ETV Bharat / bharat

IRCTC అద్భుతమైన ఆధ్యాత్మిక టూర్ - తక్కువ ధరకే ఏడు జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం! - SAPTA JYOTIRLINGA DARSHAN YATRA

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 25, 2024, 4:50 PM IST

IRCTC SAPTA JYOTIRLINGA Tour : ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. మీలాంటి వారికోసమే.. ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకునేలా ఐఆర్​సీటీసీ అద్దిరిపోయే ప్యాకేజీ ప్రకటించింది. మరి, ఆ ప్యాకేజీ ఏంటి? ఎన్ని రోజులు సాగుతుంది? ధర ఎంత? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

SAPTA JYOTIRLINGA DARSHAN YATRA
IRCTC SAPTA JYOTIRLINGA Tour (ETV Bharat)

IRCTC SAPTA JYOTIRLINGA DARSHAN YATRA : మరికొద్ది రోజుల్లో హిందువులు అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసం స్టార్ట్ కానుంది. ఈ క్రమంలో చాలా మంది దేశంలోని ప్రముఖ దేవాలయాలు దర్శించుకోవాలని ప్లాన్​ చేసుకుంటుంటారు. అలాంటి వారికోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(IRCTC) సూపర్ టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. అతి తక్కువ ధరకే ఏడు జ్యోతిర్లింగాలతో పాటు ప్రముఖ దేవాలయాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది. మరి, ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ ద్వారా ఐఆర్​సీటీసీ "Sapta(07) Jyotirlinga Darshan Yatra" పేరుతో ఈ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూర్​లో భాగంగా.. మధ్యప్రదేశ్​లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, గుజరాత్​లోని నాగేశ్వర్, సోమ్​నాథ్​, మహరాష్ట్రలోని భీమాశంకర్, త్రయంబకేశ్వర్, ఘృష్ణేశ్వర్.. ఇలా మొత్తం ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ టూర్​ అందుబాటులో ఉంది. విజయవాడ మొదలు వరుసగా మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్, జనగామ, భువనగిరి, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా జర్నీ ఉంటుంది. అంటే.. ఈ స్టేషన్లలో ట్రైన్ ఎక్కొచ్చు. అలాగే ప్రయాణం అయిపోయాక పైన తెలిపిన స్టేషన్లలో దిగొచ్చు. ఇక ఈ టూర్ మొత్తం 11 రాత్రులు, 12 పగళ్లు కొనసాగుతుంది.

ప్రయాణం కొనసాగనుందిలా..

