాట్ సర్క్యులేట్- పాఠశాల విద్యార్థిపై CBI ఛార్జ్‌షీట్!