ETV Bharat / bharat

ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌కు క్యాన్సర్‌ - 'సరిగ్గా ఆదిత్య ప్రయోగం రోజే తెలిసింది' - ఇస్రో ఛైర్మన్​ సోమ్​నాథ్​ క్యాన్సర్

ISRO Chief Somanath Cancer : ఇస్రో ఛైర్మన్ సోమనాథ్​కు క్యాన్సర్ సోకింది. సూర్యుడి పరిశోధనల కోసం ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని చేపట్టిన రోజే తనకు క్యాన్సర్ ఉన్నట్లు తెలిసిందని స్వయంగా అయనే​ వెల్లడించారు.

ISRO Chief Somnath Cancer
ISRO Chief Somnath Cancer
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 7:06 PM IST

ISRO Chief Somanath Cancer : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో) చీఫ్‌ సోమనాథ్‌ క్యాన్సర్‌ బారినపడ్డినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రూపొందించిన 'ఆదిత్య - ఎల్‌1' ప్రయోగం చేపట్టిన రోజే ఈ వ్యాధి నిర్ధరణ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు ఇటీవలే ఓ మలయాళం వెబ్​ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

షాక్​లో కుటుంబ సభ్యులు
చంద్రయాన్ -3 ప్రయోగం సమయంలోనే ఆరోగ్య సమస్యలు వచ్చినట్లు సోమనాథ్ చెప్పారు. ' ఆ సమయంలోనే దాని గురించి నాకు స్పష్టమైన అవగాహన లేదు. కానీ, ఆదిత్య ఎల్​1 మిషన్ ప్రయోగించిన ఉదయమే వైద్య పరీక్షలు చేయించుకున్నా. కడుపులో ఏదో సమస్య ఉన్నట్లు తెలిసింది. ప్రయోగం పూర్తి కాగానే చెన్నై వెళ్లి మరిన్ని స్కాన్​లు చేయించా. నా కడుపులో కణితి పెరిగిందని అప్పుడే నాకు తెలిసింది. ఆ తర్వాత 2,3 రోజులకు అది క్యాన్సర్ అని నిర్ధరణ అయింది. అది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులతో పాటు సహోద్యోగులు షాక్​కు గురయ్యారు' అని ఇస్రో ఛైర్మన్ తెలిపారు.

నాలుగు రోజులు ఆస్పత్రిలోనే
అయితే తనను ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారని సోమ్​నాథ్ తెలిపారు. '2023 సెప్టెంబర్‌ 2న ఆదిత్య ఎల్‌1 ప్రయోగం చేపట్టిన తర్వాత శస్త్రచికిత్సతోపాటు కీమోథెరపీ కూడా చేయించుకున్నా. అలా మొత్తంగా నాలుగు రోజులే ఆసుప్రతిలో ఉండి క్యాన్సర్​కు చికిత్స తీసుకున్నా. ఐదో రోజు నుంచి ఇస్రోలో రోజువారీ పనులకు వెళ్లాను. మొదట్లో కాస్త కంగారు పడినప్పటికీ క్యాన్సర్​కు పూర్తి పరిష్కారంగా చిక్సిత ఉందన్న విషయంపై ఇప్పుడు అవగాహన వచ్చింది' అని ఇస్రో ఛైర్మన్ పేర్కొన్నారు.

Aditya L1 Mission Full Details : సూర్యుడిని పరిశోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన తొలి ప్రయోగమే ఆదిత్య- ఎల్1. ఈ ప్రయోగాన్ని 2023 సెప్టెంబర్ 2న ఆదిత్య-ఎల్​1 కక్ష్యలోకి పంపించింది. 127 రోజుల తర్వాత ఆదిత్య-ఎల్​1 తన గమ్యస్థానాన్ని విజయవంతగా చేరుకుంది. రాకెట్‌ ప్రయోగం నుంచి 'ఎల్‌1' కక్ష్యలో చేరేవరకూ 127 రోజులపాటు సాగిన 'ఆదిత్య ఎల్‌1' ప్రయాణాన్ని తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

BSFలో తొలి మహిళా స్నైపర్‌- చరిత్ర సృష్టించిన సుమన్ కుమారి

'రాజీనామా చేస్తున్నా- ఆ విషయంపై అప్పుడే మాట్లాడతా'- కలకత్తా హైకోర్టు జడ్జి సంచలన నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.