ETV Bharat / bharat

ఇంట్లోనే రెస్టారెంట్​ స్టైల్​ "యోగా చికెన్" - ఈ టిప్స్​ పాటిస్తే​ టేస్ట్​ అద్దిరిపోద్ది! పైగా ప్రిపరేషన్​ వెరీ ఈజీ! - Yoga Chicken Recipe - YOGA CHICKEN RECIPE

Yoga Chicken Recipe : చికెన్​తో చేసే ఏ వంటకం అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక రెస్టారెంట్లలో లభించే చికెన్​ స్టార్టర్స్ టేస్ట్​ వేరే లెవల్​.​ స్టార్టర్స్​ తినాలంటే రెస్టారెంట్​కు వెళ్లడం లేదా ఆర్డర్​ చేసుకోవడం కామన్​. అయితే ఈసారి అలాంటి అవసరం లేకుండా కేవలం ఇంట్లో ఉండే పదార్థాలతోనే రెస్టారెంట్​ స్టైల్​ యోగా చికెన్​ చేసుకోవచ్చు. పేరు కొత్తగా ఉన్నా.. టేస్ట్​ అద్దిరిపోతుంది.

Yoga Chicken Recipe
Yoga Chicken Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 6, 2024, 1:11 PM IST

How To Make Sause Free Yoga Chicken Recipe : చికెన్​తో ప్రిపేర్​ చేసే రెసిపీలు ఎన్నో. కానీ, చాలా మంది ఇంట్లో కర్రీ, ఫ్రై వంటి వంటకాలను మాత్రమే తయారు చేస్తుంటారు. ఇక ఎప్పుడూ చికెన్​తో అవే చేస్తే చాలా బోర్​ అనిపిస్తుంది. తినాలన్న ఇంట్రస్ట్ కూడా ఉండదు.​ అందుకే ఇకపై అటువంటి ఫీలింగ్​ లేకుండా ఉండడానికి మీ కోసం ఒక కొత్త రెసిపీని తీసుకొచ్చాం. అదే "యోగా చికెన్​". ఈ రెసిపీ పేరు డిఫరెంట్​గా ఉన్నా.. రుచి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. పైగా వీటిని తయారు చేయడానికి ఎటువంటి సాస్​లు అవసరం లేదు. మరి ఈ రెసిపీ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఎంటో ఇప్పుడు చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బోన్‌లెస్‌ చికెన్‌ - పావు కిలో
  • గుడ్డు- 1
  • మిరియాల పొడి - టీస్పూన్​
  • కారం - టేబుల్​స్పూన్​
  • ఉప్పు రుచికి సరిపడా
  • కార్న్‌ఫ్లోర్‌- టేబుల్​స్పూన్​
  • మైదా- 2 టేబుల్​స్పూన్
  • పచ్చిమిర్చి-5
  • వైట్​ పెప్పర్​ పౌడర్​-టీస్పూన్​
  • పెరుగు- అర కప్పు
  • పసుపు- అర టీస్పూన్‌
  • వెల్లుల్లి రెబ్బలు- 4
  • ఉల్లిపాయ - ఒకటి
  • అల్లం వెల్లుల్లి పేస్ట్‌-అర టీస్పూన్‌
  • నూనె- వేయించడానికి సరిపడా
  • జీడిపప్పు - అరకప్పు

తయారీ విధానం :

  • ముందుగా చికెన్​ బాగా శుభ్రం చేసుకున్న తర్వాత వాటిని సన్నగా పొడవుగా కట్​ చేసుకోండి. తర్వాత ఒక గిన్నెలో ఎగ్​ని పగలగొట్టి.. పొడవాటి చికెన్​ ముక్కలని అందులో వేయండి.
  • తర్వాత ఇందులో మిరియాల పొడి, కారం, కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకుని బాగా కలుపుకోండి.
  • తర్వాత ఇందులోకి కార్న్​ఫ్లోర్​, మైదా పిండి వేసుకుని నీరు వేయకుండా కలుపుకోండి. ఒకవేళ పిండి గట్టిగా అయితే కొన్ని నీళ్లు కలుపుకుని పిండి మొత్తం చికెన్​ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఒక పాన్​లో చికెన్​ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్​ వేసుకుని బాగా హీట్​ చేయండి.
  • నూనె వేడెక్కాక చికెన్​ ముక్కలని వేసి డీప్​ ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు ఒక పాన్​లో కొద్దిగా ఆయిల్​ వేసుకుని అరకప్పు జీడిపప్పులను వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి.
  • తర్వాత అదే పాన్​లో మరికొంచెం నూనె వేసుకుని జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించండి. అలాగే చీలిన పచ్చి మిర్చిలు, ఉల్లి పాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి కలపండి.
  • ఇప్పుడు ఇందులోకి బాగా చిలికిన పెరుగు వేసుకుని కలపండి. పెరుగు మిశ్రమం కొద్దిగా చిక్కగా మారిన తర్వాత కొద్దిగా ఉప్పు, వైట్​ పెప్పర్ పౌడర్​ వేసుకుని మిక్స్​ చేయండి.
  • తర్వాత ఇందులోకి డీప్​ ఫ్రై చేసుకున్న చికెన్​ స్ట్రిప్స్​​ వేసుకుని బాగా కలుపుకోండి.
  • చికెన్​కి మసాలా మిశ్రమం బాగా పట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర తరుగు, ఫ్రై చేసుకున్న జీడిపప్పులు వేసుకుంటే సరిపోతుంది. క్రిస్పీ క్రిస్పీ యోగా చికెన్​ రెడీ.
  • ఎలాంటి సాస్​లు లేకుండా.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈజీగా చేసే ఈ రెసిపీని మీరు కూడా ఓ సారి ట్రై చేయండి మరి..

ఇవి కూడా చదవండి :

"అమృత్​ సరి" చికెన్ రెసిపీ - ఈ పంజాబీ స్టైల్​ ​కర్రీ తిన్నారంటే "భల్లే భల్లే" అనాల్సిందే!

ఘాటు తక్కువ, ఘుమాయింపు ఎక్కువ - "రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్" - ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి!

రెస్టారెంట్​ స్టైల్​ అపోలో చికెన్​ రెసిపీ - ఈ వర్షాకాలంలో రుచి చూడాల్సిందే గురూ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.