ETV Bharat / bharat

నిమిషాల్లో ఘుమఘుమలాడే "మీల్ మేకర్ కుర్మా"- ఈ టిప్స్​ పాటిస్తూ చేస్తే మటన్​ కూడా దిగదుడుపే! - How To Make Meal Maker Kurma - HOW TO MAKE MEAL MAKER KURMA

Meal Maker Kurma Recipe : మీల్​మేకర్​తో చేసిన వంటలు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. మరి మీకు కూడా వాటితో చేసిన వంటలు అంటే ఇష్టమా? అయితే ఎప్పుడూ ఒకటే రకం కాకుండా ఈ సారికి ఈ రెసిపీ ట్రై చేయండి. దీని టేస్ట్​.. మటన్ కంటే కూడా సూపర్​గా ఉంటుంది.

Meal Maker Kurma Recipe
How To Make Meal Maker Kurma (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 6, 2024, 1:43 PM IST

How To Make Meal Maker Kurma : ఇంట్లో కూరగాయలు ఏం లేకపోతే చాలా మంది మీల్‌మేకర్లతో కర్రీ వండుకుంటారు. ముఖ్యంగా బ్యాచిలర్స్​కు ఫేవరెట్​. కారణం.. దీనితో ఏది చేసినా నిమిషాల్లో రెడీ అవుతుంది. అంతేనా టేస్ట్​ కూడా అద్దిరిపోతుంది. అయితే మీల్​మేకర్లతో ఎప్పుడూ ఒకటే రకం కాకుండా.. ఈసారి కాస్త కొత్తగా​ కుర్మా ట్రై చేయండి. ​టేస్ట్​ సూపర్​గా ఉంటుంది. ఈ మీల్​మేకర్​ కుర్మా వేడివేడి అన్నంలోకి, పూరీ, చపాతీ, పరోటాల్లాంటివాటికి సూపర్​గా ఉంటుంది. మరి లేట్​ లేకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాల్లో చూసేద్దాం..

మీల్‌మేకర్‌ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :

  • మీల్‌మేకర్‌ -కప్పు
  • ఉప్పు- (రుచికి సరిపడా)
  • యాలకులు -4
  • లవంగాలు -4
  • మిరియాలు -అర టీస్పూన్​
  • వెల్లులి -5
  • దాల్చిన చెక్క - చిన్నది
  • చిన్న ముక్క -అల్లం
  • ఉల్లిపాయలు- 2
  • పచ్చిమిర్చి -2

కుర్మా కోసం :

  • నూనె- 4 టేబుల్​స్పూన్లు
  • పసుపు -అర టీస్పూన్​
  • బిర్యానీ ఆకు - 2
  • యాలకులు 2
  • లవంగాలు -2
  • దాల్చిన చెక్క- చిన్నది
  • పచ్చిమిర్చి- 2
  • కరివేపాకు రెమ్మలు- 2
  • కారం-టేబుల్​స్పూన్​
  • టమాట పేస్ట్​- కప్పు
  • ధనియాల పొడి -టీస్పూన్
  • వేయించిన జీలకర్ర పొడి -టీస్పూన్​
  • గరం మసాలా- పావు టీస్పూన్​
  • నీళ్లు -కొద్దిగా
  • చిలికిన పెరుగు -అరకప్పు
  • కొత్తిమీర- కొద్దిగా
  • నిమ్మరసం -టేబుల్​స్పూన్​
  • కసూరీ మేథీ -టేబుల్​స్పూన్​

మీల్‌మేకర్‌ కుర్మా తయారీ విధానం :

  • ముందుగా ఒక గిన్నెలో మీల్​ మేకర్​ వేసి.. అందులో వేడి నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి 15 నిమిషాలు అలాగే ఉంచాలి.
  • తర్వాత మిక్సీ జార్​లో యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు వేడి నీళ్లలో నానబెట్టుకున్న మీల్​మేకర్​లలోని గట్టిగా పిండి.. వాటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్​ పెట్టుకుని అందులో ఆయిల్​ వేసి.. నీరు పిండుకున్న మీల్​ మేకర్​ వేసి, కొద్దిగా పసుపు వేసి.. ఒక నిమిషం పాటు వేయించుకుని పక్కన పెట్టుకోండి.
  • అదే పాన్​లో కొద్దిగా ఆయిల్​ పోసుకుని బిర్యానీ ఆకు, దాల్చినచెక్క, యాలకులు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి ఫ్రై చేయండి. అలాగే గ్రైండ్​ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమం వేసి సన్నని మంట మీద నూనె పైకి తేలేెంతవరకు ఫ్రై చేసుకోవాలి.
  • తర్వాత టమాట పేస్ట్ వేసి కలపండి. టమాటా పేస్ట్​ మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి వేసి, కొన్ని నీళ్లు పోసి మసాలాలు మగ్గేంతవరకు కలుపుకోవాలి.
  • తర్వాత ఫ్రైడ్​ మీల్​ మేకర్​ వేసి.. ఒ కప్పు నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించుకోండి.
  • తర్వాత చిలికిన పెరుగు వేసి కలపండి. తర్వాత మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది.
  • తర్వాత కొద్దిగా కొత్తిమీర, నిమ్మరసం, కసూరీ మేథి వేసుకుంటే సరిపోతుంది.
  • నోరూరించే మీల్​ మేకర్​ కుర్మా రెడీ. మరి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి!

ఇవి కూడా చదవండి :

నోరూరించే కాంబినేషన్ కర్రీలు

నిమిషాల్లో ప్రిపేర్​ అయ్యే 'పెసరపప్పు చారు'- ఇలా చేస్తే టేస్ట్​ నెక్ట్స్​ లెవల్​ అంతే!

మన పెద్దలు తిన్న 'చల్ది అన్నం' - అనేక రోగాలకు దివ్య ఔషధం - ఇలా ప్రిపేర్ చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.