ETV Bharat / bharat

మీ వద్ద ఓటింగ్ స్లిప్ లేదా? ఈజీగా ఆన్​లైన్​లో డౌన్ లోడ్ చేసుకోండిలా! - lok sabha elections 2024 - LOK SABHA ELECTIONS 2024

How To Download Voting Slip : ఓటు హక్కును వినియోగించుకోవడానికి మీ వద్ద ఓటింగ్ స్లిప్ లేదా? అయితే ఈ స్టోరీ కోసమే. ఆన్​లైన్​లో ఈజీగా ఓటింగ్ స్లిప్​ను డౌన్​లోడ్ చేసుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Download Voter Slip
How To Download Voter Slip
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 1:44 PM IST

How To Download Voting Slip : దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికలు, తెలంగాణలో ఎంపీ ఎన్నికల పోరు మే 13న జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటు హక్కు ఉన్నవారు ఓటింగ్ స్లిప్​లను ఆన్​లైన్​లో పొందడం ఎలాగో తెలుసుకుందాం.

ఓటింగ్ స్లిప్​ను కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) జారీ చేస్తుంది. ఇందులో ఓటరు పేరు, వయసు, లింగం, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్ నంబరు, పోలింగ్ తేదీ, సమయం తదితర వివరాలు ఉంటాయి. అయితే ఈ ఓటింగ్ స్లిప్​లను ప్రభుత్వ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు ఇలా ఎవరో ఒకరు ఎన్నికల సమయంలో ఓటర్లకు అందిస్తారు. అయితే ఎన్నికలప్పుడు హడావుడిగా ఓటేయడానికి వచ్చిన కొందరు ఈ ఓటింగ్ స్లిప్​లను అందుకోలేకపోవచ్చు. అప్పుడు మీ ఫోన్​లోనే ఆన్​లైన్ ద్వారా ఈజీగా ఓటింగ్ స్లిప్​ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగో చూద్దాం.

  • మొదట ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్​లో 'ఓటర్ హెల్ప్ లైన్' అనే యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత E-EPIC అనే ఆప్షన్​పై క్లిక్ చెయ్యాలి.
  • అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాస్​వర్డ్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి. తర్వాత ఓటర్ ఐడీ కార్డులో ఉన్న EPIC నంబర్​ను ఎంటర్ చేయండి.
  • అనంతరం ఓటింగ్ స్లీప్​ను తీసుకోవడానికి మరోసారి ఓటీపీను ఎంటర్ చేయండి.

యాప్​ ద్వారానే కాకుండా వెబ్‌సైట్​ను ఉపయోగించి కూడా ఓటింగ్ స్లిప్​ను ఈ విధంగా డౌన్​లోడ్ చేసుకోవచ్చు

  • voters.eci.gov.in అనే వైబ్​సైట్​ను సందర్శించండి.
  • ఆపై మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్, పాస్​వర్డ్​ను ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  • అనంతరం డౌన్​లోడ్ E-EPIC ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి.
  • ఆపై ఓటరు ఐడీలో ఉండే EPIC నంబర్​ను ఎంటర్ చేయండి.
  • ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత E-EPIC డౌన్​లోడ్ అవుతుంది.

e-EPIC కార్డుతో ప్రయోజనం ఏమిటి?
డిజిటల్ ఫార్మాట్‌లో ఓటర్లు తమ గుర్తింపు సమాచారాన్ని భద్రపర్చుకునే అత్యుత్తమ ప్రత్యామ్నాయం ఈ-ఎపిక్ కార్డు. దీని పీడీఎఫ్ ఫోన్​లో ఉంటే ఓటరు గుర్తింపు కార్డు ప్రింట్‌ను పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. మన ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ వంటి వివరాలు కూడా ఓటరు ఐడీతో అటాచ్ కావడానికి దోహదం చేస్తున్న అత్యుత్తమ మార్గం ఈ-ఎపిక్ కార్డు.

'EVM ఓట్లతో VVPAT స్లిప్పులను 100 శాతం సరిపోల్చడం కుదరదు'- సుప్రీం కోర్టు కీలక తీర్పు - SC Judgment On EVM VVPAT

అమేఠీలో రాహుల్‌, రాయ్‌బరేలీలో ప్రియాంక పోటీ- నామినేషన్లకు ముందు అయోధ్యకు పయనం! - Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.