How to Prepare Garelu Without Absorbing Too Much Oil: పండగలైనా, శుభకార్యాలైనా, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా.. ఇలా ఎప్పుడు తినాలంటే అప్పుడు చాలా మంది చేసుకునే వంటకం గారెలు. వీటిని చికెన్‌తో కలిపి తింటే టేస్ట్ వేరే లెవల్లో ఉంటుంది. రెండు తినేకాడ నాలుగు లాగించేస్తారు. కానీ.. గారెలు, వడలు వంటి డీప్ ఫ్రై ఐటమ్స్‌కు ఒక ఇబ్బంది ఉంటుంది. వాటిని కుక్ చేసి బయటకు తీసిన తర్వాత కూడా ఆయిల్ కారుతూ ఉంటాయి. కొన్నిసార్లు వాటి నిండా నూనె ఉంటుంది. దీంతో.. వాటిని ఇష్టంగా తినలేరు. ఈ పరిస్థితి రావొద్దంటే కొన్ని టిప్స్ సూచిస్తున్నారు నిపుణులు. మరి, ఆ టిప్స్ ఏంటో చూద్దామా..
పిండి రుబ్బుకోవడం: గారెలు ఆయిల్ పీల్చుకోకుండా ఉండాలంటే పిండి రుబ్బడంలో ఓ కిటుకు ఉందని నిపుణులు అంటున్నారు. చాలా మంది పిండి రుబ్బేటప్పుడు చాలా మెత్తగా రుబ్బేస్తారు. మరికొంతమంది గట్టిగా రుబ్బుతుంటారు. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల నూనె ఎక్కువగా పీల్చుకునే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి అటు గట్టిగా కాకుండా.. ఇటు మెత్తగా కాకుండా మీడియం రేంజ్‌లో పప్పు రుబ్బుకోమని సలహా ఇస్తున్నారు. తద్వారా నూనె తక్కువ పీల్చుకుంటుందని.. పైగా గారెలు టేస్ట్‌గా ఉంటాయని అంటున్నారు. వడ పిండిని కూడా ఇదే పద్ధతిలో రుబ్బుకోవాలి.
హెచ్చరిక : మీరు తరచుగా నెయిల్ పాలిష్ వాడుతున్నారా? - మీ ఆరోగ్యానికి ఏం జరుగుతుందో తెలుసా?
ఆయిల్లో వేయడం: పచ్చి పిండితో గారెలు రెడీచేసి నూనెలో వేసే సమయంలో చాలా మంది ఒక తప్పు చేస్తారు. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కగానే వేసేస్తుంటారు. ఇలా వేయడం వల్ల వాటికి ఆయిల్ ఎక్కువగా పడుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి.. ఆయిల్ ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు వేయాలని సూచిస్తున్నారు. అప్పుడే.. ఆయిల్ తక్కువగా పీల్చుకుంటాయని అంటున్నారు. అలాగని మరీ పెద్ద మంట పెట్టి వేయించినా కూడా సమస్యే. హై-ఫ్లేమ్‌లో వేయించడం వల్ల నూనె పట్టడమే కాకుండా తొందరగా గోల్డెన్ కలర్లోకి వస్తాయని.. కానీ లోపల పిండి మాత్రం ఉడకదంటున్నారు. కాబట్టి అటు తక్కువగా కాకుండా.. ఇటు ఎక్కువగా కాకుండా మీడియంలో పెట్టుకుని గారెలు వేసుకోవాలని అంటున్నారు.
అలానే తినవద్దు: చాలా మంది నూనెలో నుంచి తీయగానే ప్లేట్లోకి వేసుకుని తింటుంటారు. కానీ.. అలా తినకూడదని నిపుణులు అంటున్నారు. నూనెలో వేయించిన గారెలను టిష్యూ పేపర్ లేదా బటర్ పేపర్ లేదా కిచెన్ టవల్ మీద వేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా వేయడం వల్ల గారెలకు ఉన్న ఎక్సెస్ ఆయిల్ మొత్తం అవి పీల్చుకుంటాయని చెబుతున్నారు.
అదనంగా..
- చాలా మంది గారెలు లేదా వడలు పొంగాలని ఎక్కువ మొత్తంలో సోడా ఉప్పు వేస్తుంటారు. దీని వల్ల కూడా అవి నూనె ఎక్కువ పీల్చుకుంటాయని అంటున్నారు. కాబట్టి సరిపడినంత మాత్రమే వేసుకోవాలంటున్నారు.
- గారెలను నూనెలో వేయించుకోవడానికి ముందు నూనెలో చిటికెడు ఉప్పు వేస్తే నూనె ఎక్కువ పీల్చవని చెబుతున్నారు.
సూపర్ : ఈ బ్యూటీ టిప్స్ పాటిస్తే - నలభైలో కూడా ఇరవైలా కనిపిస్తారు!