Indian Navy Rescues Iranian Vessel : భారత నౌకాదళం సోమాలియా తీరానికి సమీపంలో సముద్రపు దొంగల ఆటకట్టించింది. వారి చెర నుంచి మొత్తం 19 మందిని కాపాడింది. 11 మంది ఇరాన్ నావికులతో పాటు పాకిస్థాన్‌కు చెందిన 8 మందిని రక్షించినట్లు భారత నౌకాదళ అధికార ప్రతినిధి వివేక్ మధ్వాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఇరాన్ జెండాతో వెళుతున్న FV ఒమరిల్ చేపల పడవను ఏడుగురు సోమాలియా సముద్రపు దొంగలు చుట్టుముట్టినట్లు భారత నౌకాదళానికి సమాచారం అందింది. వెంటనే అధికారులు INS శారదను రంగంలోకి దింపి అక్కడకు చేరుకున్న యుద్ధ నౌక బందీలను రక్షించింది. FV ఒమారి ఓడవద్దకు చేరుకున్న INS శారద సముద్రపు దొంగల ఆటకట్టించింది. సోమాలీ పైరేట్ల బారి నుంచి FV ఒమారి నౌకా సిబ్బందిని భారత నేవీ కమాండోలు కాపాడారు. ఈ సందర్భంగా సముద్రంలో అన్ని నౌకల భద్రతకు కట్టుబడి ఆపరేషన్ నిర్వహించినట్టు భారత నౌకాదళం ఓ ప్రకటనలో తెలిపింది.
సోమాలియా దొంగల నుంచి 17 మంది సేఫ్ చేసిన నేవీ
ఇటీవల సోమాలియా సముద్రపు దొంగల బారిన పడిన పలు నౌకలను భారత నౌకాదళం రక్షించింది. కొచ్చి నుంచి దాదాపు 700 నాటికల్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ఓ ఇరాన్ చేపల బోటు ఇమాన్‌ను కాపాడింది. బందీలుగా చిక్కుకున్న మొత్తం 17 మంది సిబ్బందిని సురక్షితంగా విడిపించింది. హైజాక్ సమాచారం అందుకున్న వెంటనే ఏడెన్ జలసంధి, సోమాలియా తూర్పు తీరం వెంబడి విధుల్లో ఉన్న 'ఐఎన్‌ఎస్ సుమిత్రా' రంగంలోకి దిగింది. బోటును అడ్డుకుని, హెలికాప్టర్ల ద్వారా చుట్టుముట్టి సముద్రపు దొంగలకు హెచ్చరికలు జారీ చేసింది. పడవతో పాటు 17 మంది సిబ్బందిని రక్షించిందని భారత రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల కాలంలో అరేబియా, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుస దాడుల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. తన సముద్ర గస్తీని భారీ స్థాయిలో పెంచింది. దాడులకు గురవుతున్న విదేశీ నౌకలకు అండగా నిలుస్తోంది.
ఆపరేషన్ సక్సెస్- హైజాక్‌కు గురైన నౌకలోని సిబ్బందిని రక్షించిన నేవీ
పాకిస్థాన్ నావికులను కాపాడిన భారత్- 36 గంటల వ్యవధిలో నేవీ సెకండ్ ఆపరేషన్