ETV Bharat / bharat

హైదరాబాద్​ To షిరిడీ- IRCTC స్పెషల్ టూర్‌​ ప్యాకేజీ- అతి తక్కువ ధరలో సాయి దర్శనం! - irctc shirdi tour package - IRCTC SHIRDI TOUR PACKAGE

IRCTC Shirdi With Jyotirlinga Package : ఈ వేసవి సెలవుల్లో షిరిడీ సాయినాథుడిని దర్శించుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్. తక్కువ ధరలో ఐఆర్‌సీటీసీ 'షిరిడీ విత్‌ జ్యోతిర్లింగం' పేరుతో ఒక స్పెషల్‌ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. మరి ఈ పర్యటన ఎన్ని రోజులు సాగుతుంది ? టికెట్ల ధర ఎంత ? వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

IRCTC Shirdi With Jyotirlinga Package
IRCTC Shirdi With Jyotirlinga Package
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 3:00 PM IST

IRCTC Shirdi With Jyotirlinga Package : సమ్మర్‌లో ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకోవాలి అనుకునేవారికి ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) శుభవార్త చెప్పింది. షిరిడీతో పాటు త్రయంబకేశ్వర ఆలయాన్ని సందర్శించేందుకు వీలుగా ఒక ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది. 'షిరిడీ విత్‌ జ్యోతిర్లింగం' (SHIRDI WITH JYOTIRLINGA) పేరుతో టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి ఈ యాత్ర ప్రారంభమై త్రయంబకేశ్వరం, పంచవటి, షిరిడీ సందర్శన తర్వాత తిరిగి సికింద్రాబాద్‌ చేరుకోవడంతో పూర్తవుతుంది. ఈ ఆధ్యాత్మిక యాత్ర మొత్తం మూడు రాత్రులు, నాలుగు పగళ్లు కొనసాగుతుంది. షిరిడీ విత్‌ జ్యోతిర్లింగం ట్రిప్‌ ప్రయాణానికి మే 7, 14, 21, 28 తేదీలలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

ఐఆర్‌సీటీసీ షిరిడీ విత్‌ జ్యోతిర్లింగం టూర్‌ ప్రయాణం ఇలా :

  • మొదటి రోజు హైదరాబాద్‌లో పర్యాటన ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 4:10 గంటలకు రైలు (నం.17208) బయల్దేరుతుంది. రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
  • తర్వాతి రోజు ఉదయం 6:15కు నాగర్‌సోల్‌ చేరుకుంటారు. అక్కడ ఐఆర్‌సీటీసీ పికప్‌ చేసుకుని ముందుగా బుక్‌ చేసిన హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్‌లో ఫ్రెషప్‌ అయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌ చేసి నాసిక్‌ (త్రయంబకేశ్వరం, పంచవటి) తీసుకెళ్తారు.
  • అక్కడి నుంచి సాయంత్రం షిరిడీకి చేరుకుంటారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేయాలి.
  • మూడవ రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన తర్వాత షిరిడీ ఆలయ దర్శనానికి ఏర్పాట్లు చేస్తారు. తర్వాత కొన్ని గంటలు అక్కడే ఉండి స్థానికంగా ఉండే వివిధ ఆలయాలను సందర్శించవచ్చు.
  • తర్వాత సాయంత్రం 6:30 గంటలకు నాగర్‌సోల్‌ స్టేషన్‌కు చేరుకుంటారు. రాత్రి 7:30 గంటలకు తిరుగు ప్రయాణం చేయడానికి రైలు (ట్రైన్‌ నం. 17205) ఎక్కాలి.
  • నాలుగోరోజున ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధర :

  • కంఫర్ట్‌: ఒక్కో ప్రయాణికుడికి సింగిల్ షేరింగ్‌లో అయితే రూ.12వేల 840, ట్విన్, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.10వేల 250 చెల్లించాలి.
  • స్టాండర్డ్‌: సింగిల్ షేరింగ్ అయితే రూ.11వేల 080, ట్విన్, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.8వేల 500 చెల్లించాలి.
  • అలాగే 5-11 సంవత్సరాల మధ్య చిన్నారులకు ఛార్జీలు ఉన్నాయి.

IRCTC తిరుమల స్పెషల్ టూర్ ప్యాకేజీ - తక్కువ ధరలోనే 3 రోజుల ట్రిప్ - స్పెషల్ దర్శనం కూడా! - IRCTC Tirumala Tour Package

ప్యాకేజీలో ఇవి ఉంటాయి :

  • సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజీని బట్టి రైల్లో 3 ఏసీ, స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణం ఉంటుంది.
  • అలాగే ప్యాకేజీని బట్టి లోకల్‌ ప్రయాణానికి ఏసీ వెహికిల్‌ను సమకూరుస్తారు.
  • రెండు రోజులు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అందిస్తారు.
  • ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.

వీటి బాధ్యత ప్రయాణికులదే :

  • ఐఆర్‌సీటీసీ షిరిడీ విత్‌ జ్యోతిర్లింగం టూర్‌ ప్యాకేజీని బుకింగ్‌ చేసుకున్న వారు మధ్యాహ్నాం, రాత్రి భోజనాలను వారే చూసుకోవాలి.
  • అలాగే రైలులో ప్రయాణించేటప్పుడు కూడా ఎటువంటి భోజనం ఏర్పాట్లు ఉండవు.
  • పర్యాటక ప్రదేశాలలో ఎక్కడైనా ఎంట్రీ టెకెట్‌లు ఉంటే వాటి ఖర్చును కూడా సందర్శకులే చెల్లించాలి.
  • అలాగే గైడ్‌ను కూడా యాత్రికులే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఎక్కడైనా ఆలయాల దర్శన టికెట్ల రుసుమును కూడా సందర్శకులే చెల్లించాలి.

ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించి మే నెల 7, 14, 21, 28 తేదీల్లో ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, మీ వీలును బట్టి టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. అలాగే ఐఆర్‌సీటీసీ క్యాన్సిలేషన్‌ పాలసీ రూల్స్‌ ప్రకారం, టూర్‌కు 15 రోజుల ముందు టికెట్‌ను క్యాన్సిల్‌ చేసుకుంటే ఒక్కో దానిపై రూ.250 క్యాన్సిలేషన్‌ ఛార్జీగా నిర్ణయించారు. ఒకవేళ మీరు ట్రిప్‌కు నాలుగు రోజుల ముందు క్యాన్సిల్‌ చేసుకుంటే తిరిగి డబ్బులను చెల్లించేది ఏమీ ఉండదు.

  • షిరిడీ విత్‌ జ్యోతిర్లింగం టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్‌ కోసం ఈ https://www.irctctourism.com ఈ లింక్‌ క్లిక్‌ చేయండి

హైదరాబాద్​ To తిరుపతి - IRCTC స్పెషల్​ ప్యాకేజీ- శ్రీవారి స్పెషల్​ దర్శనంతో పాటు మరెన్నో! - IRCTC Poorva Sandhya Tour Packages

అయోధ్యలో IRCTC కొత్త ప్రాజెక్ట్- అన్ని రాష్ట్రాల ఫుడ్ ఐటమ్స్​తోపాటు డార్మిటరీ రెడీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.