ETV Bharat / bharat

మిగతా బోగీలతో గమ్యం చేరిన కాంచనజంగా- బంగాల్ రైలు ప్రమాదంపై విచారణకు ఆదేశం - Bengal Train Accident - BENGAL TRAIN ACCIDENT

Bengal Train Accident : బంగాల్ దార్జిలింగ్​లో రైలు ప్రమాద ఘటనాస్థలిలో ట్రాక్ పునురుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఓ ట్రాక్​పై నుంచి రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. మరోవైపు, కాంచన్​జంగా రైలు ప్రమాదంపై విచారణకు ఆదేశించింది రైల్వే శాఖ.

Bengal Train Accident
Bengal Train Accident (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 18, 2024, 12:36 PM IST

Updated : Jun 18, 2024, 1:06 PM IST

Bengal Train Accident : బంగాల్‌ దార్జిలింగ్‌లో సోమవారం ఓ గూడ్సు రైలు- కాంచన్​జంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన ఫన్సీదేవా ప్రాంతంలో పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే బోగీలను పట్టాలపై నుంచి తొలగించారు. ఓ ట్రాక్ నుంచి రైళ్ల రాకపోకలకు అనుమతిస్తున్నారు. మరోవైపు కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ మిగతా బోగీలతో గమ్యస్థానానికి చేరుకుంది. సోమవారం రాత్రి ఏడున్నర గంటలకు సియాదహ్‌కు చేరుకోవాల్సి ఉండగా, ప్రమాదం కారణంగా మంగళవారం వేకువజామున 3గంటలకు చేరుకుంది. 'గత 24 గంటలుగా రైల్వే అధికారులందరూ చాలా కష్టపడి పని చేస్తున్నారు. సోమవారం రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. అయినప్పటికీ వారు రైల్వే లైన్‌ను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నారు. దాదాపు 90 శాతం పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి.' ఈశాన్య సరిహద్దు రైల్వే డీఆర్ఎం సురేంద్ర కుమార్ తెలిపారు.

విచారణ ఆదేశించిన రైల్వేశాఖ
మరోవైపు, బంగాల్​లో జరిగిన కాంచన్​జంగా రైలు ప్రమాదంపై విచారణకు ఆదేశించింది రైల్వే శాఖ. జూన్ 19 ఉదయం 10 గంటల నుంచి ఈశాన్య సరిహద్దు రైల్వే భద్రత ప్రధాన కమిషనర్ జనక్ కుమార్ గార్గ్ నేతృత్వంలో ఈ విచారణ జరగనుంది. ఈ దుర్ఘటనపై ఏవైనా విషయాలు తెలిసినవారు రైల్వే భద్రతా ప్రధాన కమిషనర్​కు తెలపవచ్చని రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

పలు రైళ్లు రద్దు
కాంచన్​జంగా రైలు ప్రమాదం నేపథ్యంలో మంగళవారం కూడా పలు రైళ్లు రద్దవ్వగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. కతిహార్-సిలిగుడి ఇంటర్‌ సిటీ ఎక్స్​ప్రెస్, సిలిగుడి-కతిహార్ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్, న్యూజలపాయ్​గుడి-హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్, జలపాయ్ గుడి శతాబ్ది ఎక్స్‌ప్రెస్, సిలిగుడి-జోగ్బాని ఇంటర్‌ సిటీ ఎక్స్​ప్రెస్ మంగళవారం రద్దయ్యాయని ఈశాన్య రైల్వే పేర్కొంది.

ఇదీ ప్రమాదం
అసోంలోని సిల్చార్ నుంచి కోల్ కతాలోని సియాదహ్​కు వెళ్తున్న కాంచన్​జంగా ఎక్స్ ప్రెస్​ను ఓ గూడ్స్ రైలు దార్జిలింగ్ వద్ద ఢీకొట్టింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో 8మంది మరణించగా, మరో 25 మంది గాయపడ్డారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన రైల్వే శాఖ అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ- వయనాడ్‌లో గెలిస్తే ముగ్గురు గాంధీలు ఒకేసారి పార్లమెంట్​కు! - Lok Sabha Election Priyanka Gandhi

వయనాడ్​కు రాహుల్ 'బై'- రాయ్​బరేలీకి 'సై' వెనుక 10 పొలిటికల్ వ్యూహాలు- ఏంటంటే? - Rahul Gandhi Raebareli Seat

Last Updated : Jun 18, 2024, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.