IMA Nationwide Protest : కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎమ్ఏ) సిద్ధమైంది. బుధవారం రాత్రి కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ ఆస్పత్రిలో జరిగిన విధ్వంసానికి వ్యతిరేకంగా, శనివారం(ఆగస్టు 17) ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా ఓపీ సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. కాగా, అత్యవసర సేవలు, క్యాజువాలిటీ సేవలు యథావిధిగా పనిచేస్తాయని వెల్లడించింది. రాష్ట్ర శాఖలతో సమావేశం అనంతరం ఐఎమ్ఏ ఈ నిర్ణయం తీసుకుంది.
"కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై జరిగిన క్రూరమైన ఘటనకు వ్యతిరేకంగా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా(బుధవారం రాత్రి) విద్యార్థులు నిరసన చేపట్టారు. వారు నిరసన తెలిపిన ప్రాంగణంపై అల్లరి మూకలు దాడి చేశాయి. ఈ హేయమైన చర్యకు వ్యతిరేకంగా శనివారం(ఆగస్టు 17) ఉదయం 6 గంటల నుంచి ఆదివారం(ఆగస్టు 18) ఉదయం 6 గంటల వరకు మోడర్న్ మెడిసిన్ డాక్టర్ల సేవలు ఉపసంహరించుకుంటున్నాం. వైద్య వృత్తి స్వభావం కారణంగా వైద్యులు ముఖ్యంగా మహిళలు హింసకు గురవుతున్నారు. అలాంటి డాక్టర్లకు ఆస్పత్రులు, క్యాంపస్‌ల్లో భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తల అవసరాలను పర్యవేక్షించే అధికారుల ఉదాసీనత వల్లే వైద్యులపై భౌతిక దాడులు, నేరాలు జరుగుతున్నాయి." అని ఐఎమ్ఏ ఓ ప్రకటనలో వివరించింది.
దిల్లీలో వైద్యం బంద్!
మరోవైపు, దేశ రాజధానిలో నిరసనలు ఉద్ధృతం చేసేందుకు దిల్లీ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఆర్డీఏ) రెడీ అయింది. ఈ మేరకు దిల్లీలోని AIIMS, SJH, MAMC ఆస్పత్రుల ఆర్డీఏల ప్రతినిధులు సమావేశం అయ్యారు. విస్తృత చర్చల తర్వాత, 2024 ఆగస్టు 16న దిల్లీవ్యాప్తంగా అన్ని ఆర్డీఏలు న్యూదిల్లీలోని నిర్మాన్ భవన్ వద్ది ఉమ్మడిగా నిరసనలు కార్యక్రమాలు చేయాలని నిర్ణయించాయి.
Delhi | A comprehensive joint meeting was conducted by the representatives of Resident Doctor's Associations including AIIMS Delhi, SJH, MAMC... After extensive discussions, it was unanimously decided that all RDAs across Delhi will conduct a joint protest march on August 16,… pic.twitter.com/NMZYvH7TaE
— ANI (@ANI) August 15, 2024
అర్ధరాత్రి విధ్వంసం- 19మంది అరెస్ట్
మరోవైపు, బుధవారం రాత్రి ఆర్జీ కర్ ఆస్పత్రిలో విధ్వంసం సృష్టించిన ఘటనలో 19మందిని అరెస్ట్ చేసినట్లు కోల్‌కతా పోలీసులు తెలిపారు. అందులో ఐదుగురిని సోషల్ మీడియా పోస్టుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
'సాక్ష్యాలను చెరిపివేయకుండా ఆపండి!'
ఇదిలా ఉండగా, ఆస్పత్రిలో జరిగిన విధ్వంసానికి సంబంధించి బంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. ఆర్జీ కర్ ఆస్పత్రి వద్ద సాక్ష్యాలను మరింత ధ్వంసం చేయకుండా నిరోధించడానికి సీఏపీఎఫ్ సిబ్బందిని మోహరించాలని కోరారు.
West Bengal LoP Suvendu Adhikari wrote a letter to the Union Home Secretary Ajay Bhalla and the Director of CBI regarding the vandalism that took place at R G Kar Medical College and Hospital, and seeking the deployment of CAPF to prevent further destruction of evidence at RG… pic.twitter.com/zDfDRrbsaJ
— ANI (@ANI) August 16, 2024