ETV Bharat / bharat

షిరిడీ సాయి నాథుని దర్శనంతో పాటు మినీ తాజ్​మహల్​ చూడొచ్చు - IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ! - IRCTC Shirdi With Aurangabad Tour - IRCTC SHIRDI WITH AURANGABAD TOUR

IRCTC Shirdi Package: షిరిడీ వెళ్లాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. షిరిడీతో పాటు మినీ తాజ్​మహల్​ చూసేందుకు ఐఆర్​సీటీసీ అద్దిరిపోయే ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

IRCTC Shirdi Package
IRCTC Shirdi With Aurangabad Package (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 21, 2024, 9:02 AM IST

IRCTC Shirdi With Aurangabad Package: దేశంలోని పలు ఆధ్యాత్మిక ప్రదేశాలను చూడాలనుకునే వారి కోసం.. ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తోంది. టూరిస్టులకు ఈ ప్యాకేజీలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే బడ్జెట్​లో ఈ స్పెషల్ టూర్​లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే.. తాజాగా హైదరాబాద్ నుంచి షిరిడీకి వెళ్లేందుకు ప్యాకేజీని ప్రకటించింది. మరి ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

ఐఆర్​సీటీసీ షిరిడీ విత్​ ఔరంగాబాద్​(Shirdi With Aurangabad) పేరుతో ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్​ 3రాత్రులు, 4 పగళ్లు కొనసాగుతుంది. హైదరాబాద్​ నుంచి ట్రైన్​ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్​ చేస్తున్నారు. ఈ టూర్​లో సాయి నాథుని దర్శనంతో పాటు ఔరంగాబాద్​, ఎల్లోరా గుహలు, శని శిగ్నాపూర్ చూడొచ్చు. ప్రతీ శుక్రవారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

ప్రయాణ వివరాలు ఇవే:

  • మొదటి రోజు సాయంత్రం 6:40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్​ నుంచి ట్రైన్​(అజంతా ఎక్సెప్రెస్​ - 17064) స్టార్​ అవుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 7 గంటలకు నాగర్​సోల్​ రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి షిరిడీ తీసుకెళ్తారు. షిరిడీ హోటల్లో చెకిన్​ అవ్వాలి. బ్రేక్​ఫాస్ట్​ అనంతరం సాయి నాథుని దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం శని శిగ్నాపూర్​ స్టార్ట్​ అవుతారు. అక్కడి శని దేవాలయం దర్శించుకుని ఔరంగాబాద్​ బయలుదేరుతారు. అక్కడ హోట్​లో చెకిన్​ అయ్యి ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.

ఖజురహో అందాలు చూస్తారా? - హైదరాబాద్​ నుంచి IRCTC సూపర్​ ప్యాకేజీ! ధర కూడా తక్కువే!

  • మూడో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి మినీ తాజ్​ మహల్​ సందర్శిస్తారు. అక్కడి నుంచి ఎల్లోరా బయలుదేరుతారు. అక్కడ ఎల్లోరా గుహలు, చుట్టుపక్కల దేవాలయాలు దర్శించుకుంటారు. సాయంత్రం తిరిగి ఔరంగాబాద్​ రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు ట్రైన్​(17063) హైదరాబాద్​కు బయలుదేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
  • నాలుగో రోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్​ చేరుకోవడంతో టూర్​ ముగుస్తుంది.

ధరలు ఇవే:

  • కంఫర్ట్​: సింగిల్​ షేరింగ్​గా రూ.22,780, ట్విన్​ షేరింగ్​ రూ.12,650, ట్రిపుల్​ షేరింగ్​ రూ.10,070గా నిర్ణయించారు. ఇక 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.7,830, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.6,960గా నిర్ణయించారు.
  • స్టాండర్డ్​: సింగిల్​ షేరింగ్​ రూ.21,200, డబుల్​ షేరింగ్​కు రూ.11,070, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.8,490గా నిర్ణయించారు. ఇక 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.6,250, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.,5,390గా చెల్లించాలి.
  • ప్రస్తుతం ఈ టూర్​ ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబర్​ 27వరకు అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేసి తెలుసుకోండి.

రాజస్థాన్​ కోటల రాజసం చూసి తీరాల్సిందే - తక్కువ ధరకే IRCTC సూపర్​ ప్యాకేజీ!

ఊటీ అందాల్లో విహరించండి - తక్కువ ధరకే IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.