ETV Bharat / bharat

ఆ రాశి యువతీ, యువకులకు త్వరలోనే వివాహం జరగడం ఖాయం! - ఈ రోజు రాశిఫలాలు

Horoscope Today January 21st 2024 : జనవరి 21న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 21st January 2024
Horoscope Today January 21st 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 6:16 AM IST

Updated : Jan 21, 2024, 7:19 AM IST

Horoscope Today January 21st 2024 : జనవరి 21న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి సాధారణంగా గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా వేదనకు గురవుతారు. ఖర్చులు పెరుగుతాయి. శాంతియుతంగా మాట్లాడాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. దైవ ప్రార్థన చేయడం మంచిది.

.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారి తారాబలం బాగుంది. అందువల్ల అదృష్టం కలిసి వస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా లాభపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారు గొడవలకు దూరంగా ఉండాలి. సమయానుకూలంగా నడుచుకోవాలి. కోపతాపాలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు ఏర్పడవచ్చు. శాంతియుతంగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారి తారాబలం బాగుంది. వ్యాపార, వ్యవహారాల్లో మంచి లాభాలు సంపాదిస్తారు. అవివాహితులకు వివాహ యోగం ఉంది. త్వరలోనే మీరు కోరుకున్న వ్యక్తి మీకు లభిస్తారు. స్నేహితులను కలుసుకుంటారు. భవిష్యత్ కోసం డబ్బులు ఆదా చేస్తారు.

.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి, అద్భుత విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే సూచనలు ఉన్నాయి. ఆస్తి వ్యవహారాల్లో మీకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో మీకు లాభం చేకూరుతుంది. ఆరోగ్యం ఫర్వాలేదు.

.

కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. దీని వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. విదేశాల్లోని మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. దైవ ప్రార్థన చేస్తే, అంతా మంచే జరుగుతుంది.

.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారు ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కఠినంగా మాట్లాడి ఎవ్వరినీ బాధించకూడదు. కోపం ప్రదర్శిస్తే, అది మీకే నష్టాన్ని చేకూరుస్తుంది. అనైతిక, చట్టవిరుద్ధమైన పనులకు దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారు చాలా సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి ఆనందంగా ఉంటారు. సమాజంలో మీకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారికి అద్భుతంగా ఉంటుంది. సంపద, సంతోషం అన్నీ కలిసి వస్తాయి. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. స్నేహితుల నుంచి, సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. కొన్ని సమస్యలు మీకు మనోవేదన కలిగిస్తాయి. సరైన నిర్ణయాలు తీసుకోలేక మీరు ఇబ్బందిపడతారు. పనులన్నీ ఓకేసారి మీ నెత్తిన పడతాయి. దైవ ప్రార్థనతో మానసిక ప్రశాంతత లభించే అవకాశం ఉంది.

.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభరాశివారికి ఏమాత్రం బాగుండదు. తీవ్రమైన భావోద్వేగాలకు గురవుతారు. మానసిక ప్రశాంతత పోతుంది. విద్యార్థులు మాత్రం కష్టపడి చదివితే, కచ్చితంగా సఫలం అవుతారు. నిర్దేశించిన పనులను సకాలంలోనే పూర్తి చేయగలుగుతారు. మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు. భవిష్యత్​లో ఇది మీకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది.

.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారికి శుభ ఫలితాలు కలుగుతాయి. భవిష్యత్​ కోసం పెద్దల చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సృజనాత్మకంగా ఆలోచిస్తారు. ఆత్మవిశ్వాసంతో పని చేస్తారు. ఆర్థికంగా లాభపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

Last Updated : Jan 21, 2024, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.