ETV Bharat / bharat

'వాహనాలు మాట్లాడుకుంటాయ్'- రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా 'ఐఐటీ' సాంకేతికత - ఐఐటీ జోధ్​పుర్ నోమాస్ టెక్నాలజీ

IIT Jodhpur Vehcle Technology : రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా ఐఐటీ జోధ్​పుర్ పరిశోధకులు అధునాతన ఆవిష్కరణ చేశారు. వాహనాల మధ్య కమ్యూనికేషన్ నెలకొల్పేలా సాంకేతికత అభివృద్ధి చేశారు. పూర్తి సురక్షితంగా సమాచార బదిలీ జరిగేలా దీన్ని రూపొందించారు.

IIT Jodhpur Vehcle Technology
IIT Jodhpur Vehcle Technology
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2024, 11:05 AM IST

IIT Jodhpur Vehcle Technology : రహదారిపై ప్రమాదాలు తగ్గించే దిశగా, రోడ్డు రవాణాలో విప్లవాత్మక మార్పులు తెచ్చే విధంగా ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) జోధ్​పుర్ అధునాతన సాంకేతికత రూపొందించింది. రోడ్డుపై ప్రయాణించే వాహనాల మధ్య కమ్యూనికేషన్ నెలకొల్పేలా సాంకేతికతను అభివృద్ధి చేసింది. 'నోవెల్ ఎంఏసీ బేస్డ్ ఆథెంటికేషన్ స్కీమ్' (నోమాస్- NOMAS) సాంకేతికతను తయారు చేసి వాహనాల్లో ఇన్​స్టాల్ చేసింది.

IIT Jodhpur Vehcle Technology
నోమాస్ టెక్నాలజీ పరీక్షలు

ఐఓవీ (ఇంటర్నెట్ ఆఫ్ వెహికిల్) ఆధారితంగా పని చేసినప్పటికీ ఈ డివైజ్​లోని డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుందని ఆవిష్కర్తలు చెబుతున్నారు. ఐఐటీ జోధ్​పుర్ కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా.దేబాశిష్ దాస్, పీహెచ్​డీ విద్యార్థి హిమాని సికార్వార్ ఈ సాంకేతికత అభివృద్ధిపై పని చేశారు. వీరు చేసిన ఈ ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు 'ఐఈఈఈ- ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇంటెలిజెంట్ ట్రాన్స్​పోర్టేషన్ సిస్టమ్స్​'లో ప్రచురితమయ్యాయి.

IIT Jodhpur Vehcle Technology
ప్రయోగాల కోసం రూపొందించిన నమూనా రహదారి

రహదారిపై కదులుతున్న సమయంలో వాహనాల మధ్య కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడం ఈ సాంకేతికత ద్వారా సాధ్యమవుతుంది. రియల్ టైమ్​లో వాహనాల మధ్య సమాచార బదిలీ జరుగుతుంది. రోడ్డు స్థితిగతులు ఎలా ఉన్నాయి? ట్రాఫిక్ జామ్​ ఏర్పడిందా? యాక్సిడెంట్లు ఏవైనా జరిగాయా అన్న సమాచారాన్ని పంచుకునే వీలు కలుగుతుంది. తద్వారా జరగబోయే ప్రమాదాలు నివారించడం సాధ్యమవుతుంది. అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో ఇలాంటి సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. కానీ భారత్​లో ఇలాంటి సాంకేతికత అందుబాటులో లేదు. భవిష్యత్ కోసం సన్నద్ధతలో భాగంగా ఐఐటీ జోధ్​పుర్ తాజా పరిశోధన చేపట్టింది.

IIT Jodhpur Vehcle Technology
ఆవిష్కర్తల బృందం

"ఈ సాంకేతికత వల్ల వాహనాల మధ్య కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది. కానీ ప్రమాదాల నివారణకు ఇదొక్కటే మార్గం కాదు. రహదారుల కండిషన్, ట్రాఫిక్ మేనేజ్​మెంట్, డ్రైవర్ పనితీరు, రూల్స్​కు అనుగుణంగా వాహనాలను నడపడం వంటి అంశాలు మెరుగుపడితేనే ప్రమాదాలు తగ్గుతాయి. ఎందుకంటే రహదారులపై వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి, ప్రతి దశలో మెరుగుదల కనిపిస్తేనే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుంది."
-ఐఐటీ ప్రొఫెసర్లు

ప్రొఫెసర్ దేబాశిష్ దాస్

డ్రైవర్​పైనా కన్నేసి ఉంచుతుంది!
వాహనం నడుపుతున్న డ్రైవర్ పనితీరును కూడా నోమాస్ సాంకేతికత ద్వారా విశ్లేషించవచ్చు. ఇందులోని 'డ్రైవర్స్ డ్రైవ్ మానిటర్' అనే పరికరం, చోదకుడు వాహనాన్ని ఏ విధంగా నడుపుతున్నాడనే విషయంపై అంచనాకు వస్తుంది. డ్రైవర్ ఒత్తిడిలో ఉన్నాడా అనే దానిపైనా నిర్ధరణకు వస్తుంది. ఒకవేళ ఒత్తిడిలో ఉన్నాడని అనిపిస్తే వెంటనే డ్రైవర్​ను అలర్ట్ చేస్తుంది.

Anti Sleep Glasses For Drivers : డ్రైవింగ్​లో నిద్ర వస్తోందా?.. ఇక డోంట్ వర్రీ.. సూపర్​ గ్లాసెస్​ రెడీ!

ఫాగ్ సీజన్​లో రైలు కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా భారతీయ రైల్వే చర్యలు - ఫాగ్​ పరికరాల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.