ETV Bharat / bharat

ఇడ్లీల కోసం పప్పు రాత్రంతా నానబెట్టాల్సిన పనిలేదు! - అప్పటికప్పుడు దూదిలాంటి మెత్తటి ఇడ్లీలు చేసేయండి! - Hotel Style Soft Idli Recipe - HOTEL STYLE SOFT IDLI RECIPE

Instant Idli Recipe : హోటల్​ స్టైల్​లో చేసే మెత్తటి ఇడ్లీలంటే అందరికీ ఇష్టమే! కానీ, చాలా మంది ఇంట్లో ఎప్పుడు ఇడ్లీలు తయారు చేసినా కూడా గట్టిగానే వస్తాయి. అయితే, అప్పటికప్పుడు దూదిలాంటి మెత్తటి ఇడ్లీలను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Instant Idli Recipe
Instant Idli Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 4, 2024, 4:13 PM IST

How To Make Instant idli recipe : బ్రేక్​ఫాస్ట్​లో ఎక్కువ మంది ఇష్టంగా తినే టిఫెన్స్​లో ఇడ్లీ ఒకటి. ప్లేట్ లేదా రెండు ప్లేట్ల​ ఇడ్లీలు తిన్నా కూడా.. పొట్ట లైట్​గా ఉండడంతో చాలా మంది తినడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే, ఇడ్లీలు చేయాలంటే పప్పును రాత్రి మెత్తగా గ్రైండ్​ చేసుకుని ఉదయానికల్లా సిద్ధం చేసుకోవాలి. లేదంటే ఒకేసారి పిండిని రుబ్బుకుని ఫ్రిడ్జ్​లో స్టోర్​ చేసుకుని వాడుకోవాలి. కానీ, కొన్నిసార్లు ఇంట్లో ఇడ్లీ పిండి లేనప్పుడు ఇడ్లీ తినాలని అనిపించొచ్చు. ఇలాంటప్పుడు ఇన్​స్టంట్​గా మెత్తటి ఇడ్లీలు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు :

  • బొంబాయి రవ్వ - కప్పు
  • పెరుగు- కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • మందపాటి అటుకులు- కప్పు
  • వంట సోడా- అర టీస్పూన్​
  • నీరు- సరిపడినంతా

ఇన్​స్టంట్​ ఇడ్లీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం :

  • ముందుగా అటుకులను రెండుసార్లు బాగా కడిగి.. అందులోని నీటిని పిండి మరొక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అందులో నీళ్లు పోసి ఒక 30 నిమిషాలు నానబెట్టుకోండి.
  • తర్వాత మరొక గిన్నలో పెరుగు వేసి అందులో వంటసోడా వేసి బాగా కలపండి. మీ దగ్గర పుల్లని పెరుగుంటే వాడుకోవచ్చు. అప్పుడు వంటసోడా వేయాల్సిన అవసరం లేదు.
  • తర్వాత ఇందులోకి బొంబాయి రవ్వ వేసుకుని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని కూడా అరగంట సేపు పక్కన పెట్టుకోండి.
  • నీటిలో నానబెట్టిన మందపాటి అటుకులను మిక్సీ జార్​లో వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోండి. నీరు అవసరమైతే కొద్దిగా పోసుకోవచ్చు.
  • ఈ గ్రైండ్​ చేసుకున్న అటుకుల మిశ్రమాన్ని బొంబాయి రవ్వ, పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలపండి. ఇందులోకి నీరు పోసుకుంటూ ఇడ్లీల పిండిలా కలుపుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరోసారి మిక్స్​ చేయండి.
  • తర్వాత స్టౌపై ఇడ్లీ పాత్రను పెట్టి అందులో నీళ్లను పోసి మరిగించండి. ఇడ్లీ పిండి మిశ్రమాన్ని ప్లేట్లలో వేసుకుని పాత్రలో పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. స్పాంజీ లాంటి ఇడ్లీలు రెడీ అయిపోతాయి.
  • ఈ మెత్తని ఇడ్లీలపై కాస్త నెయ్యి, కారంపొడి వేసుకుని తింటే.. టేస్ట్​ అద్దిరిపోతుంది. నచ్చితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి!

ఇవి కూడా చదవండి :

ఇంట్లో చేసే పూరీలు పొంగట్లేదా? - ఇలా చేస్తే హోటల్​ స్టైల్లో చక్కగా వస్తాయి, ఇంకా సూపర్ టేస్టీ!

'ఆలూ మాసాలా సాండ్​విచ్' - ఇలా చేసి పెడితే - పిల్లలు 'మమ్మీ ఇట్స్​ టూ యమ్మీ' అనడం పక్కా!

ఈ దోసెలు తింటే రుచికి రుచి.. బరువూ తగ్గుతారు - వెయిట్​లాస్​ కావాలనుకునేవారికి అద్భుత అవకాశం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.