How To Make Apollo Chicken Recipe : చికెన్‌తో తయారు చేసుకునే వంటకాలు వందల రకాలుగా ఉంటాయి. కానీ.. ఇప్పటికీ మెజారిటీ ఇళ్లలో చికెన్‌తో రెసిపీ అంటే.. రెగ్యులర్‌గా చేసే కర్రీ మాత్రమే. ఎప్పుడూ ఒకే తరహా కర్రీ చేసుకుంటూ ఉంటారు. మీరు కూడా ఇలా ఒకేరకంగా చేసుకుంటూ ఉంటారా? అయితే.. ఈ సారి తప్పకుండా మీరు అపోలో చికెన్ రెసిపీ ట్రై చేయాల్సిందే.
ఈ రెసిపీ పేరులోనే కాదు.. రుచిలో కూడా సరికొత్తగా ఉంటుంది. చాలా మందికి అపోలో ఫిష్ అంటే తెలుసుగానీ.. అపోలో చికెన్ రెసిపీ గురించి మాత్రం తెలియదు. అందుకే.. మీకోసం ఈ సరికొత్త రెసిపీని తీసుకొచ్చాం. రెస్టారెంట్ ఫ్లేవర్కు ఏ మాత్రం తగ్గకుండా దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
అపోలో చికెన్ రెసిపీ తయారీకి కావలసిన పదార్థాలు :
- బోన్‌లెస్ చికెన్ - అర కిలో
- కార్న్‌ఫ్లోర్- పావు కప్పు
- పెరుగు- అర కప్పు
- మైదా- పావు కప్పు
- గుడ్డు- ఒకటి
- కారం-టీస్పూన్
- ధనియాల పొడి-టీస్పూన్
- వేయించిన జీలకర్ర పొడి-టీస్పూన్
- పసుపు- అర టీస్పూన్,
- వెల్లుల్లి రెబ్బలు- 4
- అల్లం వెల్లుల్లి పేస్ట్-అర టీస్పూన్
- ఉల్లిపాయ - ఒకటి,
- పచ్చిమిర్చి-2 రెండు,
- కరివేపాకు- 2 రెబ్బలు,
- రెడ్ చిల్లీ సాస్- టీస్పూన్
- నిమ్మరసం- 2 టీస్పూన్లు
- అజినమోటో- అర టీస్పూన్
- నూనె- వేయించడానికి సరిపడా
- ఉప్పు- రుచికి సరిపడా
తయారీ విధానం :
- ముందుగా బోన్‌లెస్ చికెన్‌ను బాగా కడిగి సన్నని పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- తర్వాత ఒక గిన్నెలో చికెన్ ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గుడ్డు, ఉప్పు, మైదా, కార్న్‌ఫ్లోర్ వేసి బాగా ఒక ఐదు నిమిషాల పాటు మిక్స్ చేయాలి. తర్వాత ఒక 15 నిమిషాలు పక్కన పెట్టాలి.
- ఇప్పుడు ఒక పాన్‌లో చికెన్ డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసుకుని వేడి చేయాలి.
- చికెన్ ముక్కలను విడివిడిగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి.
- తర్వాత మరొక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి.. తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
- అనంతరం కొద్దిగా రెడ్ చిల్లీ సాస్, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అజినమోటో, పసుపు, బాగా చిలికిన పెరుగు వేసి ఒక నిమిషం పాటు మూతపెట్టి లో-ఫ్లేమ్‌లో మగ్గనివ్వాలి.
- ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా టాస్ చేయాలి.
- తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండితే సరిపోతుంది.
- వేడివేడిగా ఎంతో క్రిస్పీగా ఉండే అపోలో చికెన్ రెసిపీ రెడీ అయిపోయినట్లే.. ఈ వర్షాకాలంలో మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. సరికొత్త రుచిని ఆస్వాదించండి.
ఇవి కూడా చదవండి:
సండే స్పెషల్ : జింజర్ పెప్పర్ చికెన్ రెసిపీ - ఆహా ఏమి రుచి అంటారంతే!