ETV Bharat / bharat

ఎన్నికల కౌంటింగ్ ఎలా జరుగుతుంది? స్ట్రాంగ్ రూమ్​లను ఎవరు తెరుస్తారు? అర్హతలేంటి? - How Votes Are Counted - HOW VOTES ARE COUNTED

How Votes Are Counted : దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఎప్పుడు లెక్కిస్తారు? ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్​లను ఎవరు తెరుస్తారు? పోలింగ్ ఏజెంట్​కు ఉండాల్సిన అర్హతలేంటి? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

How Votes Are Counted
How Votes Are Counted (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 2, 2024, 11:59 AM IST

How Votes Are Counted : దేశంలో ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 4న ఓట్ల కౌంటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుంది? విధివిధానాలేంటి? కౌంటింగ్ కేంద్రంలో ఎన్ని టేబుల్స్ ఉంటాయి? పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఎప్పుడు లెక్కిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఈసీ కౌంటింగ్ చేపడుతుంది. అందులో భాగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే అధికారుల కోసం ప్రత్యేక హ్యాండ్‌ బుక్​ను రూపొందించింది. అందులో ఎన్నికల ప్రవర్తన నియమాలు 1961లో పొందుపరిచిన 66ఏ రూల్ ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు సమయం, కౌంటింగ్ కేంద్రం, కౌంటింగ్ ఏజెంట్ల నియామకం, తొలగింపునకు సంబంధించిన విషయాలు ఈ నింబంధనలు తెలియజేస్తాయి.

రిటర్నింగ్ అధికారి
నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేది ఎన్నికల రిటర్నింగ్ అధికారి. ప్రతి అసెంబ్లీ/ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి రిటర్నింగ్ అధికారిని ఈసీ నియమిస్తుంది. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు కూడా ఉంటాయి. వారికి చట్టబద్ధమైన అధికారాలు ఉంటాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి 1961లోని రూల్ 51 ప్రకారం రిటర్నింగ్ అధికారి నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థికి లేదా వారి ఎన్నికల ఏజెంట్‌కు పోలింగ్ తేదీకి కనీసం ఒక వారం ముందు, ఓట్ల లెక్కింపు తేదీ, సమయం, పోలింగ్ కేంద్రం గురించి లిఖితపూర్వకంగా తెలియజేయాలి.

కౌంటింగ్ కేంద్రాలు
ఎన్నికల ఓట్ల లెక్కింపు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కౌంటింగ్ హాల్​లు ఉన్న కేంద్రాల్లో జరుగుతుంది. దాదాపుగా ఈ కౌంటింగ్ కేంద్రాలు జిల్లా ప్రధాన కార్యాలయంలో ఉంటాయి. కొన్నిసార్లు సబ్ డివిజన్​లో ఉండొచ్చు. లోక్​సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఒకే చోట జరుగుతుంది. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికల ఫలితాలను వేర్వేరు చోట్ల లెక్కిస్తారు. ప్రతి కౌంటింగ్ హాల్‌లో ఈవీఎం కంట్రోల్ యూనిట్ కోసం 7-14 కౌంటింగ్ టేబుళ్లు ఉంటాయి. వాటితో పాటు పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించడానికి మరో టేబుల్ అదనంగా ఉండాలి.

ఒడిశా వంటి చోట్ల పార్ల‌మెంట్, అసెంబ్లీ ఎన్నిక‌లు ఒకేసారి జ‌ర‌గాయి. అందుకే అక్కడ ఏడు టేబుళ్లను అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​కు, మిగతావి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్​కు ఉపయోగించనున్నారు. కౌంటింగ్ టేబుళ్ల వద్ద ఏజెంట్లు ఏజెంట్లు కూర్చుని లేదా నిలబడి ఉంటారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో అభ్యర్థుల పేర్లు, బ్లాక్‌ బోర్డ్, టీవీ ఉంటుంది. పరిశీలకుల ధ్రువీకరణ తర్వాత రౌండ్ ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు ఒక్కొ టేబుల్​కు ఒక్కొ మైక్రో అబ్జర్వర్ ఉంటారు.

కౌంటింగ్ ఏజెంట్​గా ఉండాలంటే అర్హత ఏంటి?
కౌంటింగ్ ఏజెంట్​గా ఉండడానికి చట్టంలో ఎటువంటి నియమాలు లేవు. అయితే కౌంటింగ్ ఏజెంట్​కు 18 ఏళ్లు నిండి ఉండాలి. 1961 ఎన్నికల ప్రవర్తనా నియమాలకు అనుగుణంగా ఫారం 18ని ఎన్నికల ఏజెంట్లు నింపాల్సి ఉంది.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ
నిర్ణీత సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) ఓట్ల కౌంటింగ్ ప్రారంభమయ్యేలా చూడాలి. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్​ను పరిశీలకుడు, ఆర్ఓ/ఓఆర్ఓ, అభ్యర్థుల సమక్షంలో తెరవాలి. లాగ్ బుక్​లో ఎంట్రీ చేసి తర్వాత స్ట్రాంగ్ రూమ్ తాళాన్ని తీయాలి. తాళానికి ఉన్న సీల్​ను తనిఖీ చేసి దాన్ని అభ్యర్థుల సమక్షంలో తెరవాలి. ఈ మొత్తం ప్రక్రియను తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయాలి. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఎవరూ కేంద్రం నుంచి బయటకు వెళ్లకూడదు. ఎన్నికల ఫలితాలు అధికారికంగా ప్రకటించిన తర్వాత మాత్రమే బయటకు వెళ్లడానికి అనుమతిస్తారు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు
ఎన్నికల ప్రవర్తన నియమాలు 1961లోని రూల్ 54Aలో వివరించిన విధంగా తొలుత రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైన 30 నిమిషాల తర్వాత ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లేకపోతే మొదటి నుంచే ఈవీఎంలోని ఓట్లను లెక్కిస్తారు.

పరారీలో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ- ప్రశ్నించేందుకు ఇంటికి వెళ్లి చూడగా! - Bhavani Revanna Absconding

దీదీ, నవీన్​కు షాక్​- కేరళలో బీజేపీ బోణీ- కర్ణాటకలో కాషాయ రెపరెపలు! - Exit Poll 2024 Lok Sabha

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.