ETV Bharat / bharat

భారత్​లో డెడ్లీ మంకీపాక్స్ మరో కేసు నమోదు- గ్లోబల్ హెల్త్​ ఎమర్జెన్సీకి కారణమిదే - India Reports Mpox Strain case

India Reports Mpox Strain Case : భారత్​లో ప్రాణాంతక మంకీపాక్స్​ కేసు మరో కేసు నమోదైంది. కేరళకు చెందిన వ్యక్తికి, ప్రపంచ హెల్త్​ ఎమర్జెన్సీకి దారితీసిన 'క్లేడ్‌ 1బీ' వైరస్​ సోకిందని నిర్ధరించారు.

India Reports Mpox Strain Case
India Reports Mpox Strain Case (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2024, 6:57 PM IST

Updated : Sep 23, 2024, 7:36 PM IST

India Reports First Case Of Mpox Strain : ప్రాణాంతక మంకీపాక్స్‌కు సంబంధించి భారత్‌లో మరో కేసు నమోదైనట్లు సమాచారం. హెల్త్​ ఎమర్జెన్సీకి దారితీసిన 'క్లేడ్‌ 1బీ' స్ట్రెయిన్‌గా దీన్ని గుర్తించారు. కేరళకు చెందిన యువకుడిలో గతవారం ఈ వ్యాధి నిర్ధరణ అయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కేరళలోని మలప్పురానికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి UAE నుంచి ఇటీవల ఇండియాకు వచ్చాడు. అతడిలో ఎంపాక్స్‌ లక్షణాలు కనిపించాయి. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించగా క్లేడ్‌ 1గా నిర్ధరణ అయ్యింది. ప్రపంచ 'హెల్త్​ ఎమర్జెన్సీ'కి దారితీసిన 'క్లేడ్‌ 1బీ' స్ట్రెయిన్‌గా దీన్ని గుర్తించారు. అయితే, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్చెన్సీగా ప్రకటించినప్పటి నుంచి భారత్​లో 30కేసులు నమోదయ్యాయి.

కోలుకున్న 'క్లేడ్‌ 2' బాధితుడు
ఇండియాలో సెప్టెంబర్‌ 9న మొదటి మంకీపాక్స్‌ కేసు నమోదైంది. ఫారిన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి నమూనాలు పరీక్షించారు. అది పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్‌-2 స్ట్రెయిన్​గా నిర్ధరించారు. కాగా, దాని తీవ్రత తక్కువగా ఉన్నట్లు అప్పుడు వైద్యులు పేర్కొన్నారు. దాదాపు రెండు వారాల పాటు దిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో బాధితుడికి చికిత్స అందించారు. అనంతరం అతడిని సెప్టెంబర్‌ 21న డిశ్చార్జి చేసినట్లు అధికారులు తెలిపారు.

లక్షణాలుంటే మాకు చెప్పండి : కేరళ ఆరోగ్య శాఖ మంత్రి
దేశంలో రెండో కేసు నమోదైన నేపథ్యంలో, ఏవైనా లక్షణాలతో విదేశాల నుంచి భారత్​కు వచ్చే వారు ఆరోగ్య శాఖకు తెలియజేయాలని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జ్​ సూచించారు. తద్వారా వీలైనంత త్వరగా చికిత్స పొందాలని విజ్ఞప్తి చేశారు. ఇక, ఈ వ్యాధి సోకిన వారికి రాష్ట్రంలో వివిధ జిల్లాలో చికిత్స, ఐసొలేషన్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ప్రాణాంతక మంకీపాక్స్‌- డెన్మార్క్‌లో పరిశోధన కోసం తెప్పించిన కోతుల్లో 1958లో మొదటి సారి వెలుగు చూసింది. అనంతరం 1970లో మానవుల్లో గుర్తించారు. 2005లో కాంగోలో వేల సంఖ్యలో ఈ కేసులు నమోదుకాగా 2017 తర్వాత నైజీరియా సహా అనేక దేశాలకు వ్యాపించింది. 2022 నుంచి మళ్లీ విస్తృతంగా వ్యాప్తి చెందుతూ దాదాపు 120 దేశాలకు పాకింది. సుమారు లక్ష కేసులు నిర్థరణ అయితే తాజాగా కాంగోలో ఆందోళనకర స్థాయిలో ఈ వైరస్‌ వ్యాపిస్తోంది.

తొలిసారి మంకీపాక్స్‌ ఆర్టీ-పీసీఆర్‌ కిట్‌ తయారీ - ఏపీలోని విశాఖ మెడ్​టెక్​ జోన్​ మరో అరుదైన ఘనత - Visakha Medtech made Monkeypox Kit

మంకీపాక్స్‌పై అప్రమత్తంగా ఉండాల్సిందే - కీలక మార్గదర్శకాలు జారీచేసిన దిల్లీ ఎయిమ్స్‌ - Mpox Scare

Last Updated : Sep 23, 2024, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.