Kangana On Farmers Protest : మూడు వ్యవసాయ చట్టాల రద్దుకోసం రైతులు చేసిన ఆందోళనపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీనిపై విపక్షాలు, అఖిల భారత కిసాన్ సభ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆమె వ్యాఖ్యలు యావద్దేశ రైతులను అవమానించేలా ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మరోవైపు కంగనా వ్యాఖ్యలను బీజేపీ సైతం తప్పుబట్టింది. దీనికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.
కేంద్రంలో నాయకత్వం బలంగా లేకపోయినట్లయితే రైతుల నిరసనలతో దేశంలో బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు తలెత్తేవని ఇటీవల ఒక హిందీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ అన్నారు. ఈ వీడియోను 'ఎక్స్' ద్వారా పంచుకున్నారు. రైతు ఉద్యమ సమయంలో శవాలు వేలాడుతూ ఉండేవని, అత్యాచారాలు జరిగేవని ఆరోపించారు. ఈ రైతు ఉద్యమం వెనుక చైనా, అమెరికాల కుట్ర ఉందని పేర్కొన్నారు.
Kangana Ranaut: Bangladesh like anarchy could have happened in India also like in the name of Farmers protest. Outside forces are planning to destroy us with the help of insiders. If it wouldn't have been foresight of our leadership they would have succeded. pic.twitter.com/05vSeN8utW
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 25, 2024
'రైతులను అవమానించడమే బీజేపీ పని'
కంగనా రనౌత్ వ్యాఖ్యలు యావద్దేశ రైతులను అవమానించేలా ఉన్నాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. "రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. కానీ వాళ్లను అవమానించే పనిలో పార్టీ బిజీగా ఉంది. 378 రోజుల పాటు చేసిన ఉద్యమంలో అమరులైన 700 మంది రైతులను రేపిస్టులు అని పిలవడం చాలా బాధకరం. రైతులు నిరసనలు ముగించే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటకీ కోల్డ్ స్టోరేజీలోనే ఉంది. పంటలకు కనీస మద్దతు ధరను ఇంకా స్పష్టం చేయలేదు. అమరులైన రైతుల కుటుంబాలకు ఇంతవరకు ఎలాంటి సాయం కూడా అందించలేదు" అని రాహుల్ గాంధీ అన్నారు. రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన వారికి పార్లమెంట్లో కూర్చునే అర్హత లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ అన్నారు.
किसानों से किए वादों को पूरा करने में नाकाम मोदी सरकार का दुष्प्रचार तंत्र लगातार किसानों का अपमान करने में जुटा हुआ है।
— Rahul Gandhi (@RahulGandhi) August 26, 2024
378 दिन चले मैराथन संघर्ष के दौरान 700 साथियों का बलिदान देने वाले किसानों को भाजपा सांसद द्वारा बलात्कारी और विदेशी ताकतों का नुमाइंदा कहना भाजपा की किसान…
'మోదీ క్షమాపణలు చెప్పాలి'
కంగనా పోస్ట్‌పై అఖిల భారత కిసాన్‌సభ(ఏఐకేఎస్) తీవ్రంగా మండిపడింది. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ ధవలె డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని విచారణకు స్వీకరించాలని కోరారు. దేశ రాజధానిలో 13 నెలల పాటు జరిగిన ఉద్యమం శాంతికి చిహ్నమని కంగనా వ్యాఖ్యలపై రైతు సంఘం నేత రాకేశ్ టికౌత్ స్పందించారు. పుకార్లు సృష్టించడానికే కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం వైఖరిని బట్టే మేము అన్ని రోజులు నిరసనలు కొనసాగించాల్సిన అవసరం వచ్చింది' అని పేర్కొన్నారు. రైతుల పట్ల బీజేపీకి ఉన్న వైఖరిని కంగన వ్యాఖ్యలే చాటుతున్నాయని హరియాణా ఆప్ అధ్యక్షుడు సుశీల్ గుప్తా విమర్శించారు.
బీజేపీ సీరియస్
మరోవైపు విమర్శలు తీవ్రం కావడం వల్ల బీజేపీ బాహాటంగానే కంగనా వ్యాఖ్యలను తప్పుబట్టింది. ఇకపై ఇలాంటి ప్రకటనలు చేయద్దని ఆదేశించింది. ఆమె వ్యాఖ్యలకు పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేసింది.
The statement made by BJP MP Kangana Ranaut in the context of the farmers' movement is not the opinion of the party. BJP disagrees with the statement made by Kangana Ranaut. On behalf of the party, Kangana Ranaut is neither permitted nor authorised to make statements on party… pic.twitter.com/DXuzl3DqDq
— ANI (@ANI) August 26, 2024
కంగనా రనౌత్‌కు షాక్! ఎంపీ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు- హైకోర్టు నోటీసులు
కంగనను చెంపదెబ్బ కొట్టిన CISF కానిస్టేబుల్- జాబ్ నుంచి సస్పెండ్ - Kangana Ranaut Incident