  • మొదటి రోజు విజయవాడ ​నుంచి రాత్రి12 గంటలకు భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ స్టార్ట్​ అవుతుంది. మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్, జనగామ, భువనగిరి, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, మహారాష్ట్రలోని ధర్మబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ మీదుగా ప్రయాణించి మూడో రోజు ఉదయం 8 గంటలకు ఉజ్జయిని రైల్వేస్టేషన్​కు చేరుకుంటారు. అంటే.. రెండో రోజు మొత్తం జర్నీ కొనసాగుతుంది.
  • మూడో రోజు ఉజ్జయినిలో దిగాక అక్కడ ముందుగానే బుక్ చేసిన హోటల్​లో చెక్ ఇన్ అవుతారు. అక్కడ ప్రెషప్ అయ్యి.. ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరిగి హోటల్​కి చేరుకుని ఆ రాత్రి అక్కడే డిన్నర్ చేసి స్టే చేస్తారు.
  • నాలుగో రోజు మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​ చేసి అక్కడి నుంచి చెక్ అవుట్ అయ్యి రోడ్డు మార్గం ద్వారా వెళ్లి ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. అనంతరం ఉజ్జయిని రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి ద్వారకాకు ట్రైన్ జర్నీ స్టార్ట్ అవుతుంది.
  • ఐదో రోజు సాయంత్రం 5 గంటలకు ద్వారకాకు చేరుకుని అక్కడ హోటల్​లో చెక్ ఇన్ అవుతారు. ఆ రోజు నైట్​ అక్కడే డిన్నర్, స్టే ఉంటుంది.
  • ఆరో రోజు మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్ తర్వాత Dwarkadhish టెంపుల్​ను సందర్శిస్తారు. తర్వాత తిరిగి హోటల్​కు చేరుకుని మధ్యాహ్నం భోజనం అనంతరం చెక్ అవుట్ అయి ద్వారకా నాగేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. అనంతరం ఓఖా రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడి నుంచి సోమనాథ్​కి ట్రైన్​లో బయల్దేరుతారు.
  • ఏడో రోజు మార్నింగ్ 6 గంటలకు సోమనాథ్​కి చేరుకుని హోటల్​లో​ చెక్ ఇన్ అవుతారు. తర్వాత ఫ్రెషప్ అయ్యి సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సోమనాథ్ రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడి నుంచి ట్రైన్​లో నాసిక్​ బయల్దేరుతారు.
  • ఎనిమిదో రోజు 3 గంటలకు నాసిక్ చేరుకొని హోటల్ చెకిన్ అవుతారు. ఆ రోజు అక్కడే డిన్నర్, స్టే ఉంటుంది.
  • తొమ్మిదో రోజు మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ అయి నాసిక్ త్రయంకేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకంటారు. అనంతరం రాత్రి 9 గంటలకు నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ చేరుకుని ట్రైన్​లో పుణెకి పయనమవుతారు.
  • పదో రోజు మార్నింగ్ 5:30 గంటలకు ఖరకి రైల్వే స్టేషన్ చేరుకుని ఆ తర్వాత అక్కడి హోటల్​లో చెకిన్ అవుతారు. అనంతరం ఫ్రెషప్ అయ్యి భీమాశంకర్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుంటారు. తర్వాత తిరిగి రాత్రి 11 గంటలకు పుణె రైల్వే స్టేషన్ చేరుకుని ట్రైన్​లో ఔరంగాబాద్ బయల్దేరుతారు.
  • పదకొండో రోజు ఉదయం 7 గంటలకు అక్కడకు చేరుకుంటారు. ఆపై ఫ్రెషప్ అయి ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొంటారు. తర్వాత రాత్రి 7 గంటలకు ఔరంగాబాద్ రైల్వేస్టేషన్​కు చేరుకుని విజయవాడకు రిటర్న్ అవుతారు.
  • 12వ రోజు పైన పేర్కొన్న స్టేషన్లలో ఆపుతూ చివరకు సాయంత్రం 5 గంటలకు విజయవాడ చేరుకోవడంతో యాత్ర కంప్లీట్ అవుతుంది.

ప్యాకేజీ ధరలు చూస్తే..

ఎకానమీ : స్లీపర్‌ క్లాస్‌లో ప్రయాణానికి ఒక్కో టికెట్‌ ధర (ట్విన్‌, ట్రిపుల్‌ షేరింగ్‌) రూ.20,950, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.19,255గా నిర్ణయించారు.

స్టాండర్డ్ ​: థర్డ్‌ ఏసీ ప్రయాణానికి (ట్విన్‌, ట్రిపుల్‌ షేరింగ్‌) రూ.33,015, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలు రూ.31,440 చెల్లించాలి.

కంఫర్ట్​ : 2ఏసీ ప్రయాణానికి (ట్విన్‌, ట్రిపుల్‌ షేరింగ్‌) రూ.43,355, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలు రూ.41,465 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ టూర్​ ఆగష్టు 17వ తేదీన అందుబాటులో ఉంది. అలాగే ఈ ప్యాకేజీలో టూరిస్టులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.

ఈ ప్యాకేజీకి సంబంధించిన అదనపు వివరాలు, టూర్​ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

షిరిడీ సాయి నాథుని దర్శనంతో పాటు మినీ తాజ్​మహల్​ చూడొచ్చు - IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ!

సౌత్​ ఇండియాలోని ఈ ఆలయాలు చూసొస్తారా? - వైజాగ్​ నుంచి IRCTC సూపర్​ ప్యాకేజీ! ధర కూడా అందుబాటులోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.