ETV Bharat / bharat

IRCTC సూపర్​ ప్యాకేజీ - ఆరు వేల లోపే శ్రీవారి దర్శనం - మరెన్నో ప్రదేశాలు కూడా చూడొచ్చు! - IRCTC Sapthagiri Tour Package

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 22, 2024, 11:51 AM IST

IRCTC: తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా? అది కూడా ట్రైన్​ జర్నీ ద్వారా వెళ్లాలనుకుంటున్నారా? అయితే.. మీ కోసం గుడ్​న్యూస్​. తక్కువ ధరే IRCTC సూపర్​ ప్యాకేజీ తీసుకొచ్చింది. తిరుమలతో పాటు మరిన్ని ప్రదేశాలు కూడా చూడొచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

IRCTC Tirumala Tour Package
IRCTC Tirumala Tour Package (ETV Bharat)

IRCTC Sapthagiri Tour Package: తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి వెళ్లాలనుకుంటున్న వారి కోసం IRCTC "సప్తగిరి" పేరుతో టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్​ 3 రాత్రులు, 4 పగళ్లు కొనసాగనుంది. ఇందులో తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు. ఈ జర్నీ కరీంనగర్​లో ప్రారంభమై.. పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం మీదుగా తిరుపతి వెళ్తుంది. ప్రయాణికులు ఈ ప్రదేశాల్లో ట్రైన్​ ఎక్కొచ్చు. తిరుగు ప్రయాణంలో ఆ ప్రదేశాల్లోనే ట్రైన్​ దిగొచ్చు.

ప్రయాణం ఇలా :

  • మొదటి రోజు కరీంనగర్‌ నుంచి సాయంత్రం 7.15 గంటలకు(ట్రైన్​ నెం 12762) బయలుదేరుతుంది. తర్వాత పెద్దపల్లి చేరుకుని అక్కడి నుంచి 8 గంటల 5 నిమిషాలకు బయలుదేరుతుంది. ఆ తర్వాత వరంగల్, ఖమ్మం చేరుకుని అక్కడి నుంచి తిరుపతికి జర్నీ స్టార్ట్​ అవుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 7:50 గంటలకు తిరుపతి చేరుకుంటారు. రైల్వే స్టేషన్​ నుంచి ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు. ఫ్రెషప్​ అండ్​ బ్రేక్​ఫాస్ట్​ తర్వాత స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవచ్చు. మధ్యాహ్నం భోజనం తర్వాత శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాల దర్శనం ఉంటుంది. రాత్రికి మళ్లీ తిరుపతి చేరుకుంటారు. నైట్​ అక్కడే స్టే చేయాలి.

కృష్ణుడు ఏలిన ద్వారక చూసొస్తారా? తక్కువ ధరకే IRCTC ప్రత్యేక ప్యాకేజీ! మరెన్నో ప్రదేశాలు కూడా! - IRCTC Sundar Saurashtra Package

  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి.. కాణిపాకం, శ్రీనివాస మంగాపుర్ ఆలయాలను దర్శించుకోవాలి. సాయంత్రం గోవిందరాజ స్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అక్కడి నుంచి తిరుపతి రైల్వే స్టేషన్​కు చేరుకుంటే రాత్రి 8.15 గంటలకు (ట్రైన్​ నెం 12761) కరీంనగర్​కు జర్నీ స్టార్ట్​ అవుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • నాలుగో రోజు తెల్లవారుజామున మూడున్నరకు ఖమ్మం, 4:41గంటలకు వరంగల్​, ఉదయం 5:55 గంటలకు పెద్దపల్లి, 8:40 గంటలకు కరీంనగర్ చేరుకోవడంతో టూర్​ ముగుస్తుంది.

ఛార్జీలు ఇలా..

  • కంఫర్ట్​లో సింగిల్​ షేరింగ్​కు రూ.9,010, డబుల్​ షేరింగ్​కు రూ.7,640, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.7,560 చెల్లించాలి. ఇక 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.7,140, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.6,710 చెల్లించాలి.
  • స్టాండర్డ్​లో సింగిల్​ షేరింగ్​కు రూ.7,120, డబుల్​ షేరింగ్​కు రూ.5,740, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.5,660 చెల్లించాలి. ఇక 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.5,250, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.4,810 చెల్లించాలి.
  • ట్రావెల్ ఇన్సూరెన్స్​తో పాటు హోటల్​లో వసతి, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం వంటివి ఈ ప్యాకేజీలో ఉంటాయి.
  • ప్రతీ గురువారం ఈ టూర్​ అందుబాటులో ఉంటుంది.
  • ఈ టూర్​ జులై 4 మొదలుకానుంది.
  • ఈ టూర్​కు సంబంధించిన వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

అటు భగవత్​ దర్శనాలు - ఇటు బీచ్​లో సరదాలు - సముద్ర తీరానికి IRCTC అద్దిరిపోయే టూర్ ప్యాకేజీ! - IRCTC Hyderabad Karnataka Tour

విశాఖపట్నం To తిరుపతి - IRCTC స్పెషల్​ ప్యాకేజీ - శ్రీవారి స్పెషల్​ దర్శనంతో పాటు మరెన్నో! - IRCTC Balaji Darshanam

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.