ETV Bharat / bharat

రెస్టారెంట్ స్టైల్​ గ్రీన్​ చట్నీ ఇలా చేసేయండి - ఏ స్నాక్స్​లో అయినా సూపర్ ​కాంబినేషన్​! - Green Chutney - GREEN CHUTNEY

Green Chutney Recipe : రెస్టారెంట్​కు వెళ్లి స్టార్టర్స్​ ఆర్డర్​ చేసినప్పుడు.. వాటికి కాంబినేషన్​గా ఇచ్చే గ్రీన్​ చట్నీ టేస్ట్​ సూపర్​గా ఉంటుంది. అలాగే శాండ్‌విచ్‌​, పావ్‌భాజీ కూడా గ్రీన్​ చట్నీతో ఎంతో రుచిగా ఉంటాయి. అయితే.. వీటిని ఇంట్లో తయారు చేయడం ఎలాగో చాలా మందికి తెలియదు. అందుకే.. ఈ రెసిపీని తీసుకొచ్చాం. మరి, ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా..

Green Chutney
Green Chutney Recipe (ETBV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 29, 2024, 11:40 AM IST

How To Make Green Chutney : చాలా మందికి సాయంత్రం కాగానే ఏదైనా స్నాక్​ ఐటమ్​ తినాలనిపిస్తుంది. అలాగే పిల్లలు కూడా స్కూల్​ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత.. ఏదైనా స్నాక్​ ఐటమ్ చేసి పెట్టమని మమ్మీ కోరుతుంటారు. పిల్లల మాటలు కాదనలేక పకోడీలు, శాండ్‌విచ్‌​లు, బజ్జీల వంటివి ఏదో ఒకటి ప్రిపేర్​ చేస్తుంటారు. అయితే.. స్నాక్​ ఐటమ్స్ ఏవైనా కూడా గ్రీన్​ చట్నీ కాంబినేషన్​తో తింటే టేస్ట్​ అద్దిరిపోతుంది. కానీ.. చాలా మందికి ఈ గ్రీన్​ చట్నీ చేయడం రాదు. ఇది చేయడానికి ఏ పదార్థాలు వాడతారోనని అనుకుంటుంటారు. అయితే.. సింపుల్​గా గ్రీన్​ చట్నీ రెసిపీని ఎలా చేయాలి? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.

గ్రీన్ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు :

  • పాలకూర - కట్ట
  • పుదీనా - 5 కట్టలు
  • కొత్తిమీర - 5 కట్టలు
  • పెరుగు- కప్పు
  • చాట్ మసాలా - టేబుల్​స్పూన్​
  • ఉప్పు- రుచికి సరిపడా
  • నిమ్మరసం - 2 టేబుల్​స్పూన్​లు
  • పచ్చిమిర్చి-3

గ్రీన్ చట్నీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం :

  • ముందుగా కొత్తిమీర, పుదీనా ఆకులను తెంపి.. రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడగాలి.
  • అలాగే పాలకూరను కూడా శుభ్రం చేసుకోవాలి.
  • తర్వాత ఒక గిన్నెలో నీటిని వేడిచేసి అందులో పాలకూరను వేసి రెండు నిమిషాల సేపు అలా ఉంచాలి. తర్వాత పాలకూరను తీసి చల్లటి నీళ్లలో ముంచి పక్కన పెట్టుకోవాలి.
  • పుదీనా, కొత్తిమీర ఆకులను కూడా అదే విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత ఒక మిక్సీ జార్​లో పాలకూర, పుదీనా, కొత్తిమీర ఆకులను వేయాలి. రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చిలు, కొద్దిగా చాట్​ మాసాలా, నిమ్మరసం యాడ్​ చేసి మెత్తగా గ్రైండ్​ చేయాలి.
  • తర్వాత పెరుగు వేసి మరొకసారి గ్రైండ్​ చేసుకోవాలి. ఇలా పెరుగు యాడ్​ చేసుకోవడం వల్ల గ్రీన్​ చట్నీ చిక్కగా, ఫ్రెష్​గా ఎంతో రుచిగా ఉంటుంది.
  • ఇంతే.. ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని పకోడీలు, శాండ్‌విచ్‌లతో కలిపి తింటే రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది.
  • ఈ గ్రీన్​ చట్నీ టేస్ట్​ బాగుండడంతోపాటు, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మీరు కూడా గ్రీన్​ చట్నీ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి!

ఇవి కూడా చదవండి :

టిఫెన్ సెంటర్ రుచిలో "అల్లం చట్నీ" - పదే పది నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి!

టిఫిన్ సెంటర్ రుచిలో​ 'టమాట పుదీనా' చట్నీ - ఇలా చేస్తే నిమిషాల్లో రెడీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.