ETV Bharat / bharat

IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ - తక్కువ ధరకే రెండు జ్యోతిర్లింగాలు, ప్రముఖ ఆలయాల దర్శనం! - Madhya Pradesh Jyotirlinga Darshan

IRCTC Tour Package: ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనుకుంటున్నారా? అందులోనూ రెండింటిని ఒకే ట్రిప్‌లో సందర్శించాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. మధ్యప్రదేశ్‌లో ఉన్న రెండు ఆలయాలను దర్శించుకునేందుకు ఐఆర్‌సీటీసీ స్పెషల్​ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఆ వివరాలు ఇవే..

IRCTC Tour Package
IRCTC Madhya Pradesh Jyotirlinga Darshan Package (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 5:18 PM IST

IRCTC Madhya Pradesh Jyotirlinga Darshan Package: ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ అక్కడికి వెళ్లడం, టికెట్ల బుకింగ్​ వంటి పలు వివరాలు తెలియక ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. అయితే అలాంటివారు ఇకపై ఎటువంటి టెన్షన్ లేకుండా ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ తీసుకొచ్చిన ప్యాకేజీ ద్వారా మధ్యప్రదేశ్​లో ఉన్న రెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. మరి ఆ ప్యాకేజీ ఏంటి? ధర ఎంత? ఏఏ ప్రదేశాలు కవర్​ అవుతాయి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

మధ్యప్రదేశ్‌లో రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఒకటి ఉజ్జయిని మహా కాళేశ్వరుని ఆలయం, రెండోది ఓంకారేశ్వర ఆలయం. ఈ రెండింటితో పాటు మరికొన్ని ఆలయాలను సందర్శించుకునేందుకు వీలుగా.. IRCTC మధ్యప్రదేశ్‌ జ్యోతిర్లింగ దర్శన్‌ (MADHYA PRADESH JYOTIRLINGA DARSHAN) పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. కాచిగూడ నుంచి ఈ రైలు మొదలవుతుంది. ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఈ టూర్‌ కొనసాగుతుంది. ప్రతి బుధవారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది.

ప్రయాణం వివరాలు ఇలా..

  • మొదటి రోజు కాచిగూడలో సాయంత్రం 4:40 గంటలకు సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు (ట్రైన్‌ నెం.12707) బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 8:15 గంటలకు భోపాల్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ ముందుగానే బుక్‌ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాంచి స్థూపం చూడటానికి వెళ్తారు. ఆ తర్వాత భోజేశ్వర్​ మహాదేవ్​ టెంపుల్​ను దర్శించుకోవాలి. తిరిగి భోపాల్‌ చేరుకొని ట్రైబల్‌ మ్యూజియం వీక్షిస్తారు. రాత్రి భోపాల్‌లోనే స్టే ఉంటుంది.
  • మూడో రోజు టిఫెన్‌ చేశాక ఉజ్జయినికి బయల్దేరుతారు. హోటల్​లో చెకిన్​ అయిన తర్వాత ఉజ్జయిని లోని ఆలయాలైన శ్రీ మహాకాళేశ్వర ఆలయం, హరసిద్ధి ఆలయం, మంగళనాథ్ ఆలయం, నవగ్రహ శని మందిరం, శ్రీ చింతామన్ గణేష్ ఆలయం, రామ్ ఘాట్, శ్రీ గఢ్కాళికా ఆలయాల్ని దర్శించుకుంటారు. ఆ రాత్రి ఉజ్జయినిలోనే బస ఉంటుంది.

"గాడ్స్ ఓన్ కంట్రీ"కి IRCTC సూపర్ ట్రిప్ - ప్రకృతి సోయగాల్లో తడిసి ముద్దైపోవచ్చు! - IRCTC Cultural Kerala Monsoon Magic

  • నాలుగో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత మహేశ్వర్​కు స్టార్ట్​ అవుతారు. అక్కడ అహిల్యాదేవి కోట, నర్మదా ఘాట్‌ను సందర్శిస్తారు. అక్కడి నుంచి ఓంకారేశ్వర్​కు బయలుదేరుతారు. అక్కడ ఓంకారేశ్వర దేవాలయాన్ని దర్శించుకోవాలి. రాత్రికి ఓంకారేశ్వర్​లో బస ఉంటుంది.
  • ఐదో రోజు ఉదయం టిఫిన్‌ చేశాక ఇందౌర్​కు బయల్దేరుతారు. అక్కడ లాల్​బాగ్​ ప్యాలెస్​, గణేష్​ మందిరాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఇందౌర్​ రైల్వే స్టేషన్​కు వెళ్తారు. రాత్రి 8 గంటలకు యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (ట్రైన్‌ నెం: 19301)లో కాచిగూడకు బయల్దేరుతారు. ఆ రోజు రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • ఆరో రోజు రాత్రి 10 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌ చేరుకోవటంతో యాత్ర పూర్తవుతుంది.

ప్యాకేజీ ధరలు చూస్తే:

1 - 3 ముగ్గురు వ్యక్తులు బుక్‌ చేసుకుంటే..

  • కంఫర్ట్‌లో ఒక్కో ప్రయాణికుడికి సింగిల్ షేరింగ్​కి రూ.35,880, ట్విన్ షేరింగ్‌కు రూ.20,180, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.15,750 చెల్లించాలి. 5 - 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌కు రూ.11,910, విత్ అవుట్ బెడ్ అయితే రూ.10,020 చెల్లించాలి.
  • స్టాండర్ట్‌లో సింగిల్ షేరింగ్​కి రూ.33,390, ట్విన్ షేరింగ్‌కు రూ.17,700, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13,260. ఇక 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.9,420, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ. 7,530 చెల్లించాలి.

నలుగురు నుంచి ఆరుగురు కలిసి బుక్‌ చేసుకుంటే..

  • కంఫర్ట్‌లో డబుల్‌ షేరింగ్‌కు రూ.16,580, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.14,210 చెల్లించాలి. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌ అయితే రూ. 11,910, విత్ అవుట్ బెడ్ అయితే రూ.10,020 చెల్లించాలి.
  • స్టాండర్డ్‌లో డబుల్‌ షేరింగ్‌కు రూ. 14,100, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.11,720 చెల్లించాలి. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.9,420, విత్ అవుట్ బెడ్ అయితే రూ. 7,530 చెల్లించాలి.
  • ప్రస్తుతం ఈ టూర్​ జులై 3వ తేదీన స్టార్ట్​ అవుతుంది. ఈ టూర్‌కు సంబంధించిన ఇతర వివరాలు, టికెట్ల బుకింగ్‌ కోసం ఈ లింక్​పై క్లిక్‌ చేయండి.

అటు భగవత్​ దర్శనాలు - ఇటు బీచ్​లో సరదాలు - సముద్ర తీరానికి IRCTC అద్దిరిపోయే టూర్ ప్యాకేజీ! - IRCTC Hyderabad Karnataka Tour

కృష్ణుడు ఏలిన ద్వారక చూసొస్తారా? తక్కువ ధరకే IRCTC ప్రత్యేక ప్యాకేజీ! మరెన్నో ప్రదేశాలు కూడా! - IRCTC Sundar Saurashtra Package

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.