karur Married Woman Arrested for Cheating : ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఓ నిత్య వధువు, మూడో వివాహానికి సిద్ధమైంది. ఎందుకిలా చేస్తున్నావని రెండో భర్త ప్రశ్నించగా తనకు నచ్చినవారితో జీవిస్తానని సమాధానం చెప్పింది. మొదటి పెళ్లి గురించి రెండో భర్తకు తెలియకుండా జాగ్రత్తపడింది. అలాగే రెండో పెళ్లి గురించి చెప్పకుండా మరో వ్యక్తిని మోసగించేందుకు సిద్ధపడింది. ఈ ఘటన తమిళనాడులోని కరూల్ జిల్లాలో జరిగింది.
కరూర్ జిల్లా ఎలవనూరు ప్రాంతానికి చెందిన సెల్వకుమార్ ఫైనాన్షియర్. కోయంబత్తూరులోని సెంచరీ హిల్‌కు చెందిన కృతిక(25)అనే యువతిని 2020లో పెళ్లి చేసుకున్నాడు. వివాహం అనంతరం సెల్వకుమార్ తన కుటుంబంతో కలిసి పుదుకోట్టై జిల్లా అరంతంగిలో ఉంటూ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే పెళ్లైనప్పటి నుంచి కృతిక తన తల్లి బాలామణి వద్దకు తరచుగా వెళ్తుండేది. అప్పుడు సెల్వకుమార్‌కు అనుమానం వచ్చింది. ఇన్నిసార్లు పుట్టింటికి ఎందుకు వెళ్తున్నావని కృతికను ప్రశ్నించాడు సెల్వ కుమార్. దీంతో దంపతులిద్దరి మధ్య గొడవ జరిగింది.
భర్త నగలతో పరార్
ఆ తర్వాత కొద్ది రోజుల వరకు అంతా బాగానే ఉన్నారు. అయితే గతేడాదిలో ఓ రోజు కృతిక తన భర్త సెల్వకుమార్ బ్యూరో నుంచి డబ్బులు, నగలతో ఉడాయించేసింది. నగలు, డబ్బులతో సహా కృతిక కనపడకపోవడం వల్ల ఆమె కోసం వెతికారు. కృత్రికను సంప్రదించేందుకు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చి కృతిక పుట్టింటికి వెళ్లాడు సెల్వకుమార్. అక్కడికి వెళ్లి చూస్తే ఇంట్లో కూడా ఎవరూ లేరు. పక్కన వాళ్లను అడిగితే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని చెప్పారు.
బంధువుల ద్వారా సెల్వ కుమార్ ఆరా తీయగా సుల్తాన్ పేట పోలీసు స్టేషన్ పరిధిలోని సెంచెరిమలై ప్రాంతంలో కృతిక నివాసం ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఆ తర్వాత కృతికను కలిసి తనతో జీవించమని కోరాడు. కానీ అందుకు కృతిక అంగీకరించలేదు. బంగారు ఆభరణాలు, నగదు డిమాండ్ చేసినందుకు కృతికపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు సెల్వ కుమార్. అయినా కృతిక బెదరలేదు. ఆ తర్వాతే ఫైనాన్షియర్ సెల్వకుమార్ కృతికను పెళ్లి చేసుకుని మోసపోయానని గ్రహించాడు. చిన్నధరపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
కోర్టులో పిటిషన్
పోలీసులు కృతికపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల కరూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కృతికపై కేసు నమోదు చేసుకున్నారు. తన మొదటి భర్త నుంచి తాను విడాకులు తీసుకోలేదని పోలీసుల విచారణలో కృతిక తెలిపింది. తనకు నచ్చినవారితో కలిసి జీవిస్తానని చెప్పింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. అప్పటికి కృతికపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల సెల్వకుమార్ తమిళనాడు ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య కృతిక సూర్య అనే యువకుడితో మూడో పెళ్లి సంప్రదింపులు జరుపుతోందని అరవకురిచ్చి లా అండ్ క్రిమినల్ ఆర్బిట్రేషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ తర్వాత విచారణ జరిపిన పోలీసులు కృతిక, ఆమె తల్లి బాలామణిని అరెస్ట్ చేశారు. జడ్జి ఆదేశాల మేరకు కృతికను 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ కింద తిరుచ్చి సెంట్రల్ జైలుకు తరలించారు.
'వయసు అయిపోతోంది, పెళ్లి చేయండి!'- వాటర్ ట్యాంక్ ఎక్కి మరీ 35ఏళ్ల మహిళ డిమాండ్!